పోలీసు వాహనంలో మందుల చాటున తెలంగాణ మద్యం తరలిస్తుండగా పట్టుకున్నారు సెబ్ అధికారులు. ఇక ఏపీ ఎస్పీ 2వ బెటాలియన్ ఆసుపత్రికి మందుల కోసం సుమో వాహనం, డ్రైవర్ కానిస్టేబుల్ శ్రీనివాసులును హైదరాబాద్ కు పంపారు అధికారులు. మందులు తీసుకొస్తున్న వాహనంలో అలంపూర్ చౌరస్తా వద్ద రెండు కేసుల మద్యం మందుల చాటున ఉంచారు ఏపీ ఎస్పీ కానిస్టేబుళ్లు. పంచలింగాల చెక్ పోస్టు వద్ద వాహనాల తనిఖీలో అక్రమ మద్యం రవాణా గుట్టు రట్టు చేసారు. రెండు కేసుల తెలంగాణ మద్యం (60) సీసాలు స్వాధీనం చేసుకున్నారు. ఆ పోలీసు వాహనం సీజ్ చేసిన పోలీసులు… ఇద్దరు కానిస్టేబుళ్లు అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు.