అనంతపురం జిల్లా తాడిపత్రి నియోజకవర్గం పెద్దవడుగూరు మండలం కాసేపల్లిలో ప్రజా సంక్షేమ యాత్ర భాగంగా తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి పాదయాత్ర చేపట్టారు. ప్రజా సంక్షేమం కోసం తాడిపత్రి నియోజకవర్గం లోని పెద్దవడుగూరు మండలంలో అన్ని గ్రామాలలో 11 రోజుల పాటు ఎమ్మెల్యే పెద్దారెడ్డి పాదయాత్ర చేపట్టారు ఇందులో భాగంగా మొదటి రోజు కాసేపల్లి, గుత్తి అనంతపురం కొత్తపల్లివిరుపాపురం, ఆవులంపల్లె వరకు పాదయాత్ర సాగింది .ఆయన పాదయాత్రలో వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు .ఆయా గ్రామాలలో ఎమ్మెల్యే పెద్దారెడ్డికి ఘన స్వాగతం లభించింది. ఆయనకు పూలు చల్లుతూ మహిళలు హారతులు ఇచ్చారు. పాదయాత్రలో ప్రజల వద్ద నుంచి సమస్యలు తెలుసుకుని అర్జీలు స్వీకరించారు.
Read Also: Boyfriend Crime: మరో వ్యక్తితో పెళ్లి.. గొంతు కోసిన ప్రియుడు
అనంతరం ఎమ్మెల్యే పెద్దారెడ్డి మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నవరత్నాలతో పాటు అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తుందన్నారు. గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా ఇప్పటికే అన్ని గ్రామాల్లో పర్యటించడం జరిగిందన్నారు. ఇంకా ఏమైనా సమస్యలు ఉన్నాయేమో తెలుసుకోవాలని వారికి మరింత సేవ చేయాలన్న ఉద్దేశంతో ఈ ప్రజా సంక్షేమ యాత్రను చేపట్టడం జరిగిందన్నారు. పెద్దవడుగూరు మండలంలో 11 రోజులపాటు అన్ని గ్రామాలలో పాదయాత్ర తర్వాత యాడికి మండలంలో పాదయాత్ర కొనసాగుతుందన్నారు. పాదయాత్ర చేయడం అంటే ప్రజల సమస్యలు తెలుసుకోవడానికి, మేము చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలను వివరించడమే నా పాదయాత్ర ముఖ్య కారణం. గత ఎన్నికలలో పెద్దవడుగూరు మండలం మా పార్టీకి అత్యధిక మెజార్టీ వచ్చింది. వచ్చే ఎన్నికలలో పెద్ద వడుగురు మండలంలో భారీ మెజార్టీతో గెలవబోతున్నాం.
వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న సంక్షేమ పథకాల కుల మతాలకు అతీతంగా అందరు లబ్ధి పొందుతున్నారని పేర్కొన్నారు. భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలు చేపట్టి ప్రజలకు సంక్షేమ పథకాలు అందజేస్తామని ఆయన తెలియజేశారు. ప్రతిపక్షంలో ఉంటేనే పాదయాత్ర చేస్తావన్నమాట కు సమాధానం ఇస్తూ అధికారంలో ఉంటే పాదయాత్ర చేయకూడదా అని సమాధానం ఇచ్చారు. ప్రజలకు మరింత చేరువ కావాలన్న ఉద్దేశంతోనే వారి సమస్యలు తెలుసుకుని పరిష్కరించేందుకు ఈ పాదయాత్ర నిర్వహిస్తున్నట్లు ఆయన తెలియజేశారు.