Jogi Ramesh: జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై మంత్రి జోగి రమేష్ మరోసారి సెటైర్లు వేశారు. పవన్ కళ్యాణ్ వారాహి మీద కాకుండా వరాహం మీద తిరిగినా తమకు అభ్యంతరం లేదని వ్యాఖ్యానించారు. పవన్ కళ్యాణ్ అనే చవట, సన్నాసి చంద్రబాబు బూట్లు నాకుతున్నాడని ఆరోపించారు. ఎవరైనా తాను సీఎం అవుతానంటారని.. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం చంద్రబాబును ముఖ్యమంత్రిని చేసేందుకు ప్రయత్నం చేస్తున్నాడని ఎద్దేవా చేశారు. పవన్ కళ్యాణ్‌కు ధైర్యం ఉంటే 175 నియోజకవర్గాలలో పోటీ చేయాలని మంత్రి జోగి రమేష్ సవాల్ విసిరారు. పవన్ కళ్యాణ్ విజిటింగ్ వీసాపై వారానికి ఒకసారి వచ్చి వాగిపోతాడని.. ప్రజలను రెచ్చగొట్టడమే పవన్ పని అని సెటైర్లు వేశారు.
Read Also: World Record: 59 కి.మీ. పాటు నిలబడి బైక్ నడిపాడు.. ప్రపంచ రికార్డు సృష్టించాడు
మరోవైపు పవన్‌ను నమ్ముకుంటే జనసేన కార్యకర్తలు నట్టేట మునగడం ఖాయమని మంత్రి జోగి రమేష్ జోస్యం చెప్పారు. రాష్ట్రంలో పందులు, కుక్కలు కూడా తిరుగుతున్నాయని.. ఇది ప్రజాస్వామ్యం కాబట్టి పవన్ కళ్యాణ్ తిరుగుతుంటే ఎవరు అడ్డుకుంటారని ఆయన ప్రశ్నించారు. పంది మీద తిరిగినా ఆయన్ను ఎవరూ అడ్డుకోరని మంత్రి జోగి రమేష్ అన్నారు. జగన్ వీరుడు, ధీరుడు అని.. ప్రజల కోసం పనిచేస్తున్నాడని స్పష్టం చేశారు. జగన్‌ను మళ్లీ సీఎం కాకుండా చేస్తానని పవన్ అంటున్నాడని.. పవన్ కాదు కదా, ఆయన దత్తతండ్రి చంద్రబాబు వచ్చినా వైసీపీ కంచుకోటను ఇంచు కూడా కదల్చలేరని జోగి రమేష్ కౌంటర్ ఇచ్చారు. పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్న భాషను తాము మాట్లాడలేమని, తమ నాయకుడు ప్రేమ, అభిమానంతో వ్యవహరించడమే తమకు నేర్పాడని జోగి రమేష్ అన్నారు.