కొడాలి నాని ఆధ్వర్యంలో విష సంస్కృతి తీసుకు వచ్చారని టీడీపీ నేత వర్ల రామయ్య అన్నారు. కొడాలి నానిపై వర్ల రామయ్య తీవ్రంగా విమర్శలు చేశారు. ఈ సందర్భంగా రామయ్య మాట్లాడుతూ.. నీ కళ్యాణ మండపంలో ఏం జరిగిందో నువ్వే పోలీసులకు చెప్పాలన్నారు. కొడాలి నాని నీచుడు, నికృష్టుడు, దృష్టుడు, పనికి రాని వాడు దద్దమ్మ, యూజ్ లెస్ ఫెలో అంటూ వర్ల రామయ్య తిట్ల పురాణం అందుకున్నారు. మేము నిజనిర్ధారణ బృందం వెళ్లితే గుడివాడలో వైసీపీ కంట్రోల్ చేయలేరా అంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
Read also: జగన్ ప్రభుత్వం ఎవరికీ చుట్టం కాదు: పేర్ని నాని
డీజీపీ పనికి మాలిన వాడన్నారు. గుడివాడ పోలీసులు గుండె మీద చేయ్యి వేసుకొని చెప్పండి.. క్యాసినో జరగలేదా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. బోండా ఉమ కారుపై దాడి చేస్తుంటే పోలీసులు ప్రేక్షక పాత్ర వహించారన్నారు. మాకు అనుమతి ఇవ్వకుండా.. వైసీపీ నేతలకు అనుమతి ఇస్తారా అంటూ ప్రభుత్వాన్ని నిలదీశారు వర్లరామయ్య. పోలీసులు తమాషా చేస్తున్నారు. కొడాలి నాని వంటి పనికి మాలిన మంత్రి మీ పక్కన ఉంటే ముఖ్యమంత్రికి సిగ్గు అనిపించడం లేదా అని మండిపడ్డారు. రేపు ఉదయం ఏలూరు వెళ్తాం. ఈ రోజు జరిగిన పరిణామాలపై ఏలూరు డీఐజీని కలిసి ఫిర్యాదు చేస్తామని పేర్కొన్నారు.