మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు శైవక్షేత్రాలు అప్పుడే సిద్ధం అవుతున్నాయి.. ఇక, మహాశివరాత్రి అనగానే ప్రముఖ శైవక్షేత్రం శ్రీశైలం గుర్తుకు వస్తుంది.. శ్రీశైలంలో జరిగే బ్రహ్మోత్సవాలకు లక్షలాది మంది భక్తులు తరలివస్తుంటారు.. ఈ నేపథ్యంలో సామాన్య భక్తులకు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటున్నారు అధికారులు.. ఇక, శ్రీశైలంలో పిబ్రవరి 22 నుంచి మార్చి 4వ తేదీ వరకు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నట్టు కర్నూలు జిల్లా కలెక్టర్ కోటేశ్వరరావు వెల్లడించారు.. శివరాత్రి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై కర్నూలు, ప్రకాశం, గుంటూరు, మహబూబ్‌నగర్ జిల్లాల అధికారులతో జూమ్ మీటింగ్ నిర్వహించిన ఆయన.. శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు పక్కాగా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. సామాన్య భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకూడదన్న ఆయన.. త్రాగునీరు, పారిశుద్ధ్యం, భద్రత, ట్రాఫిక్, వసతి సమస్యలు లేకుండా గట్టి చర్యలు చేపట్టాలని సూచించారు.
Read Also: ట్రెజరీ ఉద్యోగులు, డీడీవోలకు ప్రభుత్వం మెమోలు