Ambati Rambabu: చంద్రబాబు చేస్తే ఒప్పు.. మేం చేస్తే తప్పా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అధికారం కోసం ఎంతకైనా దిగజారే వ్యక్తి చంద్రబాబు అని మంత్రి అంబటి రాంబాబు తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. అధికారం లేకపోతే చంద్రబాబు పిచ్చెక్కిపోతాడని ఆరోపించారు. ఆయన జిమ్మిక్కులను నమ్మే స్థితిలో ప్రజలు లేరని ఎద్దేవా చేశారు. అవకాశం దొరికితే దేశాన్ని నాశనం చేయగలిగే సత్తా ఉన్న వ్యక్తి చంద్రబాబు అని.. అసలు రాయలసీమకు ఆయన ఏం చేశారో చెప్పాలని మంత్రి అంబటి రాంబాబు డిమాండ్ చేశారు. 151 సీట్లు తెచ్చుకున్న వ్యక్తి సీఎం పదవికి అనర్హుడట… 23 స్థానాలు మాత్రమే తెచ్చుకున్న ఆయన అర్హుడట అంటూ చంద్రబాబుపై సెటైర్లు వేశారు.
Beeda Mastanrao: డబ్బులిస్తే రాజ్యసభ సీటిస్తారా? అయితే రూ.200 కోట్లు ఇచ్చేవాళ్లున్నారు
Also Read
- RAW NTR: 'ఊరు–వాడ' కార్యక్రమంపై 'రా ఎన్టీఆర్' కీలక ప్రకటన.. ఆరోపణలకు కౌంటర్..
- Potti Sriramulu's Sacrifice: 58 రోజుల పొట్టి శ్రీరాములు ఆమరణ దీక్ష.. దేశాన్ని కదిలించిన ఉద్యమ చరిత్ర
- CM Chandrababu: టీడీపీ ప్రజాప్రతినిధులకు చంద్రబాబు క్లాస్.. సమన్వయంపై ప్రత్యేక దృష్టి
- RAW NTR Controversy: NTR అభిమానుల్లో తీవ్ర ఉత్కంఠ..! RAW NTR గిఫ్ట్‌పై సస్పెన్స్..
తాము బీసీలకు రాజ్యసభ సీటు ఇస్తే చంద్రబాబు రాద్ధాంతం చేస్తున్నారని అంబటి రాంబాబు మండిపడ్డారు. తాము రాజ్యసభ సీట్లను అమ్ముకున్నామని చంద్రబాబు ఆరోపించడం నీచ రాజకీయాలకు పరాకాష్ట అన్నారు. టీజీ వెంకటేష్ దగ్గర ఎంత తీసుకుని ఆయన రాజ్యసభ టిక్కెట్ ఇచ్చారో చెప్పాలన్నారు. పక్క రాష్ట్రాలకు చెందిన నిర్మలా సీతారామన్, సురేష్ ప్రభుకు చంద్రబాబు రాజ్యసభ సీటు ఇస్తే తప్పులేనిది.. తాము పక్క రాష్ట్రానికి చెందిన వారికి ఇస్తే తప్పా అని నిలదీశారు. టిక్కెట్లు అమ్ముకుని, కొనుక్కునే సామర్థ్యం చంద్రబాబుకే ఉందని ఆరోపించారు. ఓటును నోటుతో కొనుక్కుని రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయి ఇక్కడికి పారిపోయి రాలేదా అని ప్రశ్నించారు. అధికారం కోసమే ఆరాటపడుతూ చంద్రబాబు యాత్రల మీద యాత్రలు చేస్తున్నారని విమర్శలు చేశారు. ఆయన ఎప్పటికీ మాజీ సీఎంగానే ఉంటారని అంబటి రాంబాబు వ్యాఖ్యానించారు. సీఎం జగన్‌ను ఓడించే సత్తా చంద్రబాబు, పవన్‌కు లేవన్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సీబీఐ, ఈడీలు ఈ రాష్ట్రంలో అడుగు పెట్టడానికి వీల్లేదని చెప్పినట్లు మరిచిపోయారా అని ప్రశ్నించారు.
తాజావార్తలు
-
Mahesh Babu-Varanasi: రెడీ అయిపోండమ్మా.. బాబు బర్త్‌డేకు భారీ సర్ప్రైజ్?
-
The Paradise: నాని కెరియర్ లోనే రికార్డు ధరకు అమ్ముడైన ‘ది ప్యారడైజ్’ నైజాం రైట్స్.!
-
Oppo K15: ఒప్పో K15 త్వరలో లాంచ్.. Dimensity 7360 ప్రాసెసర్, 8,000mAh బ్యాటరీ
-
Namitha: గుర్తుపట్టలేనంతగా మారిన నమిత.. వైరల్ వీడియో చూసి షాక్ అవుతున్న అభిమానులు!
-
RBI Polymer Notes: ప్లాస్టిక్ కరెన్సీకి శ్రీకారం.. గ్లోబల్ టెండర్ జారీ చేసిన ఆర్బీఐ.. కఠిన షరతులు..!
ట్రెండింగ్
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!
-
185Hz OLED డిస్ప్లే, లిక్విడ్ కూలింగ్‌తో పవర్ఫుల్ గేమింగ్ ట్యాబ్లెట్ REDMAGIC Astra 2 లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 12.2 అంగుళాల 2.8K 144Hz OLED డిస్ప్లేతో రాబోతున్న ASUS ప్యాడ్ (T3201).!
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్‌లో లాంచ్.. ధర ఎంతంటే?