Medico Chaitanya: విషాదం.. పెళ్లైన రెండు నెలలకే మెడికో ఆత్మహత్య.. కారణం అదేనా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Medico Chaitanya Commits Suicide In Nellore College Hostel: ఈమధ్య రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆత్మహత్య ఘటనలు తరచుగా వెలుగు చూస్తున్నాయి. అందునా.. యువతే ఎక్కువగా పలు కారణాల వల్ల సూసైడ్ చేసుకుంటోంది. తమ బంగారు భవిష్యత్తుకి తామే ముగింపు పలుకుతోంది. సమస్యని ఎలా పరిష్కరించాలన్నది ఆలోచించకుండా.. చావే పరిష్కారమని భావించి, బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. ఇప్పుడు తాజాగా నెల్లూరులో ఓ యువతి సూసైడ్ చేసుకుంది. మెడికల్ కాలేజీ హాస్టల్లో ఆత్మహత్యకు పాల్పడింది. ఆ వివరాల్లోకి వెళ్తే..
CPI Ramakrishna: దేశ ప్రజల మధ్య విభజన రేఖ గీయడానికి.. యూసీసీ తీసుకొస్తున్నారు
Also Read
- Amaravati Development: అమరావతికి కేంద్రం భారీ శుభవార్త.. రాజధాని రూపురేఖలు మారనున్నాయా..?
- Heavy Rain and Thunderstorms: రెడ్ అలర్ట్.. రాబోయే 3 గంటల్లో ఈ జిల్లాల్లో పిడుగుల వర్షం..!
- MLA Thomas: నన్ను గెలకొద్దు.. గెలికితే ఏ రాత్రో హార్ట్ ఎటాక్ వచ్చి పోతావ్.. మాజీ డిప్యూటీ సీఎంపై తీవ్ర వ్యాఖ్యలు
- YS Jagan: భద్రతా వైఫల్యమే ప్రమాదానికి కారణం.. ప్రమాద బాధితులకు అండగా ఉంటాం.!
నెల్లూరులోని చైతన్య అనే యువతి నారాయణ మెడికల్ కాలేజీ హాస్టల్లో ఉంటూ వైద్య విద్యని అభ్యసిస్తోంది. రెండు నెలల క్రితమే ఆమెకు వివాహం అయ్యింది. మొదట్లో అంతా సజావుగానే సాగింది కానీ.. ఇంతలోనే ఆ యువతి కాలేజీ హాస్టల్లో బలవన్మరణానికి పాల్పడింది. ఆదివారం (02-07-23) ఉదయం కళాశాల హాస్టల్ గదిలో సూసైడ్ చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు.. వెంటనే రంగంలోకి దిగారు. హాస్టల్‌కు చేరుకొని, ఆమె మృతదేహాన్ని అదుపులోకి తీసుకొని, పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అలాగే.. చైతన్య ఉన్న హాస్టల్ గదిని సైతం క్షుణ్ణంగా పరిశీలించారు.
Kakani Govardhan Reddy: లోకేష్ పాదయాత్ర ఒక సర్కస్ కంపెనీ.. మీడియా కోసమే వివాదాస్పద వ్యాఖ్యలు
ప్రాథమిక విచారణలో భాగంగా.. కుటుంబ కలహాల కారణంగానే చైతన్మ ఆత్మహత్యకు పాల్పడిందని పోలీసులు భావిస్తున్నారు. అయితే.. సరైన కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. పెళ్లైన రెండు నెలలకే చైతన్య సూసైట్ చేసుకోవడంతో.. కచ్ఛితంగా బలమైన కారణం ఉండనే ఉంటుందని పోలీసులు అనుకుంటున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్నారు. మృతురాలిని శ్రీకాకుళం జిల్లా పలాసకు చెందిన యువతిగా గుర్తించారు.
తాజావార్తలు
-
Kitchen Hacks: వంటింట్లో ఇల్లాళ్లకు బ్రహ్మాస్త్రం.. ఈ చిట్కాలతో గంటల పని నిమిషాల్లో ముగుస్తాయి!
-
Peddi: హోంశాఖకు షాక్: ‘పెద్ది’ టికెట్ల పెంపుపై కోర్టు ధిక్కరణ నోటీసులు!
-
Sangareddy: భార్య సంపాదన పుట్టింటికి ఇస్తోందని కసి.. సుపారీ ఇచ్చి హత్య చేయించిన భర్త!
-
NBK 111 : బాలయ్య ఆన్ ట్రాక్.. ఇక థియేటర్లలో పూనకాలే!
-
Cockroach Janta Party: మోడీ సర్కార్‌కు బొద్దింకల అల్టిమేటం..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్‌తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్‌వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!