టీడీపీ, జనసేన పార్టీపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు మంత్రి అంబటి రాంబాబు.. సింగిల్ గా పోటే చేసే దమ్ము లేకే చంద్రబాబు పొత్తుల ఎత్తులు వేస్తున్నారని వ్యాఖ్యానించిన ఆయన.. జగన్ ప్రభుత్వాన్ని ఎంతమంది కట్ట కట్టుకుని వచ్చినా దించలేరనే ధీమా వ్యక్తం చేశారు. చంద్రబాబు సవాల్‌పై స్పందించిన అంబటి… విద్యుత్ చార్జీలు ఏపీ కన్నా కర్ణాటకలో ఎక్కువగా ఉన్నాయి.. ఆర్టీసీ ఛార్జీలు మహారాష్ట్రలో ఎక్కువ, మరి రాజకీయ సన్యాసం ఎప్పుడు చేస్తావు చంద్రబాబూ..? అంటూ ప్రశ్నించారు. రాజకీయ సన్యాసం…
ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ, జనసేన, బీజేపీల పొత్తుపై ఎప్పటికప్పుడూ కొత్త తరహా ప్రచారం జరుగుతూనే ఉంటుంది.. ఈ మూడు పార్టీలు ఎప్పుడైనా ఏకం కావొచ్చు అనే అంచనాలుంటాయి.. అయితే, ప్రస్తుతం ఏపీలో బీజేపీ-జనసేన పొత్తు కొనసాగుతుండగా.. టీడీపీ విడిగానే రాజకీయాలు చేస్తోంది.. ఈ మధ్య జరిగిన ఎన్నికల్లో కొన్ని చోట్ల కలిసి పనిచేసిన సందర్భాలు కూడా లేకపోలేదు.. కానీ, ఇవాళ తెలుగుదేశం పార్టీ, జనసేన పొత్తుపై కీలక వ్యాఖ్యలు చేశారు టీడీపీ ఎమ్మెల్యే, పొలిట్ బ్యూరో సభ్యులు నిమ్మకాయల…