ఏపీలో కేఆర్ఎంబీ బృందం పర్యటన వాయిదా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాయలసీమ ఎత్తిపోతల పథకం పనులను తనిఖీ చేసేందుకు కృష్ణా రివర్ బోర్డు బృందం, ఈరోజు తలపెట్టిన పర్యటన అర్ధంతరంగా వాయిదా పడింది. ఈ మేరకు ఏపీ నీటిపారుదల శాఖ కార్యదర్శితోపాటు ఇతర అధికారులకు కేఆర్ఎంబీ సభ్యకార్యదర్శి డి.ఎం.రాయిపూరే లేఖ రాశారు. కృష్ణా బోర్డు బృందంలో తెలంగాణ స్థానికత కలిగిన కేంద్ర జలసంఘం అధికారి దేవేందర్రావు ఉండటంపై అభ్యంతరం తెలుపుతూ ఏపీ సర్కారు.. నేషనల్ గ్రీన్ ట్రిబ్యూనల్ లో పిటిషన్ దాఖలు చేసిన తరుణంలో పర్యటన వాయిదా పడింది. ఏపీ పిటిషన్పై నిన్న ఎన్జీటీ న్యాయ సభ్యుడు జస్టిస్ కె.రామకృష్ణన్, సభ్య నిపుణుడు కె.సత్యగోపాల్తో కూడిన ద్విసభ్య ధర్మాసనం విచారణ జరిపింది. బృందంలో ఇరు రాష్ట్రాలకు చెందిన అధికారులు లేకుండా తనిఖీలు చేయగలమని కేఆర్ఎంబీ చెప్పిన అంశాన్ని పరిగణనలోకి తీసుకుంటున్నామని స్పష్టం చేసింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ప్రాథమిక నివేదికను ఈ నెల 9న అందజేయాలని ఆదేశించింది.
Also Read
- Pawan Kalyan: నేడు ఢిల్లీకి పవన్ కళ్యాణ్.. జనసేన జాతీయ విస్తరణ దిశగా కీలక అడుగు!
- Papikondalu Boat Services: పాపికొండల బోటు యాత్రలకు తాత్కాలిక బ్రేక్.. భద్రతా తనిఖీల తర్వాతే అనుమతి!
- OTR : పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్టు ఆ ఎమ్మెల్యే పరిస్థితి?
- OTR : మంత్రి దుర్గేష్, ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు మధ్య విభేదాలు?
తాజావార్తలు
-
Russian Oil: రష్యా చమురు కొనుగోలులో భారత్ జోరు..
-
Buchi Babu: అచ్చెమ్మ క్యారెక్టర్ రేంజ్ ఏంటో బుధవారం చూస్తారు.. జాన్వీ కపూర్ రోల్పై డైరెక్టర్ బుచ్చిబాబు షాకింగ్ కామెంట్స్!
-
Kitchen Tips : బియ్యాన్ని ఇలా కడగకపోతే అన్నం రుచి, ఆరోగ్యం రెండూ దెబ్బే.!
-
Ananta Sriram: ‘పెద్ది’ ఐటమ్ సాంగ్ విమర్శలపై ఇచ్చిపడేసిన అనంత శ్రీరామ్.. ‘వాళ్లే అసలైన ఐటమ్ గాళ్లు’!
-
Khawaja Asif: ఖురాన్తో బెదిరింపులు.. చంపేస్తామంటూ పాక్ రక్షణమంత్రి వార్నింగ్..
ట్రెండింగ్
-
Rahamathullah Gurbaj: నా సెంచరీకి కారణం గౌతమ్ గంభీర్.. అఫ్గాన్ ఓపెనర్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Rahmanullah Gurbaz Record: జట్టు ఓడిపోయినప్పటికీ రహ్మనుల్లా గుర్బాజ్ చరిత్ర.. క్రికెట్లోనే సరికొత్త మైలురాయి!
-
Nitish Kumar Reddy: అమ్మతో అట్లుంటది మరి.. ప్రెస్ కాన్ఫరెన్స్ కూడా ఆపేసిన నితీష్ రెడ్డి.. వీడియో వైరల్!
-
Garlic for High Cholesterol: ఖాళీ కడుపుతో వెల్లుల్లి తినడం వల్ల బ్లాక్స్ తగ్గుతాయా..?
-
Home Remedies : ఇంట్లో చీమల బెడదా.? 2 పదార్థాలతో శాశ్వత పరిష్కారం.!