రోడ్డు ప్రమాదాలతో అనేక కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. జాతీయ రహదారులపై ప్రమాదాల స్థాయి పెరిగింది. ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. ఏలూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. దెందులూరు మండలం, సోమరపాడు 16వ నెంబర్జా తీయరహదారిపై ఈ ప్రమాదం సంభవించింది. అదుపుతప్పి హైవే బ్రిడ్జిపైనుంచి జంగారెడ్డిగూడెం వెళ్ళే రోడ్డుపై పడింది కారు. దీంతో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు వ్యక్తులకు తీవ్రగాయాలయ్యాయి. వారిని ఏలూరు ఆసుపత్రికి తరలించారు. ప్రమాద ధాటికి నుజ్జునుజ్జైన హ్యుండాయ్ ఆరా మోడల్ కార్ ముందుభాగం నుజ్జునుజ్జయింది. వేగమే ఈ ప్రమాదానికి కారణం అని భావిస్తున్నారు.
బ్యాంక్ ఉద్యోగి చేతివాటం
నెల్లూరు జిల్లా అనంతసాగరంలోని కెనరా బ్యాంక్ లో ఉద్యోగి చేతివాటం బయటపడింది. బంగారు నగల పై ఇచ్చే ఋణాలలో భారీగా అవకతవకలకు పాల్పడిన ఉద్యోగి భాస్కర్ వ్యవహారం వెల్లడైంది. ఖాతాదారులకు తక్కువ నగదు ఇచ్చి మిగతా నగదును స్వాహా చేసిన బంగారం అప్రైజర్ భాస్కర్. బ్యాంకు నుండి బంగారు రుణాలు తీసుకున్న 130 మంది ఖాతాదారుల నగదు స్వాహా అయినట్లు గుర్తించారు బ్యాంకు సిబ్బంది..ఖాతాదారులతో కుమ్మక్కై గతంలోనూ నకిలీ బంగారంతో రుణాలు ఇచ్చిన చరిత్ర భాస్కర్ కి ఉందని ఖాతాదారులు అంటున్నారు. నోటీసులు జారీ చేయడంతో బ్యాంకు వద్దకు చేరుకుని ఆందోళనకు దిగారు కొందరు ఖాతాదారులు..
Read Also: Raviteja: కోర్ట్ బోను ఎక్కిన రవితేజ.. ఏం తప్పు చేశాడు..?