Ishan Kishan: టీమిండియాలోకి రావడం చాలా సంతోషంగా ఉంది.. నా టార్గెట్ అదే!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ishan Kishan on Team India Comeback: న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌లో మళ్లీ భారత జట్టులో చోటు దక్కించుకోవడంపై వికెట్ కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్ సంతోషం వ్యక్తం చేశాడు. జట్టులోకి తిరిగి రావడం ఎప్పుడూ ఆనందంగా ఉంటుందని చెప్పాడు. ప్రస్తుతం టీమిండియా ఆటగాళ్లంతా మంచి మైండ్‌సెట్‌తో ఉన్నారని తెలిపాడు. ప్రతి ఒక్కరూ ఆటను ఆస్వాదిస్తూ.. తమ ప్రణాళికలను సమర్థంగా అమలు చేయడంపై దృష్టి పెట్టారని పేర్కొన్నాడు. టీ20లతో పోలిస్తే వన్డేల్లో నిలకడగా ఆడడం చాలా ముఖ్యం అని, పార్టనర్‌షిప్‌లు నిర్మించాలని ఇషాన్ చెప్పుకొచ్చాడు. ఐదు వన్డేల సిరీస్‌లో భాగంగా ఓవల్ వేదికగా నాలుగో వన్డే జరుగుతోంది. సిరీస్‌లో ఇషాన్ ఆడడం ఇదే మొదటి మ్యాచ్.
న్యూజిలాండ్‌తో నాలుగో వన్డే మ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ టాస్ నెగ్గి బౌలింగ్ ఎంచుకున్నాడు. టాస్ అనంతరం ఇషాన్ కిషన్ మాట్లాడుతూ… ‘మళ్లీ భారత జట్టులో చోటు దక్కించుకోవడం సంతోషంగా ఉంది. టీ20లతో పోలిస్తే వన్డేల్లో నిలకడగా ఆడడం ముఖ్యం. సహచరులతో కలిసి మంచి భాగస్వామ్యాలను నిర్మించాలి. సొంతగడ్డపై న్యూజిలాండ్ చాలా బాగా ఆడుతుంది. అందుకే పక్కా ప్రణాళికతో బరిలోకి దిగడం, అనుకున్న వ్యూహాలను మైదానంలో అమలు చేయడం ముఖ్యం. భారత క్రికెట్లో పోటీ ఎక్కువగా ఉండటంతో జట్టులో వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి. ఇలాంటి పరిస్థితులను గతంలో కూడా ఎదుర్కొన్నా. ఇతర విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకుండా.. నా ఆటపైనే దృష్టి పెడతా. జట్టుకు ఏది అవసరమో గుర్తించి, మంచి క్రికెట్ ఆడటమే తన లక్ష్యం. ఒత్తిడి సహజంగానే ఉంటుంది. అయితే ఒక ప్రొఫెషనల్ క్రికెటర్‌గా ఒత్తిడితో కూడిన క్షణాలను కూడా ఆస్వాదించడం నేర్చుకోవాలి’ అని చెప్పాడు.
Also Read
- IPL 2027-KKR: కేకేఆర్‌లో భారీ మార్పులు.. రిటైన్, రిలీజ్ ప్లేయర్స్ లిస్ట్ ఇదే!
- India vs New Zealand: నేడే నాలుగో వన్డే.. శ్రేయస్‌కు కెప్టెన్ పగ్గాలు.. టాస్, ఫ్రీ లైవ్ టెలికాస్ట్, జట్ల పూర్తి వివరాలు ఇవే..
- Under -19 Asia Cup: ఆఫ్ఘనిస్థాన్ చిత్తు చిత్తు.. ఫైనల్‌కు దూసుకెళ్లిన భారత్..
- Pat Cummins: ట్యాంపరింగ్ కలకలం.. పబ్లిక్‌లోనే భార్యతో గొడవ.. ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ కమిన్స్ కీలక ప్రకటన..
