Kottu Satyanarayana: పవన్‌కి సబ్జెక్ట్ లేదు.. దమ్ముంటే చర్చకి రమ్మని మంత్రి ఓపెన్ ఛాలెంజ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kottu Satyanarayana Fires On Pawan Kalyan: జనసేనాధినేత పవన్ కళ్యాణ్‌పై మంత్రి కొట్టు సత్యనారాయణ తీవ్రస్థాయిలో విరుచుకపడ్డారు. పవన్ దగ్గర సబ్జెక్ట్ లేదని విమర్శించిన ఆయన.. దమ్ముంటే చర్చకు రమ్మని ఓపెన్ ఛాలెంజ్ చేశారు. నిన్న పవన్ నిర్వహించిన బీసీ రౌండ్ టేబుల్ సమావేశం ఒక రాజకీయ కుట్ర అని ఆరోపించారు. పవన్ పిచ్చి ఆలోచనలు చేసి, కాలేజీ విద్యార్థుల జీవితాలతో ఆడుకోవద్దని హితవు పలికారు. దత్తతండ్రి చంద్రబాబు ఏది రాసిస్తే.. అది ప్రజల వద్ద వచ్చి చదివే దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ అని దుయ్యబట్టారు. పవన్ కళ్యాణ్ కాపులతో తిరుగుతూ.. వారినే తిడతారని, అసలు ఆయన ఎందుకు తిడతాడో అర్థం కాదని అన్నారు. కేంద్ర, రాష్ట్ర, దేవాలయ సహకారంతో ఆలయాన్ని అభివృద్ధి చేసేందుకు ద్రోణ చర్య అనే కంపెనీతో ప్రణాళిక రూపొందించామని మంత్రి స్పష్టం చేశారు. రాబోవు 50 సంవత్సరాల వరకు క్షేత్రానికి వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా.. వసతి, దర్శనం ఏర్పాట్లకు మాస్టర్ ప్లాన్ వేశామని చెప్పుకొచ్చారు.
Harirama Jogaiah: జగన్ పోవాలి, పవన్ రావాలి.. ఇదే కాపు సంక్షేమ సేన లక్ష్యం
Also Read
- CM Chandrababu: ఫిర్యాదుల స్వీకరణ నుంచి పరిష్కారం వరకు పర్యవేక్షణ.. అధికారులకు సీఎం దిశానిర్దేశం
- EV Car Fire Accident: విజయవాడ వెస్ట్ బైపాస్‌పై ఘోర రోడ్డు ప్రమాదం.. ఈవీ కారు దగ్ధం, నలుగురు సజీవదహనం..
- AP Local Body Elections 2026: రేపో, ఎల్లుండో ఎన్నికల నోటిఫికేషన్.. అచ్చెన్నాయుడు కీలక వ్యాఖ్యలు
- AP Municipality Reservations 2026: మున్సిపల్ ఎన్నికలకు కీలక అప్‌డేట్.. 106 పట్టణాలకు రిజర్వేషన్లు ఖరారు.. పూర్తి జాబితా ఇదే!
అంతకుముందు.. రాష్ట్రంలో జగన్‌మోహన్‌రెడ్డి నాయకత్వంలో ప్రజలు మెచ్చేలా రామరాజ్యం మాదిరి సంక్షేమ పాలన కొనసాగుతుందని కొట్టు సత్యనారాయణ చెప్పారు. కానీ.. చంద్రబాబు హయాంలో రాష్ట్రం కరువు పరిస్థితులు ఎదుర్కుందన్నారు. పేద ప్రజలకు మంచి చేయాలన్న జగన్ సంకల్పం గొప్పదని, అందుకే భగవంతుడు ముందుకు నడిపిస్తున్నారని అన్నారు. రాష్ట్రంలో ఆలయం లేని ఊరు ఉండకూడదని.. సీఎం జగన్ పెద్ద ఎత్తున ఆలయాల నిర్మాణం చేపడుతున్నారని తెలిపారు. జగన్ సీఎం అయ్యాక కొత్తగా రూ. 3,500 ఆదాయం లేని ఆలయాలకు.. కొత్తగా ధూప దీప నైవేద్య పథకంలో ఆర్థిక తోడ్పాటు అందజేసేందుకు అనుమతి ఇచ్చారన్నారు. దేవుడి భూములను ఆక్రమించుకున్న వారి ఆట కట్టించేందుకు.. దేవదాయ శాఖ చట్టానికి కొత్తగా సవరణలు తీసుకొచ్చామన్నారు.
Rajinikanth: రాజకీయాల నుంచి అందుకే తప్పుకున్నా.. రజినీకాంత్ క్లారిటీ
తాజావార్తలు
-
SIRపై సుప్రీంకోర్టు ఏం తేల్చనుంది? పిటిషన్‌లోని ముఖ్యమైన అభ్యంతరాలు ఇవే
-
ACB Raids : రూ.20 లక్షల లంచం.. ఏసీబీకి చిక్కిన తహసీల్దార్, సర్వేయర్.!
-
Chairman’s Desk: ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం ఎందుకు కీలకం..? అసలు యువత ఏం ఆశిస్తోంది..?
-
Off The Record: పోగొట్టుకున్న చోటే వెతుకులాట.. సింగరేణిపై గులాబీ గురి
-
Off The Record: గవర్నర్ కోటా MLCలపై కాంగ్రెస్ కసరత్తు… ఆ సీట్లు దక్కేదెవరికి..?
ట్రెండింగ్
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?