Ambati Rambabu: ప్రాజెక్ట్‌ల పైనే కాదు, నీటి గురించి మాట్లాడే అర్హత కూడా చంద్రబాబుకు లేదు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ambati Rambabu: ప్రాజెక్ట్‌ల గురించే కాదు.. అసలు నీటి గురించి మాట్లాడే అర్హత కూడా చంద్రబాబుకు లేదంటూ ఫైర్ అయ్యారు మంత్రి అంబటి రాంబాబు.. పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులను ఎంపీలు కోటగిరి, మార్గాని భరత్, పలువురు ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులతో కలిసి పరిశీలించిన ఆయన.. ప్రాజెక్టు పనులపై వివరించారు.. ఆ తర్వాత మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబుపై విరుచుకుపడ్డారు.. 1995లో ముఖ్య మంత్రి అయ్యి తర్వాతి కాలంలో 14 ఏళ్లు సీయంగా వున్న చంద్రబాబు ఎప్పుడైనా పోలవరం గురించి మాట్లాడారా..? అని నిలదీశారు.. పోలవరం ప్రాజెక్టు గురించి మాట్లాడే నైతిక హక్కు చంద్రబాబుకి లేదన్న ఆయన.. ప్రాజెక్ట్ ల గురించే కాదు, నీటి గురించి అసలు మాట్లాడే అర్హత లేదన్నారు.. ఆయన పాలనలో వర్షాలు పడవు అంటూ ఎద్దేవా చేశారు.. పోలవరంలో 72శాతం పనులు పూర్తి చేశామని చంద్రబాబు అనడం పచ్చి అబద్ధం అని ఫైర్ అయ్యారు.
Read Also: Mahesh Babu: అప్పుడు మహేశ్ బాబుకి హిట్ కావాలి, ఇప్పుడు మహేశ్ అంటేనే హిట్…
Also Read
- AP Model Code of Conduct: ఏపీలో అమల్లోకి ఎన్నికల కోడ్.. కొత్త పథకాలు, ప్రాజెక్టులకు బ్రేక్.. నిబంధనలు ఇవే..
- AP Local Body Election Schedule 2026: ఏపీలో స్థానిక ఎన్నికల నగారా.. పూర్తి షెడ్యూల్ ఇదే..
- Ambati Rambabu: వైసీపీ కేడర్‌ను భయపెడుతున్నారు.. రౌడీషీట్లపై అంబటి ఆగ్రహం
- Vijayawada Drugs: బెజవాడలో మరోసారి డ్రగ్స్ కలకలం.. ఎంబీఏ విద్యార్థిని అరెస్ట్!
ఇక, ప్రతి పక్షాలు, వైసీపీకి వ్యతిరేకంగా వున్నవారు అబద్ధాలు చెప్పి ప్రజలను నమ్మించాలని చూస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు అంబటి రాంబాబు.. పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని చంద్రబాబు సర్వ నాశనం చేశారని ఆరోపించిన ఆయన.. కాఫర్ డ్యామ్ లు పూర్తి చేయకుండా డయా ఫ్రమ్ వాల్ కట్టడం తెలివి తక్కువ తనం అని మండిపడ్డారు.. అప్పట్లో దాని విలువ 4 వందలు కోట్లు.. హెడ్ వర్క్ విలువ 5,943 కోట్లు.. టీడీపీ హయాంలోనే 3,591 మాత్రమే ఖర్చు చేశారు.. కానీ, 7,422 కోట్ల అంచనాకి ప్రాజెక్టు వెళ్లిపోయిందన్నారు.. చంద్రబాబు అజ్ఞానం వల్ల ప్రాజెక్ట్ పనులు కుంటుపడ్డాయని విమర్శించారు.. ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీలో అత్యధికంగా ఖర్చు చేసింది వైసీపీ మాత్రమే అని స్పష్టం చేశారు.. అత్యధిక ప్రాధాన్యత కలిగిన ప్రాజెక్ట్ పోలవరం.. శరవేగంగా పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసే బాధ్యత వైసీపీ తీసుకుందన్న ఆయన.. పొరపాట్లకు తావులేకుండా పనులు పూర్తి చేయాలనే లక్ష్యంతో వైసీపీ ప్రభుత్వం ఉందని.. పోలవరం ప్రాజెక్ట్ ను ప్రారంభించబోయేది సీఎం వైఎస్ జగన్ మాత్రమేనని ప్రకటించారు.. మరోవైపు.. పోలవరంపై చంద్రబాబుతో బహిరంగ చర్చకు సిద్ధమా? అంటూ సవాల్ విసిరారు మంత్రి అంబటి రాంబాబు.
తాజావార్తలు
-
AP Model Code of Conduct: ఏపీలో అమల్లోకి ఎన్నికల కోడ్.. కొత్త పథకాలు, ప్రాజెక్టులకు బ్రేక్.. నిబంధనలు ఇవే..
-
Israel: ఇజ్రాయిల్ వెళ్లే విమానాల్లో పాక్ పైలట్లు, సిబ్బందిపై నిషేధం..!
-
DRDO QKD test: DRDO కీలక విజయం.. క్వాంటం టెక్నాలజీతో రక్షణ సమాచారానికి మరింత భద్రత!
-
AP Local Body Election Schedule 2026: ఏపీలో స్థానిక ఎన్నికల నగారా.. పూర్తి షెడ్యూల్ ఇదే..
-
Yash: చేసిన తప్పునే మళ్ళీ మళ్ళీ చేస్తున్న యష్?
ట్రెండింగ్
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్‌కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..