Perni Nani: చంద్రబాబు, పవన్, మాధవ్.. మీకు ఎందుకు ఓట్లు వేయాలి? పేర్ని నాని ప్రశ్నల వర్షం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Perni Nani: ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికలకు హీట్ పుట్టిస్తున్నాయి.. ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వ పాలన, ఎన్నికల హామీలు, నిత్యావసరాల ధరలు, సంక్షేమ పథకాలు, పంచాయతీలకు నిధుల కేటాయింపు, స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై మాజీ మంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత పేర్ని నాని తీవ్ర విమర్శలు చేశారు. చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్, మాధవ్ ప్రజలను ఓట్లు అడుగుతున్నారని, అసలు ప్రజలు తమకు ఎందుకు ఓట్లు వేయాలనే ప్రశ్నకు వారు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రజలపై ఆర్థిక భారం పెంచుతూ, ఇచ్చిన హామీలను అమలు చేయకుండా మళ్లీ ఓట్లు అడగడం ఏమిటని ప్రశ్నించారు.
ధరల పెరుగుదలకు ఓట్లు వేయాలా?
రాష్ట్రంలో నిత్యావసరాల ధరలు పెరిగాయని పేర్ని నాని ఆరోపించారు. బియ్యం బస్తా ధర రూ.2,600కు చేరిందని, కిలో ఉల్లిపాయల ధర రూ.60కు చేరిందని పేర్కొంటూ, ఇలాంటి పరిస్థితులకు ప్రజలు కూటమికి ఓట్లు వేయాలా అని ప్రశ్నించారు. పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గిస్తామని గతంలో హామీ ఇచ్చారని, ప్రస్తుతం వాటి ధరలు ఎంత ఉన్నాయో చంద్రబాబు సమాధానం చెప్పాలని అన్నారు. పాదయాత్ర సమయంలో నారా లోకేష్ పెట్రోల్ బంకుల వద్ద సెల్ఫీలు దిగుతూ ధరలపై మాట్లాడారని గుర్తుచేశారు. ఇప్పుడు ధరలు తగ్గించేందుకు ఏం చర్యలు తీసుకున్నారని ప్రశ్నించారు. విద్యుత్ ఛార్జీలు పెంచలేదని చంద్రబాబు చెబుతున్న మాటలు వాస్తవాలకు విరుద్ధంగా ఉన్నాయని విమర్శించారు. చంద్రబాబు చెప్పే మాటలన్నీ ప్రజలను తప్పుదోవ పట్టించేలా ఉన్నాయని, ఆయన ఒక ఫేక్ సీఎం అని పేర్ని నాని వ్యాఖ్యానించారు.
Also Read
- Venkaiah Naidu: ప్రతిపక్షాలు అతిగా ప్రవర్తిస్తున్నాయి.. గెలిస్తే ఘనత, ఓడితే EVMలపై నిందలా?
- Minister Kollu Ravindra: అర్ధరాత్రి మచిలీపట్నం ఫిషింగ్ హార్బర్‌ను సందర్శించిన మంత్రి.. అధికారుల తీరుపై అసహనం
- Krishna Delta Water Crisis: 90 శాతం భూముల్లో సాగు కాలేదు.. కృష్ణా డెల్టా పరిస్థితిపై పేర్ని నాని కీలక వ్యాఖ్యలు
- YouTuber Rama Nandana: ఇబ్రహీంపట్నం పీఎస్‌లో యూట్యూబర్ రమా నందన విచారణ..
