హోంగార్డ్‌ వేధింపులు తాళలేక.. వ్యక్తి ఆత్మహత్య యత్నం

కుల్సుంపుర పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. జియాగూడకు చెందిన రాజు అనే వ్యక్తి .. హోంగార్డు అమర్‌నాథ్‌ వేధింపులు తట్టుకోలేక ఈనెల 4వ తేదిన ఒంటిపై పెట్రోల్‌ పోసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఓ దొంగతనం కేసులో అరెస్టైన తన తమ్ముడిని కలవడానికి వెళ్లిన రాజును హోం గార్డు అమర్‌నాథ్‌ తీవ్రంగా కొట్టి దుర్భాషలాడడాని దీంతో మనస్థాపానికి గురైన రాజు పోలీస్ స్టేషన్ ఎదుటే పెట్రోల్‌ పోసుకుని ఆత్మహత్య యత్నానికి యత్నించాడు.

Read Also: ఆగని టీటీడీ కాలేజీ ప్రిన్సిపాల్ ఆగడాలు
కాగా అతడిని వెంటనే ఉస్మానియాకు తరలించారు. చికిత్స పొందుతున్న రాజు ఈరోజు ఉదయం మృతి చెందాడు. విషయం తెలుసుకున్న రాజు బంధుమిత్రులు పెద్దఎత్తున ఉస్మానియా ఆస్పత్రికి చేరుకుని నిరసన చేపట్టారు. రంగంలోకి దిగిన పోలీసులు వారికి నచ్చచెప్పి అధికారులతో మాట్లాడి రాజు కుటుంబానికి న్యాయం జరిగేలా చేస్తమన్నారు. కాగా హోం గార్డు అమర్‌నాధ్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. దీంతో హోం గార్డు అమర్‌నాథ్‌ను విధుల నుంచి డిస్మిస్‌ చేసిన ఉన్నతాధికారులు.

Related Articles

Latest Articles