Kurnool: ప్రాణం తీసిన సంప్రదాయం..! గుర్రపు స్వారీ ప్రాక్టీస్ చేస్తూ వ్యక్తి మృతి
- దసరా ఉత్సవాలలో గుర్రంపై ఊరేగడం యాదవరాజు వంశీయుల సంప్రదాయం..
- పూర్వీకుల నుండి వస్తున్న సంప్రదాయాన్ని కొనసాగించాలని యువకుడి ప్రయత్నం..
- గుర్రపు స్వారీ నేర్చుకుంటుండగా పరుగులు తీసిన గుర్రం..
- అదుపుతప్పి పడిపోయిన యువకుడు.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kurnool: వారి సంప్రదాయం ప్రకారం.. గుర్రపుస్వారీ చేయాలి.. ముఖ్యంగా దసరా ఉత్సవాల రోజు గుర్రంపై ఊరేగడం వారి పూర్వికుల నుంచి సంప్రదాయంగా వస్తుంది.. అయితే, ఆ సంప్రదాయాన్ని కొనసాగించాలన్న ఉద్దేశంతో.. ఓ యువకుడు గుర్రపుస్వారీ నేర్చుకోవడానికి పూనుకున్నాడు.. అదే అతడి ప్రాణాల మీదకు తెచ్చింది.. కర్నూలు జిల్లాలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. మద్దికేరలో గుర్రపు స్వారీ చేస్తూ కిందపడిన పృథ్వీరాజ్ రాయుడు అనే యువకుడికి తీవ్రగాయాలు అయ్యాయి.. ఆ వెంటనే కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరించారు స్థానికులు.. కానీ, ఆస్పత్రిలో చికిత్స పొందుతూ పృథ్వీరాజ్ రాముడు ప్రాణాలు విడిచాడు..
Also Read
- Silver Jubilee Fraternity Meet: కర్నూలు సిల్వర్ జూబ్లీ కాలేజీ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం.. ముఖ్య అతిథిగా వెంకయ్య
- Minister TG Bharath: కర్నూలులో జాబ్ మేళా ప్రారంభం.. యువతకు ఉద్యోగాలు.. కర్నూలుకు భారీ పెట్టుబడులు..!
- Pothireddypadu : పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ వద్ద భారీ ప్రమాదం.. తెగిపడిన 9వ గేటు
- Kurnool Ganesh Immersion: వినాయక నిమజ్జనంపై మంత్రి టీజీ భరత్ కీలక ప్రకటన.. కర్నూలులో ఎక్కడంటే?
కాగా, పూర్వీకుల నుండి వస్తున్న సంప్రదాయాన్ని కొనసాగించాలని ఉద్దేశంతో గుర్రపు స్వారీ నేర్చుకునేందుకు సిద్ధమయ్యాడు పృథ్వీరాజ్ రాముడు.. కొత్తవారు ఎవరైనా సరే.. గ్రురం పరుగులు పెడుతుంటే.. బ్యాలెన్స్ చేయడం కష్టం.. అదే పరిస్థితి రాముడుకు ఎదరైంది.. గుర్రం ఎక్కి ప్రాక్టీస్ చేస్తుండగా.. అది పరుగులు తీసింది.. కొద్దిసేపు ముందుకు సాగిన అతడు.. ఆ తర్వాత గుర్రంపై నిలవలేకపోయాడు.. బైక్‌పై గుర్రాన్ని వెంబడిస్తూ కొందరు యువకులు.. అదుపుచేసే ప్రయత్నం చేసినా గుర్రం పరుగులు ఆపలేదు.. దీంతో.. అదుపుతప్పి గుర్రంపై నుంచి రోడ్డుపై పడిపోయాడు.. తీవ్రగాయాలతో ప్రాణాపాయస్థితిలోకి వెళ్లిన పృథ్వీరాజు రాయుడును స్థానికులు ఆసుపత్రికి తరలించారు. కానీ, అతడి ప్రాణాలు కాపాడలేకపోయారు.. చికిత్స పొందుతూ ఆస్పత్రిలోనే మృతి చెందాడు ఆ యువకుడు.. దీంతో.. ఆ కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరు అవుతున్నారు.. అయితే, మద్దికెరలో దసరా ఉత్సవాలలో గుర్రంపై ఊరేగడం యాదవరాజు వంశీయుల సంప్రదాయం. యాదవరాజుల వంశానికి చెందిన పృథ్వీరాజ్ మృతి చెందడంతో.. ఈ ఏడాది దసరా ఉత్సవాలలో గుర్రపు స్వారీ పందేలు జరుగుతాయా? లేదా? అనే దానిపై ఉత్కంఠ నెలకొంది.
తాజావార్తలు
-
West Indies History: టీ20ల్లో వెస్టిండీస్ నయా చరిత్ర.. అత్యంత విజయవంతమైన ఛేజింగ్ లిస్ట్ ఇదే!
-
Yash-Hanuma Reddy: ఏంటి మావా ఇది.. టాలీవుడ్ కొత్త దర్శకుడితో రాకీ భాయ్ పాన్-ఇండియా మూవీ?
-
Rahul Gandhi and PM Modi: నేడు రాహుల్.. రేపు మోడీ.. చెన్నైలో వరుస కీలక కార్యక్రమాలు
-
AB de Villiers: 42 ఏళ్ల వయసులోనూ తగ్గని జోరు.. 37 బంతుల్లో ఏబీ డివిలియర్స్ విధ్వంసకర సెంచరీ..!
-
How to Get Rid of Lizards at Home: ఇంట్లో బల్లులు ఎక్కువగా ఉన్నాయా? ఈ సింపుల్ చిట్కాలతో తరిమేయండి!
ట్రెండింగ్
-
50MP కెమెరా, 32MP సెల్ఫీ షూటర్, 10,200mAh బ్యాటరీతో Vivo Y600s Pro లాంచ్.!
-
200MP పెరిస్కోప్ కెమెరా, 7 ఏళ్ల సాఫ్ట్వేర్ అప్డేట్స్ తో రాబోతున్న Motorola Signature 27..!
-
Panama Earthquake: 7.7 తీవ్రతతో భారీ భూకంపం.. ఊగిపోయిన భవంతులు.!
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్‌రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!