Kurnool Ganesh Immersion: వినాయక నిమజ్జనంపై మంత్రి టీజీ భరత్ కీలక ప్రకటన.. కర్నూలులో ఎక్కడంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kurnool Ganesh Immersion: వర్షాలు లేకపోవడం, కృష్ణానదిలోనూ తగినంత నీటి లభ్యత లేకపోవడం ఇప్పుడు వినాయక నిమజ్జనంపై ప్రభావం పడుతోంది.. అయితే, వినాయక నిమజ్జనానికి కర్నూలులో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నట్లు మంత్రి టీజీ భరత్ తెలిపారు. తీవ్ర వర్షాభావ పరిస్థితుల కారణంగా సుంకేసులలో నీటి లభ్యత లేకపోవడంతో అక్కడి నుంచి కే.సి. కెనాల్‌కు నీటిని విడుదల చేసే పరిస్థితి లేదన్నారు. దీంతో ప్రస్తుతం కే.సి. కెనాల్లో వినాయక విగ్రహాల నిమజ్జనం సాధ్యం కాదని స్పష్టం చేశారు. హంద్రీనీవా కాలువలోని నన్నూర్ టోల్గేట్, తడకనపల్లె, ఉలిందకొండ ప్రాంతాల్లో నిమజ్జనానికి ఏర్పాట్లు చేయాలని నిర్ణయించినట్లు మంత్రి తెలిపారు. హంద్రీనీవాకు మరో 12 నుంచి 14 రోజుల పాటు నీటిని తీసుకునే అవకాశం ఉందన్నారు. పెద్ద విగ్రహాల నిమజ్జనానికి కూడా అవసరమైన ఏర్పాట్లు చేస్తామని అధికారులు హామీ ఇచ్చినట్లు వెల్లడించారు.
5, 7వ రోజుల్లో నిమజ్జనానికి అనుకూలం
వినాయక నిమజ్జనానికి 5వ, 7వ, 9వ రోజుల్లో హంద్రీనీవాలో అవకాశం కల్పించనున్నట్లు మంత్రి తెలిపారు. అయితే 5వ, 7వ రోజుల్లో నీటి లభ్యత ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నందున ఆ రెండు రోజులు నిమజ్జనానికి అత్యంత అనుకూలంగా ఉంటాయని చెప్పారు. 9వ రోజు నీటి లభ్యత ఎలా ఉంటుందో ఇప్పుడే ఖచ్చితంగా అంచనా వేయడం సాధ్యం కాదన్నారు భరత్.. నిమజ్జన కమిటీ మూడు ప్రాంతాల్లో ఒక ప్రాంతాన్ని ఎంపిక చేసుకోవాలని మంత్రి సూచించారు. ఎంపిక చేసిన ప్రాంతంలో కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో అవసరమైన ఏర్పాట్లు చేస్తామని తెలిపారు. పెద్ద విగ్రహాలను కమిటీ, అధికారులు ఎంపిక చేసిన ప్రాంతంలోనే నిమజ్జనం చేయాలని సూచించారు.
Also Read
- Minister TG Bharath: కర్నూలులో జాబ్ మేళా ప్రారంభం.. యువతకు ఉద్యోగాలు.. కర్నూలుకు భారీ పెట్టుబడులు..!
- Pothireddypadu : పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ వద్ద భారీ ప్రమాదం.. తెగిపడిన 9వ గేటు
- AP School Education Department: మెగా DSC-2025 నియామకంపై కీలక ప్రకటన.. విచారణకు ఆదేశించిన విద్యాశాఖ
- Kurnool High Court Bench: కర్నూలులో హైకోర్టు బెంచ్.. మంత్రి టీజీ భరత్ కీలక వ్యాఖ్యలు
మట్టి విగ్రహాలనే ఏర్పాటు చేసుకోవాలి
ప్రజలు ఒక అడుగు నుంచి అడుగున్నర వరకు ఉండే మట్టి విగ్రహాలను మాత్రమే ఏర్పాటు చేసుకోవాలని మంత్రి టీజీ భరత్ విజ్ఞప్తి చేశారు. చిన్న మట్టి విగ్రహాలను ఇంటి వద్దే నిమజ్జనం చేసుకోవచ్చని తెలిపారు. పర్యావరణ పరిరక్షణతో పాటు నీటి కొరతను దృష్టిలో ఉంచుకుని ప్రజలు ప్రభుత్వానికి సహకరించాలని కోరారు.
వర్షాల కోసం వరుణ యాగం
రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురవాలని వరుణ యాగం నిర్వహించే అంశంపై కేబినెట్లో చర్చ జరిగినట్లు మంత్రి తెలిపారు. కర్నూలులో గాయత్రి గోసేవ సమితి ఆధ్వర్యంలో వరుణ యాగం నిర్వహించనున్నట్లు చెప్పారు. వర్షాలు కురిసి సుంకేసులకు నీరు చేరితే.. అక్కడి నుంచి కే.సి. కెనాల్‌కు నీటిని విడుదల చేసే అవకాశం ఉంటుందని వివరించారు. ప్రస్తుత పరిస్థితుల్లో కే.సి. కెనాల్లో వినాయక నిమజ్జనం సాధ్యం కాదని మంత్రి మరోసారి స్పష్టం చేశారు. నీటి కొరత, వర్షాభావ పరిస్థితులను ప్రజలు అర్థం చేసుకుని ప్రత్యామ్నాయ ప్రాంతాల్లో నిమజ్జనానికి సహకరించాలని కోరారు మంత్రి టీజీ భరత్..
తాజావార్తలు
-
Tamil Nadu: బంగారం, డబ్బులు ఎక్స్పోజ్ చేస్తూ రీల్స్.. వీడియోలు చూసి కేజీ గోల్డ్, భారీగా డబ్బు కొట్టేసిన దొంగలు..
-
AP Local Body Elections: స్థానిక ఎన్నికలకు రెడీ.. తీర్పు కోసం ఎదురుచూపులు.!
-
Asian Games 2026: మహిళల కబడ్డీలో భారత్ జయభేరి.. ఇరాన్‌పై ఉత్కంఠ విజయం.. గోల్డ్ మెడల్ కైవసం
-
KCR: తెలంగాణ ఆత్మగౌరవ ధిక్కార స్వరం చాకలి ఐలమ్మ..
-
Uttam Kumar Reddy: “రిఫరీపైనే అనుమానం వస్తే ప్రజాస్వామ్యానికే ప్రమాదం”.. ఈసీ, బీజేపీపై మంత్రి ఫైర్..
ట్రెండింగ్
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?
-
Beerakaya Pachadi: వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని తింటే అమృతమే.. నోరూరించే “బీరకాయ రోటి పచ్చడి” చేసేయండిలా..!