అనంతపురం జిల్లా తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి జేసీ సోదరులపై విమర్శలు గుప్పించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తాడిపత్రిని అభివృద్ధి చేస్తూ ఉంటే జేసీ ప్రభాకర్ రెడ్డి ఓర్వలేడని ఆయన ఆరోపించారు. అంతేకాకుండా జేసీ సోదరులు 35 సంవత్సరాలు అధికారంలో ఉన్న అభివృద్ధి చేసింది ఏమీ లేదని ఆయన మండిపడ్డారు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత తాడిపత్రికి ఎక్కువ నిధులు కేటాయించారని, అభివృద్ధి పనులు వేగంగా చేస్తున్నామన్నారు. అభివృద్ధి జరుగుతున్నా ప్రభుత్వానికి వ్యతిరేకంగా జేసీ ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటాడని ఆయన విమర్శించారు. గ్రామాలలో ప్రశాంత వాతావరణాన్ని చెడగొట్టి కక్షలు రేపు తున్నారని ఆయన అగ్రహం వ్యక్తం చేశారు. తాడిపత్రి పట్టణంలో అక్రమంగా నిర్మించిన కట్టడాల జాబితా తయారు చేస్తే జేసీ ప్రభాకర్ రెడ్డితో పాటు వెళ్లి కూల్చడానికి సిద్ధంగా ఉన్నామరి ఆయన స్పష్టం చేశారు.