ఏపీలో అధికార, ప్రతిక్షాల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది.. ఎవ్వరూ తగ్గకుండా పోటీపోటీ కార్యక్రమాలు నిర్వహిస్తూనే ఉన్నారు.. వాతారణం చూస్తుంటే.. అప్పుడు ఎన్నికలు వస్తాయా? అనే అనుమానాలు కలిగిస్తోంది.. గత కొంత కాలంగా చంద్రబాబు చేస్తున్న వ్యాఖ్యలపై స్పందించిన మంత్రి అంబటి రాంబాబు.. అక్క ఆరాటమే తప్ప బావ బతకడు.. అంటూ సెటైర్లు వేశారు. కొన్ని పత్రికల ఆరాటమే తప్ప చంద్రబాబు రాజకీయంగా బతకరని జోస్యం చెప్పారు.. చంద్రబాబు పగటి కలలు కంటున్నారు.. కానీ, షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు జరుగుతాయని స్పష్టం చేశారు. ఎంత మంది, ఏ రకంగా వచ్చినా వచ్చే ఎన్నికల్లో జగన్ మళ్లీ ముఖ్యమంత్రి అవుతారనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు అంబటి రాంబాబు.
ఇక, ఈ ఏడాది జూన్ మొదటి రోజే సాగునీరు అందించాలని ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు మంత్రి అంబటి.. ఇరిగేషన్ అడ్వైజరీ బోర్డులు కూడా సమావేశాలు నిర్వహిస్తున్నాయన్నారు. మరోవైపు, డయాఫ్రమ్ వాల్ డ్యామేజ్ వల్ల పోలవరం పనులు కాస్త ఆలస్యం జరిగిందన్న ఆయన.. చంద్రబాబు, దేవినేని ఉమ స్వార్థ, అనాలోచిత నిర్ణయాల వల్ల డయాఫ్రమ్ వాల్ దెబ్బతిందని మండిపడ్డారు.. ప్రపంచంలో ఇంత వరకు ఎక్కడా డయాఫ్రమ్ వాల్ దెబ్బతిన్న సంఘటన చోటు చేసుకోలేదని వ్యాఖ్యానించారు అంబటి రాంబాబు.