గుండ్లవల్లేరు ఘటనలో నూటికి నూరు శాతం హిడెన్ కెమెరాలు అంశం దాగి ఉందని మహిళా కమిషన్ చైర్‌పర్సన్ గజ్జల వెంకటలక్ష్మి సంచలన వ్యాఖ్యలు చేశారు.. కడప నగరంలోని రోడ్లు భవనాల శాఖ అతిథి గృహంలో విలేకరులతో మాట్లాడిన ఆమె.. రెండు షవర్లను చీకట్లో పోలీసులు ఎత్తుకెళ్లడంపై తమకు అనుమానాలు ఉన్నాయన్నారు.. నిరసన వ్యక్తం చేస్తున్న విద్యార్థులను కళాశాల ప్రిన్సిపాల్ బెదిరించడం.. తెల్లారేసరికి పరిస్థితులు మారుతాయి అనడం.. అనుమానాలకు తావిస్తున్నాయని ఆమె పేర్కొన్నారు.
కృష్ణా జిల్లా గుడివాడలోని గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కళాశాల వ్యవహారం సీఈఆర్‌టీ సేవలను ఉపయోగించి విచారణ చేసి.. కొంత క్లారిటీకి వచ్చారు.. పోలీసు బృందాల దర్యాప్తు అప్డేట్స్ పై ఏలూరు రేంజ్ ఐజీ అశోక్ కుమార్ మీడియా సమావేశం నిర్వహించారు.. కళాశాలలో పోలీసులు నేరుగా చేసిన దర్యాప్తులో ఎటువంటి స్పై కెమెరాలు గుర్తించలేదని ఆయన స్పష్టం చేశారు.. క్రిమినల్ కేసుల్లో ఏపీలో తొలిసారిగా ఢిల్లీకి చెందిన కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ (CERT) సేవలు వినియోగించాం. విద్యార్థులు, తల్లిదండ్రులు,…
వైసీపీలో ఇమడలేక చాలా మంది మా వైపు వస్తామంటున్నారని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. అందరినీ కాకుండా మంచి వ్యక్తిత్వం ఉన్నవారినే చూసి తీసుకుంటామని మీడియా చిట్‌చాట్‌లో ఆయన తెలిపారు. పార్టీకి, నేతలకు, కార్యకర్తలకు ఇబ్బంది లేకుండానే చేరికలు ఉంటాయన్నారు.
కృష్ణా జిల్లా గడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజ్‌లో రహస్య కెమెరాలు పెట్టారనే అంశంపై జరుగుతున్న విచారణను సీఎం చంద్రబాబు నాయుడు స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. ఉదయం ఘటన విషయం తెలిసిన వెంటనే జిల్లా అధికారులను, మంత్రి కొల్లు రవీంద్రను, జిల్లా ఎమ్మెల్యేలను కళాశాలకు వెళ్లాలని ఆదేశించిన ముఖ్యమంత్రి.. ఉదయం నుంచి అక్కడ జరుగుతున్న పరిణామాలను ఎప్పటికప్పుడు తెలుసుకున్నారు.
SPY Camera in Engineering College womens Washrooms: సమాజంలో జరుగుతున్న కొన్ని పరిణామాలను చూస్తుంటే నిజంగా పరిస్థితి మహిళల భద్రత ప్రశ్నార్థకంగా మారిందని భావించకుండా ఉండలేకపోతున్నాము. ఎక్కడో ఒకచోట మహిళలపై దాడులు జరుగుతూనే ఉన్నాయి. భూమ్మీద గౌరవంగా జీవించడానికి వీలులేని పరిస్థితులు ఉన్నాయి. తాజాగా కోల్‌కతాలో ఓ మహిళా డాక్టర్‌పై జరిగిన దారుణ ఘటనతో యావత్ దేశం ఉలిక్కిపడిన సంగతి తెలిసిందే. దీంతో దేశం మొత్తం షాక్‌కు గురైంది. నిందితులను ఉరి తీయాలని డిమాండ్ చేశారు.…
ప్రపంచాన్ని మార్చే అత్యంత శక్తివంతమైన ఆయుధం విద్య అని ఏపీ గవర్నర్ జస్టిస్ ఎస్.అబ్దుల్ నజీర్ అన్నారు. కృష్ణా జిల్లాలోని గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కళాశాల సిల్వర్ జూబ్లీ వేడుకల్లో పాల్గొన్న ఏపీ గవర్నర్.. జ్యోతి ప్రజ్వలన చేసి సిల్వర్ జూబ్లీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ రాజాబాబు, కళాశాల డైరెక్టర్లు పాల్గొన్నారు.