Minister Narayana : విశాఖ అభివృద్ధికి సరికొత్త మాస్టర్ ప్లాన్.. హైదరాబాద్ తరహాలో సెమీ రింగ్ రోడ్డు
- విశాఖ 2041 మాస్టర్ ప్లాన్‌కు ఫైనల్ టచ్
- హైదరాబాద్ తరహాలో సెమీ రింగ్ రోడ్డు
- ఎమ్మెల్యేల అభ్యంతరాల్లో 90% పరిష్కారం
- గ్లోబల్ సిటీగా విశాఖకు కొత్త విజన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Minister Narayana : ఆంధ్రప్రదేశ్ ఆర్థిక రాజధాని విశాఖపట్నం రూపురేఖలను మార్చే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. విశాఖపట్నం మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్‌మెంట్ అథారిటీ (VMRDA) మాస్టర్ ప్లాన్‌పై తుది విడత అభిప్రాయాలను సేకరించి, త్వరలోనే దానిని ఖరారు చేస్తామని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి నారాయణ వెల్లడించారు. VMRDA మొత్తం పరిధి 6,836 చదరపు కిలోమీటర్లు ఉండగా, అందులో 4,387.36 చదరపు కిలోమీటర్ల మేర ‘2041 మాస్టర్ ప్లాన్’ ఇప్పటికే సిద్ధమైందని, మిగిలిన ప్రాంతానికి సంబంధించిన ప్లాన్‌ను రానున్న అక్టోబర్ నాటికి పూర్తి చేస్తామని ఆయన పేర్కొన్నారు. గతంలో 2021లో రూపొందించిన మాస్టర్ ప్లాన్‌పై ప్రజలు , ప్రజాప్రతినిధుల నుంచి భారీగా అభ్యంతరాలు రావడంతో, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు దానిని రీవిజిట్ చేస్తున్నట్లు మంత్రి తెలిపారు.
మాస్టర్ ప్లాన్‌పై మొదటి విడతలో 3,720, రెండో విడతలో 1,236 అభ్యంతరాలు రాగా, ఎమ్మెల్యేలు లేవనెత్తిన అంశాల్లో దాదాపు 90 శాతానికి పైగా సమస్యలను పరిష్కరించామని మంత్రి నారాయణ వివరించారు. సమీక్షకు రాలేకపోయిన ఇతర ఎమ్మెల్యేలతో కూడా చర్చించిన తర్వాతే తుది మాస్టర్ ప్లాన్‌ను అధికారికంగా ప్రకటిస్తామని ఆయన స్పష్టం చేశారు. ఇక నగర రవాణా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తెచ్చేందుకు హైదరాబాద్ తరహాలో విశాఖలో కూడా ‘సెమీ రింగ్ రోడ్డు’ నిర్మాణాన్ని ముఖ్యమంత్రి ప్రతిపాదించారు. రాంబిల్లి నుంచి భోగాపురం వరకు సుమారు 102 కిలోమీటర్ల మేర నిర్మించనున్న ఈ రోడ్డుకు సంబంధించిన డీపీఆర్ (DPR) ఈ నెల చివరి నాటికి సిద్ధమవుతుందని, దీనితో పాటు భోగాపురం ఎయిర్పోర్టుకు బీచ్ కారిడార్ అనుసంధానంపై కూడా ప్రతిపాదనలు ఉన్నాయని ఆయన వెల్లడించారు.
Also Read
- CM Chandrababu: అమరావతి 2.0 ఇంటిగ్రేటేడ్ మాస్టర్ ప్లాన్ పై సీఎం సమీక్ష.. ప్రపంచస్థాయి నగరంగా..!
- Deputy CM Pawan Kalyan: సీఎం రేవంత్ రెడ్డికి పవన్ కల్యాణ్ లేఖ.. షాబాద్ ఘటన ప్రస్తావన..
- Mudragada Padmanabham: మరణానంతరం ఎలా ఉండాలో ముందే లేఖ రాసిన ముద్రగడ.. ఆసక్తికర అంశాలు
- Deputy CM Pawan Kalyan: సీఎస్, డీజీపీకి డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ లేఖ.. పోక్సో కేసులపై కీలక సూచనలు
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మున్సిపాలిటీల్లో పారిశుద్ధ్య మెరుగుదల కోసం మురుగునీటి శుద్ధి ప్లాంట్లను (STP) ఏర్పాటు చేస్తున్నామని మంత్రి తెలిపారు. అదేవిధంగా, ప్రజలపై ఆర్థిక భారం పడకుండా ఆస్తి పన్ను (Property Tax) విషయంలో పాత పద్ధతినే కొనసాగిస్తున్నామని ఆయన ఒక ముఖ్యమైన ప్రకటన చేశారు. విశాఖను గ్లోబల్ సిటీగా మార్చే క్రమంలో మాస్టర్ ప్లాన్ , రింగ్ రోడ్డు వంటి ప్రాజెక్టులు అత్యంత కీలకంగా మారనున్నాయని మంత్రి నారాయణ పునరుద్ఘాటించారు.
తాజావార్తలు
-
Story Board : పంజా విసురుతున్న ఎల్‌నినో.. ముంచుకొస్తున్న ఆహార సంక్షోభం..
-
USA: “నువ్వు ముస్లింవా?” అని భారతీయుడిపై 15 సార్లు కత్తితో దాడి..
-
India U-19 vs Sri Lanka U-19: చరిత్ర సృష్టించిన భారత యువ ఓపెనర్లు.. రికార్డుల మోత
-
Tragedy: దమ్ముంటే హైదరాబాద్‌కు రమ్మన్నాడు.. నిజంగానే వచ్చి చంపేశారు.. ఏం జరిగిందంటే..
-
Iran: ఇరాన్ నెక్ట్స్ టార్గెట్ ఇదేనా? మరో సంక్షోభం రానుందా?
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్‌లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్‌తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!