YouTuber Rama Nandana: ఇబ్రహీంపట్నం పీఎస్‌లో యూట్యూబర్ రమా నందన విచారణ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
YouTuber Rama Nandana: విజయవాడలో సంచలనం రేపిన వీసా చీటింగ్ కేసులో యూట్యూబర్ రమా నందన పోలీసుల విచారణకు హాజరయ్యారు. న్యాయవాదులతో కలిసి ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్‌కు వచ్చిన రమా నందనను పోలీసులు విచారిస్తున్నారు. విదేశాల్లో వీసా, ఉద్యోగం ఇప్పిస్తామంటూ రమా నందన, ఆమె భర్తతో కలిసి 13 లక్షల రూపాయలు వసూలు చేశారంటూ క్రాంతికుమార్ ఇచ్చిన ఫిర్యాదుపై ఇబ్రహీంపట్నం పోలీసులు కేసు నమోదు చేశారు. ఇటీవల యూకే నుంచి హైదరాబాద్ చేరుకున్న రమా నందనకు… కేసు దర్యాప్తులో భాగంగా ఇవాళ విచారణకు హాజరు కావాలంటూ పోలీసులు నోటీసులు జారీ చేశారు. దీంతో పోలీసుల నోటీసుల మేరకు ఆమె ఇవాళ విచారణకు హాజరయ్యారు.
అయితే రమా నందన పోలీస్ స్టేషన్‌కు వచ్చిన తీరు ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. రెండు కార్లలో న్యాయవాదులతో కలిసి ఆమె స్టేషన్‌లోని సీఐ కార్యాలయం వరకు వెళ్లడం… స్టేషన్ గుమ్మం ముందు కారు నిలిపి ఉంచడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అంతేకాదు… స్టేషన్ వద్ద విధులు నిర్వహిస్తున్న జర్నలిస్టులతో రమా నందన తరఫు న్యాయవాదులు వాగ్వాదానికి దిగటం చర్చగా మారింది. యూ ట్యూబర్ రమా నందనకు పోలీసులు రాచ మర్యాదలు చేయటంపై విమర్శలు వస్తున్నాయి. జర్నలిస్టులు అభ్యంతరం వ్యక్తం చేయడంతో పోలీసులు జోక్యం చేసుకుని రెండు కార్లను స్టేషన్ నుంచి బయటకు పంపించారు.
Also Read
- Krishna Delta Water Crisis: 90 శాతం భూముల్లో సాగు కాలేదు.. కృష్ణా డెల్టా పరిస్థితిపై పేర్ని నాని కీలక వ్యాఖ్యలు
- Digital Arrest Scam: డిజిటల్ అరెస్ట్ ఉచ్చులో వృద్ధ దంపతులు.. కృష్ణాజిల్లాలో రూ.1.43 కోట్ల సైబర్ మోసం
- Kodali Nani: గుడివాడలో డీఎస్సీ అక్రమాలపై వైసీపీ సమావేశం.. కొడాలి నాని తీవ్ర ఆరోపణలు
- Vallabhaneni Vamsi vs Yarlagadda Venkatrao: ఎమ్మెల్యే యార్లగడ్డకు వల్లభనేని లీగల్ నోటీసు
తాజావార్తలు
-
Chiranjeevi : నానమ్మ, తాతయ్యల జీన్స్ వచ్చాయి.. జాసన్ సంజయ్‌పై చిరంజీవి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Chiranjeevi : ఫరియా,.. నన్ను తొక్కేయాలని చూస్తున్నావా?
-
ADR Report: 4 ఏళ్లలో పార్టీలు మారిన 111 మంది ఎంపీలు, ఎమ్మెల్యేలు.. ఎక్కువ మంది చేరిన పార్టీ ఏదంటే..
-
PM Modi: భజన క్లబ్బింగ్‌లో మోడీ.. యువతతో కలిసి భక్తి పాటలకు కంజర వాయించిన ప్రధాని
-
OTR: టీడీపీ-వైసీపీ ‘జెంటిల్మెన్ అగ్రిమెంట్’?రామేశ్వరం మెట్టపై హాట్ డిస్కషన్..
ట్రెండింగ్
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?
-
Beerakaya Pachadi: వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని తింటే అమృతమే.. నోరూరించే “బీరకాయ రోటి పచ్చడి” చేసేయండిలా..!
-
IND vs WI: రోహిత్ శర్మ ముందు అరుదైన రికార్డులు.. సెంచరీ చేస్తే సచిన్ సరసన.!
-
Amazon నుంచి Meesho వరకు.. YouTube Shoppingలోకి కొత్త ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్స్!
-
itel ACE 4 Shine: రూ.1,059కే కొత్త ఫీచర్ ఫోన్.. టైప్-C ఛార్జింగ్‌తో పాటు అదిరిపోయే ఫీచర్లు.!