ఏపీ అసెంబ్లీలో వ్యవసాయ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు మంత్రి కురసాల కన్నబాబు. మరో మంత్రి అప్పలరాజు శాసనమండలిలో వ్యవసాయ బడ్జెట్ ప్రవేశపెట్టారు. మార్కెటింగ్ యార్డుల్లో నాడు-నేడు. మార్కెటింగ్ శాఖ అభివృద్ధికి రూ. 614.23 కోట్లు. సహకార శాఖకు రూ.248.45 కోట్లు. ఆహార శుద్ధి విభాగానికి రూ.146.41 కోట్లు. ఉద్యానశాఖకు రూ.554 కోట్లు. పట్టు పరిశ్రమకు రూ. 98.99 కోట్లు. ఆచార్య ఎంజీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయానికి రూ.421.15 కోట్లు. వైఎస్సార్ ఉద్యాన విశ్వవిద్యాలయానికి రూ.59.91 కోట్లు. వెంకటేశ్వర పశువైద్య…
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నర్సాపురం బహిరంగ సభలో వైసీపీ ప్రభుత్వంపై చేసిన వ్యాఖ్యలకు మంత్రి సిదిరి అప్పలరాజు కౌంటర్ ఇచ్చారు. మత్స్యకారుల బ్రతుకులు వలసల మీద ఆధారపడకూడదని తమ ప్రభుత్వం ప్రణాళికల ఆధారంగా ముందుకు వెళ్తుందని ఆయన వివరణ ఇచ్చారు. సీఎం చేపలు అమ్ముకోవాలా, మటన్ అమ్ముకోవాలా అని పవన్ అడుగుతున్నారని.. మత్స్యకారుల బ్రతుకులు మారకూడదా అని ప్రశ్నించారు. మత్స్యకారులను ఎంటర్‌పెన్యూనర్లుగా తీర్చిదిద్దుతున్నామని మంత్రి అప్పలరాజు తెలిపారు. చరిత్రలో తొలిసారి సినిమా ప్రమోషన్ కోసం రాజకీయాలను…
కోవిడ్ పరిస్థితి పై జిల్లా అధికారులతో మంత్రి సీదిరి అప్పలరాజు సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కోవిడ్‌ను ఏవిధంగా ఎదుర్కొవాలో అధికారులకు పలు సూచనలు చేశారు. కోవిడ్ ని ఎలా ఎదుర్కోవాలో మన నుంచి ఇతర రాష్ట్రాల వారు తెలసుకుంటున్నారని ఈ సందర్భంగా మంత్రి అన్నారు. కోవిడ్‌ను ఎదుర్కొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నద్ధంగా ఉందన్నారు. సెకండ్ వేవ్‌లో ఆక్సిజన్ కొరత ఎక్కువగా వచ్చింది. Read Also: ఏపీలో కరోనా విజృంభణ.. కొత్తగా 6,996 కేసులు 10వేల…
పీఆర్సీపై ఏపీలో ఇంకా స్పష్టత నెలకొనలేదు. ఇటీవలే సీఎం జగన్ పీఆర్సీని ప్రకటించారు. అయితే పీఆర్సీపై ఉద్యోగులకు ఆమోదయోగ్యంగా లేదని, సమ్మెకు వెళ్తామని ఉద్యోగ సంఘాల నేతలు అంటున్నారు. ఈ సందర్బంగా మంత్రి సీదిరి అప్పలరాజు మాట్లాడుతూ.. పీఆర్సీపై కొన్ని ఉద్యోగ సంఘాలు పాజిటివ్‌గా, కొన్ని వ్యతిరేకంగా మాటాడుతున్నాయని ఆయన అన్నారు. ఉద్యోగులు సంతృప్తికరంగా, ఆనందంగా ఉన్నారని ఆయన వెల్లడించారు. ఎక్కడొ కొన్ని సంఘాలు ఎవరో కొంతమంది వెనుకనుండి ప్రోద్బలం వలన సమ్మెకు వెళ్తామనడం ఆలోచించాల్సిన విషయమన్నారు.…
కుప్పం పర్యటనలో చంద్రబాబు చెప్పినవన్నీ అవాస్తవాలని, చంద్రబాబు ఎన్ని కుప్పి గంతులు వేసినా ప్రజలు నమ్మరని మంత్రి సీదిరి అప్పల రాజు అన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. టీడీపీపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. చంద్రబాబు రైతుల గురించి మాట్లాడితే అన్యాయంగా ఉంటుందన్నారు. రైతులను రాజులుగా చేస్తామని చెప్పి అధికారం చేపట్టిన ప్రభుత్వం మాదని మంత్రి అన్నారు. విత్తనం నుంచి విక్రయం వరకు అన్ని దశల్లో రైతులకు చేయూత అందించి ఆత్మ స్థైర్యం కల్పించిన ప్రభుత్వం…
దేశంలోనే అత్యంత మౌలిక సదుపాయాలను అందిస్తున్న రాష్ట్రాల్లో ఏపీ ముందు ఉందన్నారు మంత్రి సీదిరి అప్పలరాజు. కోవిడ్ సమయంలో సైతం ప్రతీ పేద వాడిని ఆదుకున్నాం అన్నారు. దశాబ్దాలుగా నిర్లక్ష్యాలకు గురైన విద్యా, వైద్యంలో సమూల మార్పులు చేసాం. ప్రతీ పార్లమెంట్ కి ఓ మెడికల్ కాలేజి ఏర్పాటు చేస్తున్నాం. చంద్రబాబుకు ప్రజల బాగోగులు అవసరంలేదు.. కేవలం పదవీ కాంక్ష మాత్రమే ఉందని మండిపడ్డారు. రెండుసార్లు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండి. ఎందుకు ఇంటి లోన్లు ఉచితంగా ఇవ్వలేదన్నారు.…
ఏపీలో మూడు రాజధానుల వ్యవహారం మళ్ళీ మొదటికొచ్చింది. ప్రభుత్వం బిల్లుని ఉపసంహరించుకోవడం… మళ్ళీ సమగ్రంగా బిల్లుని ప్రవేశపెడతామని సీఎం జగన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. శ్రీకాకుళంలో రాష్ర్ట మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు రాజధానుల వ్యవహారంపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఖచ్చితంగా విశాఖ పరిపాలనా రాజధానిగా కొనసాగుతుందన్నారు. రాష్ట్రంలో ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టే విధంగా చంద్రబాబు కుట్ర చేసారు. ప్రభుత్వం మూడు ప్రాంతాలకు సమన్యాయం చేస్తుంది. అమరావతి రైతులు అర్ధం చేసుకోవాలన్నారు మంత్రి సీదిరి అప్పలరాజు.…