Liquor Smuggling : ఆదిలాబాద్ జిల్లా మద్యం అక్రమ రవాణాకు కేంద్రంగా మారింది. మహారాష్ట్ర నుంచి మద్యం సీసాలను కొత్త ఎత్తుగడలతో తరలిస్తున్న కేటుగాళ్లను ఎక్సైజ్ అధికారులు పట్టుకున్నారు. పోలీసుల నివేదిక ప్రకారం.. దేశిదారు మద్యం తరలింపులో నూతన మార్గాలు వెతుక్కుంటూ ప్రత్యేకంగా తయారు చేసిన జాకెట్లను దుండగులు ఉపయోగిస్తున్నారు. మద్యం సీసాలను ఈ జాకెట్లలో దాచిన వీరంతా వాటిని ఒంటిపై వేసుకొని రవాణా చేస్తున్నారు. ఈ క్రమంలో అధికారులు చేపట్టిన తనిఖీల్లో ఈ కుట్ర బట్టబయలైంది.…
Fake Police Station: బీహార్‌లో ఓ వ్యక్తి ఏకంగా నకిలీ పోలీసు స్టేషన్‌ను ఏర్పాటు చేసి సంవత్సరం పాటు యథేచ్ఛగా దందాలు చేసిన ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది.
Police Seized Liquor: బిహార్‌లో ముజఫర్‌పూర్ పోలీస్ విభాగం మద్యం మాఫియాలపై భారీ చర్యలు చేపట్టింది. కొత్త సంవత్సర వేడుకల సందర్భంగా మద్యం మాఫియాలు పెద్ద ఎత్తున మద్యం సరఫరా చేయడానికి సిద్ధమవుతున్న నేపథ్యంలో పోలీసులు వారి అక్రమ మద్యం రవాణాను నివారించారు. పంజాబ్‌లో తయారైన దాదాపు రూ. 30 లక్షల విలువైన అక్రమ మద్యంను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మద్యం స్మగ్లర్లు తమ మద్యం తరలింపును గోప్యంగా చేయడానికి చాకచక్యంగా పద్ధతులు అనుసరించారు. మద్యం సీసాలను…
ఈమధ్య కాలంలో చెమటోడ్చి కష్టపడి సంపాదించేవారు చాలా తక్కువ అయిపోయారు. ఎంతసేపు ఉన్న తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు సంపాదించడానికి ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యంగా శరీరానికి పని చెప్పకుండా డబ్బులు సంపాదించే మార్గాలను శోధిస్తున్నారు. ఇకపోతే చాలామంది డబ్బులు వక్రమార్గంలో సంపాదిస్తున్నారు. కొందరు బతకడానికి దొంగతనాలు చేస్తుండగా.. మరికొందరు కొన్ని అడ్డదారుల్లో నడుస్తున్నారు. కొందరైతే బయటి రాష్ట్రాల నుంచి తెలుగు రాష్ట్రాలకు మద్యంను అక్రమంగా తీసుకోవచ్చి వ్యాపారం చేస్తున్నారు. దీనికి కారణం తెలుగు రాష్ట్రాల కంటే పక్క…
పోలీసు వాహనంలో మందుల చాటున తెలంగాణ మద్యం తరలిస్తుండగా పట్టుకున్నారు సెబ్ అధికారులు. ఇక ఏపీ ఎస్పీ 2వ బెటాలియన్ ఆసుపత్రికి మందుల కోసం సుమో వాహనం, డ్రైవర్ కానిస్టేబుల్ శ్రీనివాసులును హైదరాబాద్ కు పంపారు అధికారులు. మందులు తీసుకొస్తున్న వాహనంలో అలంపూర్ చౌరస్తా వద్ద రెండు కేసుల మద్యం మందుల చాటున ఉంచారు ఏపీ ఎస్పీ కానిస్టేబుళ్లు. పంచలింగాల చెక్ పోస్టు వద్ద వాహనాల తనిఖీలో అక్రమ మద్యం రవాణా గుట్టు రట్టు చేసారు. రెండు…