చంద్రబాబు గ్లిజరిన్ పెట్టుకుని ఏడ్చాడు: మంత్రి కొడాలి నాని
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టీడీపీ అధినేత చంద్రబాబుపై మంత్రి కొడాని నాని అసెంబ్లీలో తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వంగవీటి రంగా, ఎలిమినేటి మాధవరెడ్డి హత్యలను చంద్రబాబే చేశాడని బయట మాట్లాడుకుంటున్నారని.. అందుకే ఆ హత్యల గురించి సభలో చర్చించాలని మంత్రి కొడాలి నాని సూచించారు. వైఎస్ వివేకానందరెడ్డి హత్య గురించి చంద్రబాబు ఎలా మాట్లాడుతున్నాడో.. రంగా, మాధవరెడ్డి హత్యల గురించి కూడా చర్చించాల్సిన అవసరం ఉందని కొడాలి నాని అన్నారు. అన్ని విషయాలపై చర్చించాలని తాము చెప్తే… నా కుటుంబం గురించి మాట్లాడారు.. నా భార్య గురించి మాట్లాడారు అంటూ చంద్రబాబు సింపతీ కార్డులు తీస్తున్నాడని కొడాలి నాని ఎద్దేవా చేశారు.
Read Also: భార్య పేరుతో చంద్రబాబు సింపతీకి ప్రయత్నిస్తున్నారు: అంబటి రాంబాబు
Also Read
ప్రస్తుతం చంద్రబాబు పని అయిపోయిందని.. అందుకే ఈ పరిస్థితుల్లో ఉన్న ఏకైక అస్త్రం సింపతీ అని.. దాని కోసం చంద్రబాబు చేయాల్సినవన్నీ చేస్తున్నాడని మంత్రి కొడాలి నాని ఆరోపించారు. చంద్రబాబు గ్లిజరిన్ రాసుకుని ఏడ్చాడని.. అసలు గ్లిజరిన్ సరిగ్గా రాసుకోకపోవడం వల్ల ఆయనకు కన్నీళ్లు రాలేదని కొడాలి నాని ఎద్దేవా చేశారు. ముందస్తు ప్లాన్ ప్రకారమే చంద్రబాబు అసెంబ్లీ నుంచి వాకౌట్ చేశారన్నారు. నిన్న అసెంబ్లీకి చంద్రబాబు రాలేదని… దాదాపు రెండున్నర గంటల పాటు పార్టీ నేతలతో చర్చించిన తర్వాతే నిన్న సాయంత్రమే ఈ నిర్ణయం తీసుకున్నారని కొడాలి నాని తెలిపారు. సభ నుంచి వెళ్లిపోవాలని చంద్రబాబు నిన్నే డిసైడ్ అయ్యారని.. ఈ విషయం తనకు మంత్రి బొత్స సత్యనారాయణ చెప్పాడని వివరించారు. రాజకీయం కోసం చంద్రబాబు ఏమైనా చేయగలడని… చంద్రబాబు చేసేవన్నీ మంగమ్మ శపథాలేనని ఎద్దేవా చేశారు.
తాజావార్తలు
-
Ambati Rambabu: రావణ్‌పై యూఏపీఏ కేసు అన్యాయం.. పోరాటానికి మా మద్దతు
-
IND vs ENG: అతడు ఎందుకు దండగ.. ఎప్పుడో జట్టు నుంచి తప్పించాల్సింది!
-
Botsa Satyanarayana: గవర్నర్‌కు బొత్స లేఖ.. విశాఖలో వద్దు.. విజయనగరం మార్చండి..!
-
2026 Tata Harrier: టాటా హారియర్, సఫారీ స్టెల్త్ ఎడిషన్ విడుదల.. 13 JBL స్పీకర్లు, లెవెల్-2 ADASతో అదిరిపోయే ఫీచర్లు
-
Lenin : అఖిల్‌కు మాజీ వదిన కంగ్రాట్స్.. సోషల్ మీడియాలో సామ్ పోస్ట్ వైరల్
ట్రెండింగ్
-
Virat Smartphone సిరీస్.. లావా, ఫ్లిప్‌కార్ట్ భాగస్వామ్యం.!
-
8000mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme NARZO 100x 5G జూలై 15న లాంచ్.!
-
Rainy Season Tips : వర్షాకాలంలో బూట్ల దుర్వాసనకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
IP69K రేటింగ్, 9000mAh బ్యాటరీతో లాంచ్ కానున్న REDMI Note 17 Pro..!
-
TGSRTCలో 1,500 కండక్టర్ పోస్టులు.. రాత పరీక్ష లేకుండానే ఉద్యోగం.!