Pothireddypadu : పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ వద్ద భారీ ప్రమాదం.. తెగిపడిన 9వ గేటు
- 9వ గేటు రోప్స్ తెగడంతో ఘటన
- గేట్ల నిర్వహణపై అధికారులపై విమర్శలు
- 8 వేల క్యూసెక్కుల నీటి విడుదల కొనసాగింపు
- గేటు పునరుద్ధరణకు రంగంలోకి నిపుణులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కర్నూలు జిల్లా పరిధిలోని అత్యంత కీలకమైన పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ప్రాజెక్టు వద్ద ప్రమాదం చోటుచేసుకుంది. ప్రాజెక్టులోని 9వ గేటు ఒక్కసారిగా తెగిపోయి కిందపడటంతో అక్కడున్న సిబ్బంది, స్థానికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. అధికారులు నీటి ప్రవాహాన్ని నియంత్రించేందుకు , పనులు నిర్వహించేందుకు గేటును పైకి ఎత్తుతున్న సమయంలో ఈ ఘటన జరిగింది. ఊహించని విధంగా గేటు రోప్స్ తెగిపోవడంతో అది అలాగే కిందపడి నిలిచిపోయింది.
ఆపరేషన్ లో లేని గేట్లు… అధికారుల నిర్లక్ష్యం?
పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్‌కు సంబంధించి 1, 2, 9, 10 నంబరు గేట్లను చాలా రోజులుగా సరిగ్గా ఆపరేట్ చేయడం లేదని తెలుస్తోంది. క్రమం తప్పకుండా నిర్వహణ పనులు చేపట్టకపోవడం, చాలా కాలం పాటు ఆపరేషన్‌లో లేకపోవడం వల్లనే లోహపు రోప్‌లు బలహీనపడి 9వ గేటు తెగిపడి ఉంటుందని ప్రాథమికంగా భావిస్తున్నారు. ప్రాజెక్టు నిర్వహణ తీరుపై , అధికారుల నిర్లక్ష్యంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
Also Read
- Jana Sena - TDP: ఏలూరు మేయర్ సీటుపై జనసేన పట్టు..! అప్పలనాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు
- Gudivada Amarnath: చంద్రబాబు ఏం చేసినా అమ్మకాలే.. గుడివాడ అమర్నాథ్ సంచలన ఆరోపణలు
- Subsidised Onions: సామాన్యులకు గుడ్‌న్యూస్.. సబ్సిడీపై ఉల్లిపాయల విక్రయాలు..
- Palla Srinivasa Rao: స్థానిక ఎన్నికలపై పల్లా శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు.. మాకు అవే ముఖ్యం..!
కాలువలకు కొనసాగుతున్న నీటి విడుదల
ప్రమాదం జరిగినప్పటికీ, ప్రస్తుతం పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా శ్రీశైలం జలాల తరలింపు కొనసాగుతోంది. ప్రాజెక్టు నుంచి సుమారు 8 వేల క్యూసెక్కుల నీటి ప్రవాహం దిగువకు ప్రవహిస్తోంది. ఈ హెడ్ రెగ్యులేటర్ ఆధారంగా కేసీ కెనాల్, ఎస్ఆర్బీసీ (SRBC) , తెలుగు గంగ కాలువలకు నీటి విడుదల నిరంతరాయంగా సాగుతోంది.
అప్రమత్తమైన జలవనరుల శాఖ అధికారులు
గేటు తెగిపడిన విషయం తెలిసిన వెంటనే నీటిపారుదల శాఖ ఇంజనీర్లు, ప్రాజెక్టు అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. నీటి ఉధృతి వల్ల ఎలాంటి అదనపు ప్రమాదం జరగకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు చేపడుతున్నారు. తెగిపోయిన 9వ గేటును పునరుద్ధరించేందుకు , ఇతర గేట్ల భద్రతను పరిశీలించేందుకు నిపుణుల బృందం రంగంలోకి దిగింది.
తాజావార్తలు
-
YouTuber Nandu : నేను బిగ్ బాస్ కోసం రాలేదు.. కుట్ర జరిగింది, అసలు దోషులు వేరే ఉన్నారు!
-
INDIA Bloc: ‘‘ఓట్ చోరీ’’పై ఇండీ కూటమి యాక్షన్ ప్లాన్..
-
Central Cabinet Decision: అన్నదాతలకు గుడ్‌న్యూస్.. కేంద్ర కేబినెట్ నిర్ణయాలు ఇవే!
-
Jr NTR Fan: ఎన్టీఆర్ ను కలిసి ముద్దాడిన ఫ్యాన్
-
EPFO New Rules: అక్టోబర్ నుంచి కొత్త రూల్స్.. ప్రతి ఉద్యోగి తప్పక తెలుసుకోవాల్సిన కీలక విషయాలు ఇవే!+
ట్రెండింగ్
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!
-
IP68+IP69 రేటింగ్, 8,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో కొత్త బడ్జెట్ ఫోన్ Vivo Y600i లాంచ్..!