Kodali Nani: రావణ్ వ్యవహారంపై మళ్లీ స్పందించిన కొడాలి నాని.. ఘాటు వ్యాఖ్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kodali Nani: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి కొడాలి నాని మరోసారి రావణ్ వ్యవహారంపై స్పందించారు. రావణ్ అసలు పేరు, మత గుర్తింపును టీడీపీ, అనుకూల మీడియా వక్రీకరించాయని ఆయన ఆరోపించారు. రావణ్‌కు బెయిల్ రావడంలో వైసీపీ పాత్ర లేదని, ఈ అంశంలో తమ పార్టీకి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. రావణ్ అరెస్టు, అనంతర పరిణామాలపై జనసేన, టీడీపీ వ్యవహార శైలిని కొడాలి నాని ప్రశ్నించారు. చిన్న సోషల్ మీడియా పోస్టులకే అరెస్టులు జరుగుతున్నాయని, అయితే రావణ్ విషయంలో భిన్నంగా ఎందుకు వ్యవహరించారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో నిర్ణయాలు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కంటే ఇతరుల ప్రభావంతోనే జరుగుతున్నాయని కూడా ఆయన విమర్శించారు.
మతాల మధ్య విభేదాలు సృష్టించే ప్రయత్నాలు చేయవద్దని కొడాలి నాని సూచించారు. హిందువులు, క్రైస్తవులు సామరస్యంగా జీవిస్తున్నారని, రాజకీయ ప్రయోజనాల కోసం సామాజిక విభేదాలను రెచ్చగొట్టడం తగదని అన్నారు. 2029 ఎన్నికల్లో పరుశురాముడు గొడ్డలితో జగన్, చంద్రబాబు ప్రభుత్వాన్ని, పార్టీని రాజకీయ సమాధి చేస్తామన్న మాటకు కట్టుబడి ఉన్నాను.. చంద్రబాబు ఇచ్చే కట్టెలు కొట్టడానికి కూడా పనికిరాని తుప్పు గొడ్డలి మాకెవరికి అవసరం లేదని ఎద్దేవా చేశారు..
Also Read
- Krishna Delta Water Crisis: 90 శాతం భూముల్లో సాగు కాలేదు.. కృష్ణా డెల్టా పరిస్థితిపై పేర్ని నాని కీలక వ్యాఖ్యలు
- YouTuber Rama Nandana: ఇబ్రహీంపట్నం పీఎస్‌లో యూట్యూబర్ రమా నందన విచారణ..
- Digital Arrest Scam: డిజిటల్ అరెస్ట్ ఉచ్చులో వృద్ధ దంపతులు.. కృష్ణాజిల్లాలో రూ.1.43 కోట్ల సైబర్ మోసం
- Kodali Nani: గుడివాడలో డీఎస్సీ అక్రమాలపై వైసీపీ సమావేశం.. కొడాలి నాని తీవ్ర ఆరోపణలు
అసలు, రావణ్ ను జోసఫ్ గా మార్చింది ఎవరు? అని ప్రశ్నించిన కొడాలి.. కమ్మ వ్యక్తిని దళితుడిగా, క్రిస్టియన్ గా మార్చింది టీడీపీ, ఎల్లో మీడియా, పేటియం బ్యాచ్ అని మండిపడ్డారు.. కుటుంబ సభ్యుల మాటలు కూడా లెక్కచేయకుండా రావణ్ ఐడెంటిటీని మార్చేశారు. రావణ్ పేరు రావణ్… జోసఫ్ కాదు, అతను క్రిస్టియన్ కాదు. రావణ్ అరెస్టు వెంటనే అత్యవసర సమావేశం పెట్టి సెక్షన్లు చదివింది పవన్ కల్యాణ్ కాదా? అని నిలదీశారు.. జనసైనికులు పెట్టిన కేసుల్లో బెయిల్ ఇప్పించింది ఎవరు?… జగన్ గాని, మేం గాని ఎవరికీ ఫోన్ చేసి బెయిల్ ఇప్పించమని చెప్పలేదు. బెయిల్ రావడంలో చంద్రబాబు పాత్ర లేదని ఎవరైనా చెప్పగలరా? అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు కొడాలి నాని.. అయితే, జనసేన హడావుడి ఆగకపోవడంతో ఉప్మా చట్టం పెట్టి రావణ్ ను జైలుకు పంపారు.. రావణ్.. జగన్ ను తిడతాడు, పవన్ ను ఇంకా ఎక్కువ తిడతాడు… కానీ, లోకేష్, బాలకృష్ణ, చంద్రబాబును ఒక్క మాట కూడా అనడు.. గత వీడియోలు పరిశీలిస్తే రావణ్ ఎవరికి అనుకూలమో అర్థమవుతుందని సూచించారు కొడాలి నాని..
తాజావార్తలు
-
Khairatabad Ganapathi Shobha Yatra: అంగరంగ వైభవంగా ఖైరతాబాద్ మహాగణపతి శోభాయాత్ర..!
-
Childhood Trauma: చిన్నతనంలో జరిగిన మానసిక గాయాలు..ఆ తర్వాత డిప్రెషన్, మద్యం వ్యసనానికి దారితీస్తాయా?
-
Mahesh Babu New Look: ఏమున్నాడ్రా బాబు.. సూపర్ స్టార్ న్యూ లుక్ వైరల్!
-
Redmi 17C 5G: రెడ్ మీ 17c 5G భారత్ లో రిలీజ్ డేట్ ఫిక్స్.. 6.9 ఇంచెస్ 120Hz డిస్ప్లే, 6000mAh బ్యాటరీ, 50MP కెమెరా
-
రూ.5.49 లక్షలకే Tata Aeris.. 6 ఎయిర్‌బ్యాగ్స్, అడ్వాన్స్డ్ సెక్యూరిటీ ఫీచర్లతో బెస్ట్ ఫ్యామిలీ కారు విడుదల!
-
Bhumana Karunakar Reddy: తప్పుడు ప్రచారంపై భూమన ఫైర్.. ఇందుకేనా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లకు జీతాలు..?
ట్రెండింగ్
-
IND vs WI: రోహిత్ శర్మ ముందు అరుదైన రికార్డులు.. సెంచరీ చేస్తే సచిన్ సరసన.!
-
Amazon నుంచి Meesho వరకు.. YouTube Shoppingలోకి కొత్త ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్స్!
-
itel ACE 4 Shine: రూ.1,059కే కొత్త ఫీచర్ ఫోన్.. టైప్-C ఛార్జింగ్‌తో పాటు అదిరిపోయే ఫీచర్లు.!
-
LIC Smart Pension Plan: రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రత ఇచ్చే బెస్ట్ స్కీమ్.. జీవితాంతం నెలకు రూ. 25,000 పెన్షన్..!
-
Wall Weeds: గోడలు మొలిచే పిచ్చి మొక్కలతో భవనాలకే ముప్పు.. సింపుల్ చిట్కాలు ఇవే..!