Yash: చేసిన తప్పునే మళ్ళీ మళ్ళీ చేస్తున్న యష్?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
‘టాక్సిక్’ భయంకరమైన డిజాస్టర్ అయినా, 350 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేయడంతో బాక్సాఫీస్ వద్ద తన స్టామినా ఏంటో తెలిపాడు యష్. హిందీలో మొదటి రోజే 50 కోట్ల నెట్ కలెక్ట్ చేసింది. కేజీఎఫ్ తో వచ్చిన మార్కెట్ ను నిలబెట్టుకునే ప్రయత్నం చేయకుండా రాంగ్ స్టెప్ వేస్తున్నాడు. కేజీఎఫ్, కేజీఎఫ్ 2 వంటి బ్లాక్‌బస్టర్స్ తర్వాత ఏరికోరి ఫ్లాప్ డైరెక్టర్ గీతు మోహన్‌దాస్ కు ఛాన్స్ ఇచ్చాడు. పాన్ ఇండియాను డైరెక్ట్ చేసే ఛాన్స్ కొట్టేసి, యష్ నమ్మకాన్ని డబుల్ డిజాస్టర్ చేసింది గీతు. కేజీఎఫ్ 2 రిలీజ్ తర్వాత రెండేళ్ళ పాటు ఏ సినిమా చేస్తున్నాడు, డైరెక్టర్ ఎవరో యష్ కు క్లారిటీ లేదు. శంకర్ తో సహా చాలా మంది క్రేజీ డైరెక్టర్స్ యష్ తో వర్క్ చేయాలనుకున్నా రిజెక్ట్ చేశాడు. నాలుగేళ్ళ కెరీర్ ను తీసుకెళ్ళి ఫ్లాప్ చేతిలో పెట్టినట్లయింది. ఈ నాలుగేళ్ళలో రెండు సినిమాలు చేసినా, ఒకటి ఫ్లాప్ అయినా మరోటి హిట్ అయ్యేది అంటూ ఫ్యాన్స్ ఫీల్ అయ్యారు.
‘టాక్సిక్’ నుంచి ఏమీ నేర్చుకోకుండా, వీళ్ళ ఫీలింగ్స్ ను పట్టించుకోకుండా మళ్ళీ ఫ్లాప్ డైరెక్టర్ చేతుల్లో తన కెరీర్ పెడుతున్నాడు యష్. ‘టాక్సిక్’ తర్వాత యష్ నటించే సినిమా ఇదేనంటూ శాండల్‌వుడ్ లో ఓ వార్త చక్కర్లు కొడుతోంది. కార్తీతో ‘సర్దార్ 2’ వంటి డిజాస్టర్ తీసిన పి.ఎస్. మిత్రన్ దర్శకత్వంలో యష్ నటిస్తున్నాడన్న వార్త బయటకు వచ్చింది. ఏరికోరి మళ్ళీ ఫ్లాప్ డైరెక్టర్ ఎందుకు అంటూ యష్ ఫ్యాన్సే కామెంట్ చేస్తున్నారు. హిట్ డైరెక్టర్ హిట్టే ఇస్తాడని, ఫ్లాప్ డైరెక్టర్ మళ్ళీ ఫ్లాపే తీస్తాడన్న రూల్ లేదు. కానీ యష్ కు బూస్టప్ ఇచ్చే క్రేజీ ప్రాజెక్ట్ అవసరం. డైరెక్టర్ తోనే హైప్ వస్తుంది. గీతు మోహన్‌దాస్ తో ఆ క్రేజ్ రాకపోయినా, యష్ కు ఉన్న ఇమేజ్ తో ఫస్ట్ డే మంచి ఓపెనింగ్స్ వచ్చాయి. డైరెక్టర్ ఎవరైనా ఏడాది తిరగకుండా స్క్రీన్ పై కనిపించాలి; మళ్ళీ రెండు మూడేళ్ళు అంటే యష్ ఫేడౌట్ అయిపోతాడు.
Also Read
తాజావార్తలు
-
Yash: చేసిన తప్పునే మళ్ళీ మళ్ళీ చేస్తున్న యష్?
-
Airtel rs348 vs rs349 Recharge Plan: కేవలం రూ.1 తేడా.. ఎయిర్‌టెల్‌లో రూ.348, రూ.349 ప్లాన్స్.. ఏది బెస్ట్ అంటే?
-
Tamannaah: బోల్డ్ సీక్వెల్లో తమన్నా? విద్యాబాలన్ మార్క్‌ను దాటగలదా!
-
Mary Millben: CJPకి అమెరికా నుంచి నిధులు.. అమెరికన్ సింగర్ సంచలన ఆరోపణలు..
-
Harish Shankar: నన్ను మించి ట్రోల్ అయ్యారా? విజయ్ కు ధైర్యం చెప్పిన హరీష్ శంకర్
ట్రెండింగ్
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్‌కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..