Minister Janardhan Reddy: పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ను మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుంచి మిగులు జలాలను మాత్రమే వాడుకుంటున్నాం.. దీనిపై తెలంగాణ ప్రభుత్వం, స్థానిక పార్టీలు రాజకీయ లబ్ధి కోసమే నాటకాలు ఆడుతున్నారు అంటూ తీవ్రంగా మండిపడ్డారు.
Uttam Kumar Reddy : జలసౌధలో నీటిపారుదల శాఖాధికారులతో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. కృష్ణా, గోదావరి నదులపై ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిపాదించిన రాయల సీమ ఎత్తిపోతల పథకంతో పాటు బంకచర్ల ఎత్తిపోతల పథకం నిర్మాణాలపై సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. నిబంధనలకు భిన్నంగా ఏపీ ప్రభుత్వం ఏకపక్షంగా ప్రాజెక్టులు నిర్మిస్తుందని, ఏపీ నిర్మిస్తున్న ఆర్ఎల్ఐసితో పాటు బంకచర్ల ప్రాజెక్టుల వల్ల తెలంగాణా సాగునీటి ప్రాజెక్టులతో పాటు ఇక్కడి తాగు…