Arnab Cyclone Alert: తుఫాన్‌పై హైఅలర్ట్.. అత్యవసరమైతే తప్ప ప్రయాణాలు వద్దు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Arnab Cyclone Alert: బంగాళాఖాతంలో ఏర్పడిన ‘అర్నబ్’ తుఫాన్ తీవ్రరూపం దాల్చే అవకాశం ఉండటంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్రమత్తమైంది. తుపాను ముప్పును ఎదుర్కొనేందుకు రాష్ట్ర యంత్రాంగాన్ని సన్నద్ధం చేసి హైఅలర్ట్ ప్రకటించినట్లు హోంమంత్రి వంగలపూడి అనిత తెలిపారు. అమరావతిలోని విపత్తుల నిర్వహణ విభాగం, రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ (ఆర్టీజీఎస్) అధికారులతో ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తూ తుపాను గమనం, తీవ్రతను నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు వెల్లడించారు. తీరప్రాంత ప్రజల ప్రాణ, ఆస్తి నష్టాన్ని నివారించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని హోంమంత్రి స్పష్టం చేశారు. అన్ని శాఖల అధికారులు క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండి, అత్యవసర పరిస్థితులు ఎదురైతే వెంటనే సహాయక చర్యలు చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు.
గంటకు 125 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం
అర్నబ్ తుఫాన్ ఇవాళ అర్ధరాత్రికి తీవ్ర తుఫాన్‌గా, రేపు అతి తీవ్ర తుపానుగా మారే అవకాశం ఉందని హోంమంత్రి అనిత పేర్కొన్నారు. ఎల్లుండి ఉదయం బాపట్ల–విశాఖపట్నం మధ్య యానాం సమీపంలో తీరాన్ని దాటే అవకాశాలున్నాయని తెలిపారు. తుఫాన్ తీరం దాటే సమయంలో గంటకు 115 నుంచి 125 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే ప్రమాదం ఉందని హెచ్చరించారు.
Also Read
- Arnab Cyclone Alert: అర్నబ్ తుఫాన్ ఎఫెక్ట్.. విద్యుత్ ఉద్యోగుల సెలవులు రద్దు
- Arnab Cyclone Alert: తుఫాన్ విరుచుకుపడుతుంది.. విద్యా సంస్థలకు సెలవులు ఇవ్వండి.. సీఎం ఆదేశాలు..
- AP Local Body Elections: నామినేషన్ల నుంచి ఏకగ్రీవాల వరకు వివాదాలు.. ఎస్ఈసీకి వైసీపీ ఫిర్యాదు
- Arnab Cyclone Alert: ఆర్నబ్ తుఫాన్‌పై సీఎం చంద్రబాబు సమీక్ష.. కలెక్టర్లకు కీలక ఆదేశాలు
ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు సిద్ధం
తుఫాన్ ప్రభావం ఉండే జిల్లాలకు ఇప్పటికే జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం (ఎన్డీఆర్ఎఫ్), రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన దళం (ఎస్డీఆర్ఎఫ్), అగ్నిమాపక సిబ్బందిని తరలించినట్లు హోంమంత్రి వెల్లడించారు. అవసరమైన ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టేందుకు అధికారులు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. తుపాను ప్రభావాన్ని నిరంతరం అంచనా వేస్తూ, పరిస్థితులకు అనుగుణంగా చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు.
అత్యవసరమైతే తప్ప ప్రయాణాలు చేయొద్దు
ప్రస్తుతం వాతావరణం ప్రశాంతంగా ఉందని నిర్లక్ష్యం వహించవద్దని హోంమంత్రి ప్రజలకు సూచించారు. మంగళ, బుధవారాల్లో అత్యవసర పరిస్థితుల్లో తప్ప ప్రయాణాలు చేయవద్దని విజ్ఞప్తి చేశారు. రాబోయే మూడు రోజులపాటు తీరప్రాంత ప్రజలు, మత్స్యకారులు, రైతులు అప్రమత్తంగా ఉండాలని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
పుకార్లు నమ్మొద్దు.. అధికారిక సమాచారాన్నే అనుసరించాలి
తుఫాన్ నేపథ్యంలో సోషల్ మీడియాలో ప్రచారమయ్యే పుకార్లు, వదంతులను ప్రజలు నమ్మవద్దని హోంమంత్రి అనిత హితవు పలికారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ (ఏపీఎస్డీఎంఏ), ఆర్టీజీఎస్ జారీ చేసే అధికారిక హెచ్చరికలు, సూచనలను మాత్రమే అనుసరించాలని కోరారు. ప్రజల భద్రత కోసం ప్రభుత్వం అన్ని ముందస్తు చర్యలు తీసుకుంటోందని, ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు ఏపీ హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత..
తాజావార్తలు
-
Aadarsha Kutumbam: ‘ఆదర్శ కుటుంబం’ టికెట్ రేట్ల పెంపునకు ఏపీలో గ్రీన్ సిగ్నల్..
-
TGGENCO : టీజీ జెన్కో బొగ్గు రవాణాకు ఒడిశా ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్
-
Arnab Cyclone Alert: తుఫాన్‌పై హైఅలర్ట్.. అత్యవసరమైతే తప్ప ప్రయాణాలు వద్దు..!
-
Arnab Cyclone Alert: అర్నబ్ తుఫాన్ ఎఫెక్ట్.. విద్యుత్ ఉద్యోగుల సెలవులు రద్దు
-
Ethanol Cars: ఇండియాలో ఇక పెట్రోల్ కార్లకు స్వస్తి.. E100 ఇథనాల్ ఫ్యూయల్ వాహనాలకు గ్రీన్‌సిగ్నల్..
ట్రెండింగ్
-
Winter Diet Tips : చలికాలంలో బరువు తగ్గాలా? ఈ 6 ఆహారాలతో లాభాలెన్నో.!
-
AI Chatbot Privacy: ఏఐ చాట్బాట్లలో ఈ వివరాలు షేర్ చేస్తున్నారా? జాగ్రత్త
-
Indoor Play Ideas : దీపావళి వేళ.. బయట కాలుష్యం.. ఇంట్లోనే పిల్లలకు 7 సరదా ఆటలు.!
-
Masoor Dal Face Pack : పండగ వేళ ముఖానికి మెరుపు.. మసూర్ దాల్‌తో ఇలా
-
Google Jobs: గూగుల్‌లో ఉద్యోగం కావాలా? ఈ సీనియర్ రిక్రూటర్ చెప్పిన ట్రిక్స్ పాటించండి..