CM Chandrababu: దేవాదాయ శాఖలో 137 ఉద్యోగాల భర్తీకి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆమోదం తెలిపారు. డిప్యూటీ కమిషనర్ సహా గ్రేడ్ 1, 3 ఈవో పోస్టుల ఖాళీలను భర్తీ చేయాలని పేర్కొన్నారు.
Endowment Department: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దాతల సహకారంతో శ్రీశైలం, సింహాచలం ఆలయాల్లో మరమ్మత్తు పనులకు దేవాదాయ శాఖ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. ఆలయంలో పైకప్పు లీకేజీలు అరికట్టేందుకు ఈ మరమ్మత్త పనులు నిర్వహణ కొనసాగించనున్నారు.
దేవాదాయ శాఖపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షా సమావేశంలో దేవదాయ శాఖపై కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రిలీజియస్ టూరిజం ప్రమోషన్ కోసం ఎండో, ఫారెస్ట్, టూరిజం మంత్రులతో కమిటీ వేస్తున్నామని సీఎం చంద్రబాబు తెలిపారు.
Minister Kottu Satyanarayana: త్వరలో రాష్ట్రంలో 3 వేల చిన్న తరహా దేవాలయాల అభివృద్ధి చేస్తాం.. ఒక్కో దేవాలయ నిర్మాణానికి రూ. 10 లక్షలు మంజూరు చేస్తామని తెలిపారు దేవదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ.. ఆ శాఖ అధికారులతో ఇవాళ సమీక్ష నిర్వహించిన మంత్రి.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా దేవాలయాల్లో వివాదంలో ఉన్న 4,700 ఎకరాలను సంబంధిత దేవస్థానాలకు చెందేలా జీవో తీసుకొస్తున్నాం అని వెల్లడించారు.. డీఐజీ స్థాయి అధికారులతో విజిలెన్స్ సెల్…
Andhra Pradesh: ఈనెల 31న వినాయకచవితి పండగ నేపథ్యంలో ఏపీ వ్యాప్తంగా వినాయకుడి మండపాలను ఏర్పాటు చేస్తున్నారు. అయితే వినాయక చవితి మండపాలు ఏర్పాటు చేయాలంటే అధికారులు ప్రత్యేకంగా రుసుము వసూలు చేస్తున్నారంటూ సోషల్ మీడియాలో తెగ ప్రచారం జరుగుతోంది. అయితే ఈ వార్తలపై ఏపీ దేవాదాయ శాఖ కమిషనర్ హరి జవహర్‌లాల్ స్పందించారు. రాష్ట్రంలో వినాయక చవితి మండపాల ఏర్పాటుకు ఎటువంటి రుసుములు వసూలు చేయడం లేదని వివరణ ఇచ్చారు. వినాయక చవితి మండపాలు ఏర్పాటు…
ఏపీ దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రధాన దేవాలయాల్లో బ్రాహ్మణేతురులను అర్చకులుగా నియమించడానికి చర్చలు జరగాలని ఆయన వ్యాఖ్యానించారు. ఈ విషయంపై పండితులు, అధికారులతో చర్చించి నిర్ణయం తీసుకోవాలన్నారు. అనువంశిక అర్చకత్వం కొన్ని దేవాలయాల్లో మాత్రమే ఉందన్నారు. దళిత వాడల్లో దళితులనే అర్చకులుగా నియమించడం ఎప్పట్నుంచో ఉందన్నారు. రాష్ట్రంలో అన్ని దేవాలయాల్లో ఆన్‌లైన్ ప్రక్రియపై దృష్టి పెడుతున్నామని మంత్రి కొట్టు సత్యనారాయణ తెలిపారు. దేవాదాయ శాఖకు సంబంధించి అనేక సమస్యలు పెండింగ్‌లో…
ఏపీ దేవాదాయ శాఖలో డిప్యుటేషన్ పేరుతో రెవెన్యూ అధికారుల పెత్తనానికి బ్రేకులు పడనున్నాయ్. ప్రధాన ఆలయాలకు ఈవోలుగా డిప్యూటీ కలెక్టర్లను నియమించే విధానానికి ప్రభుత్వం స్వస్తి పలకనుంది. నిబంధనలు ఉల్లంఘించి చేపట్టిన నియమకాలపై సుదీర్ఘంగా న్యాయ వివాదం జరగ్గా చివరకు దేవాదాయ శాఖ ఉద్యోగులకు ఊరట లభించింది. రాష్ట్రంలో 8 ప్రధాన ఆలయాలు దేవాదాయ, ధర్మాదాయ శాఖ పరిధిలో ఉన్నాయి. వీటిలో సింహాచలం, కాణిపాకం, ద్వారకా తిరుమల, శ్రీశైలం, శ్రీకాళహస్తి ముఖ్యమైనవి. ఈ ఆలయాలకు వచ్చే భక్తుల…
ఏపీ దేవదాయ శాఖలో ఇటీవల జరిగిన కొన్ని పరిణామాలు తీవ్ర చర్చకు దారి తీస్తున్నాయి. ప్రభుత్వం సదుద్దేశంతో చేపట్టే కార్యక్రమాల అమలులో అధికారులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారట. సింహాచలం, మాన్సాస్ ట్రస్ట్ అంశాలు ఆ కోవలోకే వస్తున్నాయట. అదేంటో ఈ స్టోరీలో చూద్దాం. దేవాదాయశాఖ ఉన్నతాధికారులు తీవ్ర అలక్ష్యం! ఇటీవల ఏపీలో రాజకీయమంతా దేవాదాయశాఖ చుట్టూనే నడుస్తోంది. ఉత్తరాంధ్రలో సింహాచలం భూములు, మాన్సాస్ ట్రస్ట్ వ్యవహారాల్లో కీలక పరిణామాలు జరుగుతున్నాయి. మాన్సాస్‌లో పెద్దఎత్తున అవకతవకలు జరిగాయనేది ప్రధాన ఆరోపణ.…