స్పెషల్ ఫ్లైట్లు, హెలికాప్టర్ ప్రయాణాలపై విమర్శలు
చంద్రబాబు, పవన్ కల్యాణ్, మాధవ్ ప్రజల సొమ్ముతో స్పెషల్ ఫ్లైట్లలో ప్రయాణిస్తున్నారని పేర్ని నాని ఆరోపించారు. హైదరాబాద్‌కు హెలికాప్టర్లలో తరచూ ప్రయాణాలు చేస్తున్నారని విమర్శించారు. రాష్ట్ర ప్రజలపై ఆర్థిక భారం పెరుగుతున్న సమయంలో పాలకులు తమ ప్రయాణాల కోసం ప్రజాధనాన్ని ఖర్చు చేస్తున్నారని ఆరోపిస్తూ, ఈ పరిస్థితుల్లో ప్రజలు ఎందుకు ఓట్లు వేయాలని ప్రశ్నించారు. అంతే కాదు.. కూటమి ప్రభుత్వాన్ని ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు, పవన్ కల్యాణ్ నేతృత్వంలోని కూటమిపై విమర్శలు చేస్తూ ‘అలీబాబా ఇద్దరు దొంగల కూటమి’ అని వ్యాఖ్యానించారు. రెండున్నరేళ్ల పాలనలో ప్రజలపై ఇప్పటికే అనేక భారాలు మోపారని, ఇంకా ట్రిపుల్ ఇంజన్ ప్రభుత్వం కావాలని కోరడం ఏమిటని ప్రశ్నించారు. మున్సిపాలిటీల్లోనే మంచి నాయకత్వం కావాలా? జిల్లా పరిషత్‌లు, మండలాల్లో మంచి నాయకత్వం అవసరం లేదా? అని నిలదీశారు. అన్ని స్థాయిల్లో ప్రజలకు జవాబుదారీగా ఉండే పాలన అందించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు.
ఎమ్మెల్యేలు, మంత్రులను నియంత్రించలేకపోతున్నారా?
నీతి, నిజాయితీకి పెద్దపీట వేస్తున్నామని కూటమి నేతలు చెబుతున్నారని, అయితే తమ ఎమ్మెల్యేలు, మంత్రులను నిజాయితీగా ఉంచగలుగుతున్నారా అని పేర్ని నాని ప్రశ్నించారు. ప్రభుత్వంలోని ప్రజాప్రతినిధుల వ్యవహారశైలిపై ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఇక, అభ్యర్థుల ఎంపిక విషయంలో తుఫాన్ కారణంగా ఇబ్బందులు ఎదురయ్యాయని పవన్ కల్యాణ్ చెప్పినట్లు పేర్ని నాని ప్రస్తావించారు. పార్టీ కార్యకర్తలే ఎప్పుడూ త్యాగాలు చేయాలా? పవన్ కల్యాణ్, ఆయన అన్నయ్య కూడా త్యాగాలు చేయరా? అని ప్రశ్నించారు. 2024లో జనసేన కార్యకర్తలు వైసీపీతో ఘర్షణలకు దిగారని, ఇప్పుడు టీడీపీతో కూడా గొడవలు పడుతున్నారని వ్యాఖ్యానించారు. కూటమి పార్టీల మధ్య కార్యకర్తలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని విమర్శించారు.
రూ.1.50 లక్షల కోట్ల పల్లె పండుగ నిధులు ఎక్కడ?
రూ.1.50 లక్షల కోట్లతో పల్లె పండుగ నిర్వహించామని కూటమి ప్రభుత్వం చెబుతోందని పేర్ని నాని పేర్కొన్నారు. అయితే, ఆ నిధులతో ఏ గ్రామంలో అభివృద్ధి జరిగిందో ప్రభుత్వం స్పష్టంగా చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రమాణ స్వీకారం అనంతరం ప్రతి పంచాయతీలో జెండా పండుగ నిర్వహించాలని చెప్పారని, కానీ ఇప్పటివరకు ఆ కార్యక్రమానికి సంబంధించిన నిధులు విడుదల చేశారా అని ప్రశ్నించారు. గత రెండున్నరేళ్లలో రిజిస్ట్రేషన్ శాఖ నుంచి పంచాయతీలకు ఒక్క రూపాయి అయినా వచ్చిందా అని నిలదీశారు. 15వ ఆర్థిక సంఘం నిధులను కూడా ప్రభుత్వం వినియోగించుకుందని ఆరోపించారు. పంచాయతీల్లో అభివృద్ధి పనులు చేపట్టేందుకు నిధులు లేకపోతే, ప్రభుత్వం ప్రకటించిన భారీ అభివృద్ధి కార్యక్రమాల ప్రయోజనం ఏమిటని ప్రశ్నించారు.
