Merugu Nagarjuna Comments On Chandrababu Naidu: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కుయుక్తులను ఎవరూ నమ్మొద్దంటూ మంత్రి మేరుగు నాగార్జున సూచించారు. సీఎం జగన్ నాలుగేళ్ల పరిపాలనలో పేదలకు అన్ని పథకాలు అందుతున్నాయని, అంబేద్కర్ ఆలోచన విధానాన్ని ఆచరిస్తున్నామని అన్నారు. రూ.2 లక్షల 50 వేల కోట్లను డీబీటీ ద్వారా అవినీతి లేకుండా అందిస్తున్నామన్నారు. చంద్రబాబు హయాంలో దళిత సంక్షేమ పథకాలకు తూట్లు పొడిచారని, దళితులపై అడుగడుగునా అక్కసు వెళ్లగక్కారని ఆరోపించారు. కానీ.. జగన్ ప్రభుత్వం దళితులపై దాడులు జరిగితే వెంటనే స్పందిస్తుందని, సొంత పార్టీ వారిని సైతం జైల్లో పెట్టామని తెలిపారు. ఉత్తుత్తి హామీలతో చంద్రబాబు మళ్లీ వస్తున్నాడని ధ్వజమెత్తారు. చంద్రబాబుకు కండకావరమని, పేదల ఇళ్లను కూడా స్మశానాలతో పోల్చారని మండిపడ్డారు. ఇంతకీ పూర్ టు రిచ్ అంటే ఏంటి? అసలు పూర్ ఎవరు? అని ప్రశ్నించారు.
Dy CM Narayana Swamy: చంద్రబాబు పాలన రాక్షసరాజ్యం.. జగన్ పాలన రామరాజ్యం
అంతకుముందు కూడా చంద్రబాబుపై మంత్రి మేరుగు నాగార్జున తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. పేదలకు సెంటు స్థలం ఇస్తే సహించలేని చంద్రబాబు.. రాష్ట్రంలోని పేదలందర్నీ ధనికులుగా మారుస్తానంటే ఎవరు నమ్ముతారని నిలదీశారు. అమ్మకు అన్నం పెట్టడుగానీ పిన్నమ్మకు బంగారు గాజులు చేయిస్తాననే చందంగా చంద్రబాబు మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు ప్రకటించిన మేనిఫెస్టో.. కర్ణాటక రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన మేనిఫెస్టోకు కాపీ అని విమర్శించారు. వైసీపీ అమలు చేస్తున్న అమ్మఒడి పథకాన్నే.. అమ్మకు వందనం అనే పేరుతో కాపీ కొట్టారన్నారు. పూర్ టు రిచ్ అనే కార్యక్రమం చంద్రబాబుకు తన 75 ఏళ్ల వయసులో, రాజకీయ జీవన సంధ్యలో గుర్తొచ్చిందా అని ప్రశ్నించారు. 2014 ఎన్నికల్లో చంద్రబాబు తన మేనిఫెస్టోలో ఇచ్చిన 650 హామీల్లో కనీసం 10 శాతం హామీలను కూడా నెరవేర్చలేదని దుయ్యబట్టారు. సరికొత్త వాగ్దానాలు చేయడం, నాటకాలు ఆడటం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య అని ధ్వజమెత్తారు.
Kunamneni Sambasiva Rao : ఒడిశా ఘటనకు ప్రధాని మోడీ నైతిక బాధ్యత వహించాలి