Perni Nani: మచిలీపట్నంలో మరోసారి పొలిటికల్ హీట్ పెరిగింది.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కీలక నేతల అత్యవసర సమావేశంలో మాజీ మంత్రి పేర్ని నాని కీలక వ్యాఖ్యలు చేశారు.. మంత్రి కొల్లు రవీంద్రను నేరుగా టార్గెట్ చేస్తూ.. ఏ కేసైనా పెట్టండి.. ఎదుర్కొనడానికి సిద్ధంగా ఉన్నా.. ఐ యామ్ వెయిటింగ్ అంటూ ఘాటుగా సవాల్ విసిరారు. రాజకీయంగా వేధింపులకు తాను భయపడబోనని స్పష్టం చేసిన నాని.. కూటమి ప్రభుత్వంపై ఘాటు విమర్శలు గుప్పించారు. మాయ మాటలతో గద్దె ఎక్కి.. మా కార్యకర్తల ఇంట్లో టపాసులు కాల్చారు.. పూల కుండీలు బద్దలు కొట్టారు అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్సార్సీపీ కార్యకర్తలపై రాజకీయ కక్షతో దాడులు జరుగుతున్నాయని, నేతలపై అక్రమ అరెస్టులు కొనసాగుతున్నాయంటూ మండిపడ్డారు. రేషన్ బియ్యం కేసుపై స్పందించిన నాని, తనపై, తన భార్యపై తప్పుడు కేసులు పెడుతున్నారని, అవినీతి చేయాల్సిన అవసరం తనకు ఎప్పుడూ లేదని స్పష్టం చేశారు. రాజకీయాలకు సంబంధం లేని భార్యను కాపాడుకోవడానికి గడప దాటి వెళ్లాను.. కానీ, పారిపోవాల్సిన అవసరం లేదు.. బందరులోనే ఉంటాను అంటూ తేల్చిచెప్పారు.
Read Also: Iran-Israel: ఇరాన్‌పై ఇజ్రాయెల్ భీకరదాడులు.. ఎమర్జెన్సీ ప్రకటించిన ఇజ్రాయెల్
ఇక ఇళ్ల పట్టాలపై స్పష్టత ఇచ్చిన పేర్ని నాని, బందరులో 19,410 మందికి ఆన్లైన్ ఆధారంగా పట్టాలు ఇచ్చాం.. ఒక్కొక్క దానికి అప్లికేషన్ నంబర్, అధికార రికార్డు ఉంది అన్నారు. ఇక కొల్లు రవీంద్ర ఇచ్చిన పట్టాలకు మాత్రం ఆధారాలే లేవు అంటూ ఆరోపించారు. పోర్ట్ అభివృద్ధి పేరుతో వేల ఎకరాలు లాక్కొంటున్నారని,
చేపల మార్కెట్ నుంచి ఇసుక వరకూ.. అన్నీ రంగాల్లో కొల్లు రవీంద్ర అవినీతి పాల్పడుతున్నాడు అంటూ మండిపడ్డారు.
Read Also: Air India plane crash: విమానం టేకాఫ్ వెనక ఉన్న సైన్స్ ఇదే.. విమాన గతిని నియంత్రించే 4 శక్తులు..
2024 ఎన్నికల్లో ఎదురైన ఓటమి తర్వాత.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో వరుసగా జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో.. ఇక చాలు ఎన్నాళ్లు బ్యాక్ఎండ్లో ఉంటాం.. తాడో పేడో తేల్చుకోవాలి అనుకున్నారేమో మాజీ మంత్రి పేర్ని నాని. అందుకే, మచిలీపట్నంలోని పార్టీ ముఖ్య నాయకులను అందరినీ పిలిచి ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశం ఇప్పుడు వైఎస్సార్సీపీ క్యాడర్లోనే కాదు.. పొలిటికల్ సర్కిల్స్‌లో కూడా హాట్ టాపిక్‌గా మారింది. పేర్ని నానిపై వరుస ఆరోపణలు.. వెంటతుడుతున్న కేసులు చూస్తే, ఇక ఆయన రాజకీయంగా మౌనవ్రతం పడతారని అనుకున్నారు అంతా.. కానీ, ఆ అంచనాలన్నింటినీ సొంత పార్టీ నేతలు ముందే తిప్పికొట్టారు. గత ఐదేళ్లలో తన పాలన ఎలా సాగిందో.. ఇప్పుడు కొత్త పాలన ఎలా ఉంది అనే విషయం స్పష్టంగా వివరించారు. అంతే కాదు, ఇటు అధికార యంత్రాంగంపై.. అటు మంత్రి కొల్లు రవీంద్రపై నేరుగా ఫైర్ అయ్యారు. ఈ పరిణామాల నేపథ్యంలో.. పేర్ని నాని టెన్షన్లో పడ్డారా..? లేక ప్రత్యర్థులకు టెన్షన్ పెడుతున్నారా..? ఇప్పుడు ఈ అంశం రాజకీయ వర్గాల్లో టాక్ ఆఫ్ ది పాలిటిక్స్ గా మారింది..