Mahesh Babu : మార్షల్ ఆర్స్ట్ నేర్చుకునేందుకు చైనాకు వెళ్తున్న మహేష్ ?
- సినిమా కోసం మహేష్ ను సానపెడుతున్న జక్కన్న మార్షల్ ఆర్స్ట్ కోసం చైనాకు వెళ్తున్న మహేష్ రెండు పార్టులుగా రాబోతున్న మూవీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mahesh Babu : సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. తను ప్రస్తుతం ఇండియాస్ ప్రస్టేజియస్ ప్రాజెక్ట్ ఎస్ ఎస్ ఎంబీ 29 చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను రాజమౌళి తెరకెక్కిస్తున్నారు. అడ్వంచరస్ కథతో ఈ చిత్రాన్ని తీర్చిదిద్దుతున్నట్లు సమాచారం. దీంతో మహేష్ కొంత ట్రైనింగ్ పూర్తి చేసిన సంగతి తెలిసిందే. దర్శకుడు రాజమౌళి అదేశాల మేరకు జపాన్ లో కొన్ని రోజుల పాటు స్పెషల్ ట్రైనింగ్ తీసుకున్నట్లు వార్తలు వచ్చాయి. . అటుపై ఆఫ్రికాలోని మసాయి-పిగ్మీస్ తెగల మధ్య బేసిక్ స్పెషల్ ట్రైనింగ్ కూడా తీసుకున్నట్లు కూడా ప్రచారం జరిగింది. ఓ 20 రోజుల పాటు ఆప్రికన్ తెగల మధ్య మహేష్ ఉన్నట్లు ప్రచారం జరిగింది. అయితే తాజాగా మహేష్ చైనా దేశానికి కూడా వెళ్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. సినిమాకి సంబంధించి కొంత మార్షల్ ఆర్స్ట్ పై కూడా బేసిక్ ట్రైనింగ్ అసవరమని భావించి దర్శకుడు రాజమౌళి భావించి మహేష్ ను చైనాకి పంపిస్తున్నాడుట. ఈనెల మిడ్ లోనే మహేష్ చైనా ప్రయాణం ఉంటుందట. అక్కడ స్పెషల్ ట్రైనర్ల ఆధ్వర్యంలో ట్రైనింగ్ ఇనిస్ట్యూట్ లో శిక్షణ ఉంటుందని వార్తలొస్తున్నాయి. మహేష్ తో పాటు రాజమౌళి కూడా అటెండ్ అవుతారని అంటున్నారు. ఆయన ఆధ్వర్యంలోనే మార్షల్ ఆర్స్ట్ మాస్టర్లు ట్రైనింగ్ ఇవ్వనున్నారట.
Read Also:CM Chandrababu: గ్రీన్ ఎనర్జీ రూపంలో రాష్ట్రానికి రూ.10 లక్షల కోట్ల పెట్టుబడులు..
Also Read
- Free International Roaming: బంపర్ ఆఫర్.. 5GB డేటా, 60 నిమిషాల కాల్స్‌తో పాటు ఉచిత అంతర్జాతీయ రోమింగ్..!
- IP68+IP69 రేటింగ్స్, 5-స్టార్ డ్రాప్ రెసిస్టెన్స్, 8,000mAh బ్యాటరీతో Vivo Y32 లాంచ్.. ధర, స్పెసిఫికేషన్లు ఇవే!
- Shami-Siraj: భువనేశ్వర్ కుమార్ రీ-ఎంట్రీ.. షమీ, సిరాజ్‌లకు బీసీసీఐ క్లియర్ మెసేజ్..!
- Donald Trump: నేనేమీ డబ్బా కొట్టుకోవట్లేదు.. నిజాలే చెప్తున్నా.. నోబెల్ శాంతి బహుమతి నాకే రావాలి..
ఇదే నిజమైతే మహేష్ ని జక్కన్న ఏ రేంజ్ లో సానబెడుతున్నాడో ఇక్కడే అర్దమవుతుంది. షూటింగ్ ప్రారంభానికి ముందే ఇన్ని రకాల ట్రైనింగ్ లు అంటే చిన్న విషయం కాదు. ఎంతో ఓపికతో పూర్తి చేయాల్సిన ట్రైనింగులు అవన్నీ కూడా. సినిమా కోసం మహేష్ ఏమాత్రం ఆలోచించరు. కాంప్రమైజ్ అయ్యేటు వంటి వ్యక్తి అసలే కాదు. జపాన్, మసాయి తెగల మధ్యనే గడిపిన మహేష్ చైనా ట్రైనింగ్ పూర్తి చేయలేడా అని అంటున్నారు ఆయన అభిమానులు. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఈ సినిమా అడ్వెంచర్ థ్రిల్లర్ కావడంతోనే ఇన్ని రకాల ట్రైనింగ్ లు అవసరం అవుతున్నాయి. మేజర్ పార్టు షూటింగ్ ఆప్రికన్ అడవుల్లోనే ఉంటుందని వార్తలు వినిపిస్తున్నాయి. అటు రామోజీ ఫిలిం సిటీ సహా హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో సైతం పెద్ద ఎత్తున సెట్లు నిర్మిస్తున్నారు. ఈ సినిమా రెండు పార్టులుగా రాబోతుంది. ఫస్ట్ పార్టు 2026లో రిలీజ్ కానుంది. ఆ తర్వాత సెకండ్ పార్ట్ 2029లో రాబోతుంది.
తాజావార్తలు
-
Nana Patekar Dies: బాలీవుడ్ నటుడు నానా పటేకర్ కన్నుమూత.. గోవా నివాసంలో అపస్మారక స్థితిలో..!
-
NBK DADA : సెట్స్‌లో అడుగుపెట్టిన సింహం.. క్రిస్ట’మాస్’ చూపించబోతున్నారు
-
MG Hector Blackstorm: MG హెక్టర్ బ్లాక్‌స్టార్మ్, స్నోస్టార్మ్ ఎడిషన్స్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే
-
Free International Roaming: బంపర్ ఆఫర్.. 5GB డేటా, 60 నిమిషాల కాల్స్‌తో పాటు ఉచిత అంతర్జాతీయ రోమింగ్..!
-
IP68+IP69 రేటింగ్స్, 5-స్టార్ డ్రాప్ రెసిస్టెన్స్, 8,000mAh బ్యాటరీతో Vivo Y32 లాంచ్.. ధర, స్పెసిఫికేషన్లు ఇవే!
ట్రెండింగ్
-
Indian Air Force Day : ఒక్క విమానం వెనుక ఇంత కథ ఉందా?
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్‌ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!