Operation Raavan: పీరియడ్ యాక్షన్ థ్రిల్లర్ ‘పలాస 1978’ తో చక్కని విజయాన్ని అందుకోవడమే కాకుండా చిత్ర ప్రముఖుల, విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు రక్షిత్ అట్లూరి. అతను హీరోగా న్యూ ఏజ్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ ‘ఆపరేషన్ రావణ్’ తెరకెక్కుతోంది. ఇందులో సంకీర్తన విపిన్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ మూవీతో వెంకట సత్య దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. ‘నీ ఆలోచనలే నీ శత్రువులు’ అనే కాప్షన్ తో రక్షిత్ ఉన్న ఫస్ట్ లుక్ పోస్టర్ ని గురువారం మేఘ అండ్ ఒమేగా విద్యా సంస్థల వైస్ చైర్ పర్సన్ మాలతి రెడ్డి లాంచ్ చేశారు. షూటింగ్ పార్ట్ పూర్తి చేసుకుని, ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ఈ సినిమా ధ్యాన్ అట్లూరి నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో సీనియర్ నటి రాధికా శరత్ కుమార్, చరణ్ రాజ్, విద్యా సాగర్, కాంచి, రాకెట్ రాఘవ, రఘు కుంచె, కె.ఎ. పాల్ రాము, కార్తీక్ ఇతర ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.