టీ20, వన్డే ఫార్మాట్లలో బ్యాటింగ్ విధానం గురించి ఇషాన్ కిషన్ మాట్లాడుతూ.. ‘వన్డేల్లో 50 ఓవర్ల ఆట కాబట్టి భాగస్వామ్యాలు నిర్మించడం చాలా ముఖ్యం. క్రీజులో ఎక్కువసేపు నిలబడితే జట్టుకు పరుగులు సాధించే అవకాశం ఉంటుంది. వన్డేల్లో వ్యక్తిగత ప్రదర్శన కూడా జట్టు విజయానికి ఎంతో ఉపయోగపడుతుంది. పరిస్థితులకు తగినట్టుగా ఆడాలి. ఈ సిరీస్‌లో ఐదో స్థానంలో బ్యాటింగ్ చేస్తాను. ఆ స్థానంలో పరిస్థితులకు అనుగుణంగా ఆడాలి. కొన్ని సందర్భాల్లో భాగస్వామ్యాన్ని నిర్మించాల్సి ఉంటుంది, మరికొన్ని సందర్భాల్లో స్కోరు వేగాన్ని పెంచాల్సి ఉంటుంది. మ్యాచ్ పరిస్థితులను విశ్లేషించి.. జట్టు అవసరాలకు తగ్గట్టుగా ఆటను మార్చుకోవడమే వన్డేల్లో ముఖ్యం. బాగా ఆడేందుకు ప్రయత్నిస్తా’ అని స్పష్టం చేశాడు. జట్టులో తిరిగి అవకాశం దక్కించుకున్న ఇషాన్.. ఐదో స్థానంలో బ్యాటింగ్ చేస్తూ ఎలాంటి ప్రదర్శన చేస్తాడన్నది ఆసక్తికరంగా మారింది.
తాజావార్తలు
-
Ishan Kishan: టీమిండియాలోకి రావడం చాలా సంతోషంగా ఉంది.. నా టార్గెట్ అదే!
-
ISRO PSLV Engine Test: వరుస వైఫల్యాల తర్వాత ఇస్రోకు భారీ విజయం.. పీఎస్ఎల్వీ మూడో దశ ఇంజిన్ టెస్ట్ సక్సెస్!
-
Bharat Summit 2026: నేటి నుంచే భాగ్యనగరంలో ‘భారత్ సమ్మిట్’.. 70కి పైగా దేశాల ప్రతినిధులు హాజరు..
-
Xi Jinping Warns Taiwan: తైవాన్‌కు జిన్‌పింగ్ వార్నింగ్.. స్వాతంత్ర్యానికి అవకాశమే లేదు.. చైనాతో ఏకీకరణ తప్పదు!
-
Delhi Air Pollution: ఊపిరి పీల్చుకోవడమే కష్టం.. ఢిల్లీలో ప్రమాదకర స్థాయికి కాలుష్యం
ట్రెండింగ్
-
India Playing XI 4th ODI: గిల్, రాహుల్, కాంబోజ్ అవుట్.. ఇషాన్ కిషన్, సిరాజ్ ఇన్.. కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్..!
-
ICC కీలక నిర్ణయాలపై ఉత్కంఠ.. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో కీలక మార్పులు.. 12 జట్లతో ప్లాన్.?
-
Moringa Soup: ఖరీదైన స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ వద్దు.. వింటర్లో బుగ్గలపై సహజమైన ఎరుపుదనం తెచ్చే సూప్ ఇదే..
-
Cigarette Prices Hike: ధూమపాన ప్రియులకు షాక్.. మరోసారి సిగరెట్ల ధరల బాదుడు..! ఒక్క ప్యాకెట్‌పై ఏకంగా..
-
Kusal Mendis: విమర్శకుల నోళ్లు మూయించిన కుశాల్ మెండిస్.. 13,000 పరుగుల మైలురాయిని అందుకున్న ఆటగాడిగా ఘనత..!