Bandla Ganesh: నటుడు, నిర్మాత అయిన బండ్ల గణేష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ మధ్యకాలంలో వివాదాలకు మారుపేరుగా మారాడు బండ్ల గణేష్. నిత్యం సోషల్ మీడియాలో తనకు తోచిన విషయాలను ట్వీట్ చేస్తూ అభిమానులకు దగ్గరగా ఉంటున్నాడు. ఇక బండ్ల గణేష్ ఏది మాట్లాడిన ఒక వివాదమే అని చెప్పుకోవచ్చు. ఈ మధ్యనే పవన్ కళ్యాణ్- త్రివిక్రమ్ గురించి బండ్లన్న ఇన్ డైరెక్ట్ గా కామెంట్స్ సంచలనం సృష్టించిన విషయం తెల్సిందే. ఇక ఇవన్నీ పక్కన పెడితే తాజాగా బండ్ల గణేష్ ఓల్డ్ ఇంటర్వ్యూ లో మాస్ మహారాజా రవితేజ గురించి చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి. రవితేజను తాను మోసం చేశానని, అయినా సరే ఆయన ఏమీ అనలేదని చెప్పుకొచ్చాడు. రవితేజను దారుణంగా మోసం చేసినందుకు తాను చాలా ఫీల్ అయినట్లు తెలిపాడు. అంతేకాకుండా ఒక హీరో మేనేజర్ చేతిలో తాను మోసపోయానని చెప్పుకొచ్చాడు.
Vishwak Sen: బిగ్ బ్రేకింగ్.. పెళ్లి పీటలు ఎక్కుతున్న విశ్వక్.. ?
“రవితేజకు నేనొక పొలం అమ్మాను. ఆ పొలాన్ని ఆయన చాలా ప్రేమగా కొనుక్కున్నాడు. ఆ పొలం కింద నాకొక 30 ఎకరాలు ఉంది. ఆ 30 ఎకరాలు అమ్మాలంటే.. రవితేజ కు అమ్మిన 25 ఎకరాలు అమ్మితేనే ఇస్తాను అన్నాడు. అప్పుడు రవితేజ దగ్గరకు వెళ్లి అబద్దం చెప్పాను. అన్నా.. నీ పొలం మీద గవర్నమెంట్ వాళ్లు ఏదో ప్లాన్ చేస్తున్నారు.. అమ్మేయడం బెటర్ అని చెప్తే .. నమ్మాడు.. నమ్మి ఇచ్చాడు. చాలా బాధపడ్డా అప్పుడు. రవితేజతో సినిమా తీసి 5 కోట్లు లాభం అందుకున్నాను. అయినా పాపం మోసం చేస్తున్నానే అని బాధపడ్డాను. కానీ, ఏదో ఒక రోజు ఆ రుణం తీర్చేసుకుంటా రవితేజది. ఈ విషయం ఆయనకు కూడా తెలుసు. ఆ తరువాత నేను చెప్పా.. అన్నా నేను నిన్ను మోసం చేశాను అని.. అందుకు ఆయన నాకు తెలుసులేరా అని అన్నాడు” అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి. రవితేజ నటించిన ఆంజనేయులు అనే సినిమాకు బండ్ల గణేష్ నిర్మాతగా వ్యవహరించాడు అన్న విషయం తెల్సిందే.