వైసీపీ అభ్యర్థులకు నామినేషన్లు వేయనివ్వడం లేదని ఆరోపణ
స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా వైసీపీ అభ్యర్థులను నామినేషన్లు దాఖలు చేయకుండా అడ్డుకుంటున్నారని పేర్ని నాని ఆరోపించారు. నామినేషన్లు వేస్తే పత్రాలను చించేస్తున్నారని, వైసీపీ అభ్యర్థుల పేర్లతో టీడీపీ వారితో నకిలీ నామినేషన్లు వేయిస్తున్నారని విమర్శించారు. నామినేషన్లను ఉపసంహరించుకోవాలని ఒక డీఎస్పీ వైసీపీ అభ్యర్థులను బెదిరిస్తున్నారని ఆరోపిస్తూ, పోలీసుల వ్యవహారశైలిపై తీవ్రంగా స్పందించారు. వైసీపీ అంటే చంద్రబాబు, పవన్ కల్యాణ్‌కు ఎందుకంత భయమని ప్రశ్నించారు. ప్రజలు తమపై తిరగబడతారనే భయంతోనే వైసీపీ అభ్యర్థులను ఎన్నికల్లో పోటీ చేయకుండా అడ్డుకుంటున్నారని ఆరోపించారు.
సంక్షేమ హామీలు ఏమయ్యాయి?
కూటమి ప్రభుత్వం సంక్షేమాన్ని క్షామంగా మార్చిందని పేర్ని నాని విమర్శించారు. 50 ఏళ్లు నిండిన వారికి పెన్షన్లు ఇస్తామని, ప్రతి ఆడబిడ్డకు నెలకు రూ.1,500 అందిస్తామని ఇచ్చిన హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. మత్స్యకారులకు వేట నిషేధ భృతి, ఆయిల్ సబ్సిడీ అందించడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. రాష్ట్రంలో ఎంతమందికి నిరుద్యోగ భృతి ఇచ్చారని ప్రశ్నించిన ఆయన, కొత్తగా ఒక్క పెన్షన్ కూడా ఇవ్వకపోగా ఏడు లక్షల పెన్షన్లు తొలగించారని మండిపడ్డారు.. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తామని చెప్పి, ఐదు కేటగిరీలకే పరిమితం చేశారని విమర్శించారు. బస్సులు ఆపడం లేదని, మహిళలను ఆర్టీసీ డ్రైవర్లు దుర్భాషలాడుతున్న ఘటనలు కూడా జరుగుతున్నాయని ఫైర్ అయ్యారు.. ఇక, గత రెండున్నరేళ్లలో రూ.4 లక్షల కోట్ల అప్పు తెచ్చి ప్రజలపై భారం మోపారన్న పేర్ని నాని.. అప్పులు తెచ్చిన ప్రభుత్వం ప్రజలకు అందించిన ప్రయోజనాలేమిటో వివరించాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు, లోకేష్ వ్యవహారశైలికి సంబంధించి రోజురోజుకూ కొత్త విషయాలు బయటపడుతున్నాయని వ్యాఖ్యానించారు.
తాజావార్తలు
-
Bengaluru Employee: జీతం ఎక్కువైందని రాజీనామా కోరుతున్న బాస్.. ఉద్యోగి పోస్ట్ వైరల్..
-
Arnab Cyclone Effect : అర్నాబ్ బీభత్సం.. అనకాపల్లి తీరంలో భయానక పరిస్థితులు.!
-
Perni Nani: చంద్రబాబు, పవన్, మాధవ్.. మీకు ఎందుకు ఓట్లు వేయాలి? పేర్ని నాని ప్రశ్నల వర్షం
-
Invest Telangana Summit : ఇన్వెస్ట్ తెలంగాణ సదస్సులో క్లైమేట్ ఛేంజ్‌పై ప్రత్యేక చర్చ
-
Karnataka SIR: కర్ణాటకలో SIR పూర్తి.. కోటి మంది పేర్లు తొలగింపు..
ట్రెండింగ్
-
Karwa Chauth 2026 : కర్వా చౌత్ 2026.. తేదీ, పూజా ముహూర్తం ఇదే.!
-
Ayush Badoni: వరుసగా రెండో డబుల్ సెంచరీ.. కోహ్లీ, గంభీర్ సరసన ఆయుష్ బదోని..!
-
IND vs NZ: డారిల్ మిచెల్ విధ్వంసం.. భారత్ ముందు భారీ లక్ష్యం..!
-
Ducati Formula 73 లిమిటెడ్ ఎడిషన్ బైక్ లాంచ్.. అప్పుడే అన్నీ సోల్డ్ ఔట్..!
-
IND vs NZ: హ్యాట్రిక్ విజయమే లక్ష్యంగా బరిలోకి భారత్.. మూడో స్థానంలోనే వైభవ్ సూర్యవంశీకి అవకాశం..!