Kakani Govardhan Reddy: జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై ఘాటు వ్యాఖ్యలు చేశారు మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి… పవన్ గురించి నన్ను అడిగి అవమానించొద్దు.. రెండు సార్లు గెలిచిన నన్ను.. రెండు చోట్ల పోటీ చేసి ఓడిపోయిన పవన్ గురించి అడగొద్దు అని వ్యాఖ్యానించారు.. ఇక, నిన్న తెనాలి వేదికగా.. 175 స్థానాల్లో పోటీ చేయగలరా? అని చంద్రబాబునే సీఎం వైఎస్ జగన్ అడిగారు.. కానీ, పవన్ కల్యాణ్‌ని అడగలేదన్నారు.. అసలు పవన్ కల్యాణ్‌ను, ఆయన పార్టీని మేం గుర్తించడం లేదు.. పవన్ కల్యాణ్ స్థాయి తోలుబొమ్మలాటలో జోకర్ మాత్రమే నంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇక, ముఖ్యమంత్రి తెనాలికి హెలికాప్టర్‌లో వెళ్లే విషయాన్ని కూడా ప్రతిపక్షాలు నిర్దేశిస్తాయా..? అని ప్రశ్నించారు.
Read Also: Top Headlines @ 1 PM: టాప్ న్యూస్
ఎన్నికల్లో 175 నియోజకవర్గాల్లో ఒంటరిగానే పోటీ చేస్తామని సీఎం వైఎస్ జగన్ ప్రకటించారు.. ఇతర పార్టీలతో పొత్తులు మాకు అవసరం లేదు.. ప్యాకేజీలు చెల్లిస్తే కలిసే పార్టీ వైసీపీ కాదని స్పష్టం చేశారు కాకాణి.. ఐదేళ్ల పాటు పాలించిన చంద్రబాబును ప్రజలు తిరస్కరించారు.. ప్రజల్లో ఆయనకు విశ్వసనీయత లేదన్నారు.. కేవలం ఒంటరిగా పోటీ చేసే ధైర్యం ఉందా అని మాత్రమే ప్రశిస్తున్నాం..? 175 చోట్ల ఒంటరిగా పోటీ చేసే దమ్ము టీడీపీకి ఉందా? అని సవాల్ చేశారు. సవాలుకు సమాధానం చెప్పలేక ఆ పార్టీ నేతలు ముఖం చాటేస్తున్నారన్న ఆయన.. సంక్షేమ పథకాలు అమలు చేసి ప్రజల్లోకి వెళ్లి మద్దతు ఇమ్మని అడుగుతున్నాం అన్నారు.. ఇక, యువ గళం పాదయాత్రకు జనాదరణ లేదని తేల్చేశారు. వైయస్సార్ రైతు భరోసా- పీఎం కిసాన్ ఆర్థిక సాయంతో పాటు, మాందోస్ తుఫాన్ పంట నష్ట పరిహారం రైతులకు చెల్లించామని తెలిపారు. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నమ్ముకున్నది ప్రజలను మాత్రమే అన్నారు మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి.
Read Also: Taraka Ratna: రేపే తారకరత్న ‘పెద్ద కర్మ’… ముఖ్య ఆహ్వానితులుగా పొలిటికల్ రైవల్స్
మరోవైపు.. కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ అని రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్ అని వేర్వేరుగా ఉండవు అన్నారు మంత్రి కాకాణి.. కేంద్ర ప్రభుత్వ గ్రాంట్లతో కలిపే రాష్ట్ర బడ్జెట్ ఉంటుంది.. 2014కు ముందు చంద్రబాబు రుణ మాఫీ చేస్తామని ఎన్నికలకు వెళ్లారు అని తెలిపారు. ఇక, పీఎం కిసాన్ తో కలిసి రైతు భరోసా ఇస్తామని పదేపదే వైసీపీ ప్రభుత్వం చెబుతుందని గుర్తుచేసిన మంత్రి.. రైతులకు సీజన్ కు ముందుగానే నీళ్లు ఇచ్చాం అన్నారు.. సాగు నీటి ప్రాజెక్టులు కడితే వ్యయం తప్ప ఏమీ ఉండదు అని చంద్రబాబు అన్నారు.. నెల్లూరు లాంటి చోట సంగం బ్యారేజీని మా ప్రభుత్వం నిర్మించింది.. టీడీపీ హయాంలో ఒక్క ప్రాజెక్టు అయినా పూర్తి అయ్యిందా? అని నిలదీశారు మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి.