Nimmala Ramanaidu : ఆంధ్రప్రదేశ్ నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు వైసీపీ నేతలపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఇటీవల వైసీపీ సీనియర్ నేత అంబటి రాంబాబు చేసిన ఆరోపణలు పూర్తిగా నిరాధారమని, అవి ప్రజలను తప్పుదోవ పట్టించడానికి చేసిన దుష్ప్రచారమని ఆయన విమర్శించారు. మంత్రి నిమ్మల మాట్లాడుతూ, “అమరావతిని లేపడానికి పొన్నూరును ముంచేశారంటూ అంబటి చేసిన వ్యాఖ్యలు నీటి మూటలు, నీటి మాటలు మాత్రమే. అసలు విషయాలు వారికి తెలియకపోయినా అబద్ధాలు చెబుతూ భయాందోళనలు సృష్టిస్తున్నారు” అని అన్నారు. గుంటూరు ఛానల్ హెడ్ రెగ్యులేటర్ స్థితి గురించి అడిగితే స్పష్టమైన సమాధానం ఇవ్వలేకపోయారని మంత్రి ఎద్దేవా చేశారు.
Visakhapatnam : విశాఖ ఉక్కు,ప్రైవేటీకరణ, లులూ మాల్ భూకేటాయింపుపై విపక్షాల పోరాటం
అంతేకాదు, చేబ్రోలు, తాడికొండ, మంగళగిరి, పెదకాకాని మండలాల్లో 200 నుండి 300 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైన విషయం కూడా వైసీపీ నేతలకు తెలియదని విమర్శించారు. వైసీపీ నేతలు కేవలం పొన్నూరు గురించే కాకుండా, ప్రకాశం బ్యారేజ్ గేట్లు పనిచేయడం లేదంటూ, బెజవాడ మునిగిపోతుందంటూ, కాపర్ డ్యాం కొట్టుకుపోతుందంటూ, తుంగభద్ర గేట్లు లేవడం లేదంటూ నిత్యం అసత్యాలే ప్రచారం చేస్తున్నారని మంత్రి ఆరోపించారు. “వైసీపీ మీడియా, సోషల్ మీడియా కలిసికట్టుగా ప్రజల్లో భయాన్ని, అనుమానాలను రేకెత్తిస్తూ అశాంతి వాతావరణం సృష్టించడానికి ప్రయత్నిస్తున్నాయి. నేతి బీరకాయలో నెయ్యి ఉండదన్నట్లుగానే వైసీపీ నేతల మాటల్లో నిజాయితీ ఉండదు” అని మంత్రి నిమ్మల రామానాయుడు ఘాటుగా వ్యాఖ్యానించారు.
YSRCP vs TDP Fight: విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై టీడీపీ, వైసీపీ కార్పొరేటర్ల మధ్య తోపులాట..