SSC Exams 2023: ఎల్లుండి నుంచి టెన్త్ పరీక్షలు.. ఈ రూల్స్ పాటించాల్సిందే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
SSC Exams 2023: సోమవారం నుంచి ఆంధ్రప్రదేశ్‌లో టెన్త్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి.. ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది ప్రభుత్వం.. ఈ నేపథ్యంలో విజయవాడలో మీడియాతో మాట్లాడిన రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ.. టెన్త్ పరీక్షల నేపథ్యంలో కీలక సూచనలు చేశారు.. ఎల్లుండి నుంచి పబ్లిక్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి.. పదవ తరగతి ఫలితాల నుంచే పిల్లల భవిష్యత్తు ఆధారపడి ఉంటుందన్నారు. ఏప్రిల్ 3వ తేదీ నుంచి 18వ తేదీ వరకు టెన్త్ పరీక్షలు జరుగుతాయని.. ఆరు పేపర్లే ఉంటాయని తెలిపారు.. ఇక, ఉదయం 9.30 గంటలు దాటిన తర్వాత ఒక్క నిమిషం ఆలస్యం అయినా విద్యార్థులను పరీక్షా కేంద్రంలోకి అనుమతించబోమని స్పష్టం చేశారు.. కానీ, ఎవరికైనా వ్యక్తిగతంగా సరైన కారణం చెబితే పరీక్షా కేంద్రంలోకి అనుమతించే విషయాన్ని ఆలోచించనున్నట్టు వెల్లడించారు.
Read Also: KVP Ramachandra Rao: ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడింది..
Also Read
- CM Chandrababu: ఎక్కడ చంద్రబాబు ఉంటే.. అక్కడ అవినీతి జరిగే ప్రసక్తే లేదు!
- CM Chandrababu: నేను 40 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నా.. అదంతా మీ వల్లే.. ఇది నా పూర్వజన్మ సుకృతం!
- Vijayawada SAAP Office: శాప్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత.. వైసీపీ నేతలపై పోలీసుల లాఠీఛార్జ్!
- YCP Protest: డీఎస్సీ స్పోర్ట్స్ కోటా వివాదం.. నేడు వైసీపీ నిరసన.. పోటీగా టీచర్ల ర్యాలీ?
మరోవైపు.. ఎస్ఎస్సీ ఎగ్జామ్స్ జరుగుతోన్న సమయంలో పరీక్షా కేంద్రాల స్కూళ్లలో ఇతర తరగతులు, పనులు జరగవు అని స్పష్టం చేశారు మంత్రి బొత్స.. బయటి వారు ఎవరూ పరీక్షా కేంద్ర ప్రాంగణంలో పరీక్ష సమయంలో అడుగు పెట్టడం నిషేధమని స్పష్టం చేసిన ఆయన.. ఇప్పటికే ఈ మేరకు ఆదేశాలు జారీ చేశామన్నారు.. ఈ ఏడాది 6,09,070 మంది విద్యార్థులు పరీక్షలు హాజరవుతారని తెలిపారు.. ఇక, 3వ తేదీ నుంచి ఒంటిపూట బడులు కూడా ప్రారంభం అవుతాయన్నారు.. పరీక్షకు హాజరు అవుతున్న విద్యార్థులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం సదుపాయం కల్పించామని.. విద్యార్థులు బస్సులో హాల్ టికెట్ చూపించి ఉచిత ప్రయాణ సదుపాయం పొందవచ్చు అన్నారు. బస్సు రవాణా లేని చోట విద్యార్థులు ఎక్కువ సంఖ్యలో ఉంటే డీఈవో ద్వారా ఆర్టీసీకి విజ్ఞప్తి చేస్తే ప్రత్యేకంగా బస్సు సదుపాయం కల్పిస్తామని స్పష్టం చేశారు.. మరోవైపు.. హెడ్ మాస్టర్లు, టీచర్లు, సిబ్బంది ఎవరూ మొబైల్ ఫోన్లు పరీక్షా కేంద్రంలోకి అనుమతి లేదు.. ప్రైవేటు స్కూళ్ళల్లోని అటెండర్, హెల్పర్ వంటి సహాయ సిబ్బంది కూడా ప్రభుత్వ ఉద్యోగులే అయి ఉండాలని కీలక ఆదేశాలు జారీ చేశారు మంత్రి బొత్స సత్యనారాయణ.
తాజావార్తలు
-
Nani fans meet: 10 వేల సెల్ఫీలు.. 10 వేల మందికి విందు భోజనం.. ఫ్యాన్స్ కోసం నాని సెన్సేషన్!
-
Paramannam: బెల్లం పరమాన్నం మొదటిసారి చేసినా సూపర్ హిట్ అయ్యే 100% పక్కా ఫార్ములా! ఇలా చేసి చూడండి..
-
CM Chandrababu: ఎక్కడ చంద్రబాబు ఉంటే.. అక్కడ అవినీతి జరిగే ప్రసక్తే లేదు!
-
Abhishek Anand: ఉద్యోగం చేస్తూనే క్రికెట్.. జపాన్ జాతీయ జట్టుకు చేరిన భారతీయుడు.!
-
Ashika: అప్పుడేమో‘సిస్టమ్’పై లెక్చర్లు… ఇప్పుడేమో అలాంటి ఫొటోల పోస్టింగా?
ట్రెండింగ్
-
India Playing XI: ముగ్గురు స్టార్లకు విశ్రాంతి.. జపాన్‌తో తలపడే భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
32.85 కి.మీ మైలేజీ, ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వచ్చేసిన Maruti Suzuki Swift CNG-AMT.. ధర కూడా తక్కువే.!
-
రూ.13.99 లక్షల ప్రారంభ ధరతో Tata Sierra Dark లాంచ్.. వేరియంట్లు, ఫీచర్లు, ధరల పూర్తి లిస్ట్ ఇదిగో..!
-
జమైకా కింగ్స్మెన్కు షాక్.. CPL 2026 ఛాంపియన్‌గా ఆంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్.!
-
180 FPS గేమింగ్, 100W ఛార్జింగ్, మూడు కొత్త కలర్ వేరియంట్లతో లాంచ్ కానున్న OnePlus 16..!