Kodali Nani Fires On Chandrababu Over Polavaram Project: టీడీపీ అధినేత చంద్రబాబుపై మాజీ మంత్రి కొడాలి నాని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కృష్ణాజిల్లా గుడివాడలో ఆయన మాట్లాడుతూ.. ప్రాజెక్టుల పరిశీలన పేరుతో చంద్రబాబు విచిత్ర విన్యాసాలు చేస్తున్నాడని ఎద్దేవా చేశారు. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఎక్కువ కాలం ఏపీలో అధికారంలో ఉన్నది కాంగ్రెస్, టీడీపీ పార్టీలేనని అన్నారు. కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యేగా, మంత్రిగా కాంగ్రెస్ నేతల బూట్లు నాకిన వెధవ చంద్రబాబు అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఎన్టీఆర్ కాళ్లు పట్టుకుని టీడీపీలో చేరిన దౌర్భాగ్యుడని తూర్పారపట్టారు. 1978 నుంచి 40 ఏళ్ల ఏపీ రాజకీయాల్లో చంద్రబాబు కీలకంగా ఉన్నాడని.. అయినా ఇన్నేళ్లలో ప్రాజెక్టులు ఎందుకు కట్టలేకపోయాడని ప్రశ్నించారు.
Nadendla Manohar: వాలంటీర్ వ్యవస్థ వల్ల పర్సనల్ డేటా పక్కదారి పడుతోంది
పులిచింతల, గాలేరు-నగరి, తెలుగు గంగ, వెలుగొండను ఎందుకు పూర్తి చేయలేదని అడిగారు. పోలవరానికి 100 కోట్ల రూపాయల పనులు ఎందుకు చేయలేకపోయాడని నిలదీశారు. పోలవరానికి జాతీయ హోదా తెచ్చిన ఘనత వైఎస్సార్‌ది అని గుర్తు చేశారు. పోలవరం కాలువలు తవ్వుతుంటే.. దేవినేని ఉమా వంటి బ్రోకర్లతో కోర్టుల్లో కేసులు వేయించిన వ్యక్తి చంద్రబాబు అని కొడాలి నాని ధ్వజమెత్తారు. కేంద్రం కట్టాల్సిన జాతీయ ప్రాజెక్టును చంద్రబాబు ఎందుకు తీసుకున్నాడని అడిగారు. పోలవరాన్ని చంద్రబాబు ఏటీఎంలా వాడుకున్నాడని మోదీనే చెప్పారని గుర్తు చేశారు. అధికారంలో ఉన్నప్పుడు లుచ్చా పనులు చేసి, అధికారం ఇస్తే ఇప్పుడు ప్రాజెక్టులు పూర్తి చేస్తానని మాయమాటలు చెప్తున్నాడని ఫైర్ అయ్యారు. అధికారంలో ఉన్నప్పుడు ఒక్క పని కూడా చేయని 420 చంద్రబాబు అని పేర్కొన్నారు. చంద్రబాబు వేసే మెతుకుల కోసం ఆశపడే కుక్కలు రామోజీరావు, ఏబీఎన్ రాధాకృష్ణ, బీఆర్ నాయుడని విరుకుపడ్డారు.
Actress Sindhu Dies: ఆస్పత్రి ఖర్చులకు డబ్బులేక.. ప్రాణాలు విడిచిన నటి!
పది కిలోమీటర్లు నడిచి జారుడుబల్లలా పప్పు లోకేష్ జారిపోతున్నాడని కొడాలి నాని ఎద్దేవా చేశారు. చంద్రబాబు ఐదేళ్లలో గ్రాఫిక్స్‌లో పోలవరం కట్టాడని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. బీజేపీతో పొత్తు పెట్టుకున్న చంద్రబాబు.. 55వేల కోట్లు ఎందుకు తీసుకురాలేకపోయాడని అడిగారు. పోలవరం ప్రాజెక్టు ఎందుకు కట్టలేదని జగన్‌ని ప్రశ్నిస్తున్న వారు.. గతంలో ఎందుకు పూర్తిచేయలేకపోయారని ప్రశ్నించారు. చంద్రబాబు చెప్పేవన్నీ సొల్లు కబుర్లే.. లెగిస్తే మనిషిని కాదనే చెప్పే ఆయన పీకేదేమీ లేదని సెటైర్లు వేశారు. ముఖ్యమంత్రి, మా ప్రభుత్వంపై పిచ్చి వాడుగు మానకపోతే.. తగిన మూల్యం చెల్లించుకుంటావని హెచ్చరించారు. కుప్పంలో చంద్రబాబు గెలిచేది లేదని జోస్యం చెప్పారు. 2024 ఎన్నికలే చంద్రబాబుకు చివరి ఎన్నికలు అవుతాయని ధీమా వ్యక్తం చేశారు.