పండగపూట తమిళనాడు ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తిరువణ్ణామలై సమీపంలోని సెంగం పక్రిపాళయం సెంగం బైపాస్ వద్ద బస్సు, సుమో ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో ఏడుగురు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో ఎనిమిది మందికి తీవ్ర గాయాలయ్యాయి. బస్సును కారు ఢీకొట్టడంతో ఘటన చోటుచేసుకుంది.
రోడ్డు ప్రమాదాలు కామన్ అయిపోయాయి. కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఐదుగురు మరణించడం విషాదం నింపింది. ఘన్‌పూర్(ఎం) వద్ద ఆర్టీసీ బస్సు కారును ఢీ కొట్టిన ఘటనలో ఐదుగురు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికుల సాయంతో సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. సిరిసిల్ల వైపు నుంచి కరీంనగర్-1 డిపో బస్సు కామారెడ్డికి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో కారు నుజ్జునుజ్జయింది. ప్రమాదం కారణంగా…