Karanam Balaram: మంత్రి కల నెరవేరేనా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాజకీయాల్లో 40ఏళ్లకు పైగా ఉన్న సీనియర్ నేత. ఆయనతో రాజకీయ ప్రస్ధానం మొదలు పెట్టిన నాయకులు సీఎంలై.. మంత్రులై చక్రం తిప్పారు. ఆయనకు మాత్రం మంత్రి పదవి అందని ద్రాక్షగా మారింది. ఆయన గెలిస్తే పార్టీ అధికారంలోకి రాదు.. పార్టీ అధికారంలోకి వస్తే ఆయన గెలవరు. ప్రస్తుతం పార్టీ మారి అధికారపార్టీ పంచన చేరారు. ఈసారైనా మంత్రి పదవి వరిస్తుందా? అసలు ఆయన అలాంటి ఆశలు పెట్టుకున్నారా?
ఇంత వరకు మంత్రి కాని కరణం బలరాం
కరణం బలరాం. ఏపీ రాజకీయాల్లో పరిచయం చేయాల్సిన అవసరం లేని పేరు. నాలుగుసార్లు ఎమ్మెల్యేగా.. ఒకసారి ఎంపీగా గెలిచారు. ఆయన గెలిస్తే ఆ పార్టీ అధికారంలో ఉండదు. ఆయన ఉన్న పార్టీ అధికారంలో ఉంటే ఆయన గెలవరు. దీంతో మంత్రి పదవి రాకుండా పోయింది. ఓడిన నేతలకు ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రులను చేసిన చంద్రబాబు.. బలరామ్‌కు ఎమ్మెల్సీ ఇచ్చారు కానీ మంత్రిని చేయలేదు.
Also Read
- CM Chandrababu: నియోజకవర్గాల స్థాయిలో విజన్ ప్లాన్లు.. అధికారులకు సీఎం దిశానిర్దేశం
- AP Cabinet Meeting: నేడు ఏపీ కేబినెట్ అత్యవసర భేటీ.. స్థానిక ఎన్నికలపై ఫోకస్, బీసీ రిజర్వేషన్లపై కీలక నిర్ణయం..
- AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ అత్యవసర సమావేశం.. వాటిపైనే కీలక చర్చ..
- CM Chandrababu: లక్ష్యాలు చేరకపోతే కలెక్టర్లు, మంత్రులదే బాధ్యత.. సీఎం చంద్రబాబు సీరియస్ వార్నింగ్
ఒంగోలులో ఇందిరాగాంధీకి రక్షణగా నిలబడ్డ బలరాం
వైఎస్.. చంద్రబాబు వంటి సీనియర్ నేతలతోపాటుగా రాజకీయ ప్రస్ధానాన్ని మొదలు పెట్టినా బలరాం ఇప్పటి వరకూ ఒక్కసారి కూడా మంత్రి పదవి చేపట్టలేదు. యూత్ కాంగ్రెస్ నాయకుడిగా రాజకీయ అరంగ్రేటం చేసిన కరణం.. 1977లో ఎన్నికల ప్రచారానికి ఒంగోలు వచ్చిన ఇందిరాగాంధీ మీద రెడ్డి కాంగ్రెస్ నేతల దాడి చేయబోతే.. ఆమెకు రక్షణగా నిలబడి దేశవ్యాప్తంగా అప్పుడు పాపులర్ అయ్యారు. 1978లో కాంగ్రెస్ ఐ తరఫున అద్దంకిలో పార్టీ అభ్యర్థిగా బలరాం పేరును స్వయంగా ఇందిరాగాంధీ సిఫారసు చేశారు. ఆ ఎన్నికలలో గెలిచి తొలిసారి శాసనసభలో అడుగు పెట్టారు బలరాం. ఆ తర్వాత టీడీపీలో చేరారు.
2019లో ఎమ్మెల్యేగా గెలిచాక.. వైసీపీకి జైకొట్టిన బలరాం
బలరాం స్వగ్రామం చీరాలకు దగ్గరగా ఉండే తిమ్మసముద్రం అయినప్పటికీ రాజకీయ ప్రస్ధానం మొత్తం అద్దంకి, మార్టూరు నియోజకవర్గాలతో ముడిపడి ఉంది. 2019 ఎన్నికల నాటికి టీడీపీలో ఉన్న ఆమంచి కృష్ణమోహన్ వైసీపీలో చేరటంతో.. కరణంను చీరాల అభ్యర్థిగా బరిలో దించింది తెలుగుదేశం పార్టీ. చీరాలలో 18వేల మెజారిటీతో గెలిచారు బలరాం. అయితే ఆయన గెలిచి.. టీడీపీ అధికారంలోకి రాకపోవడంతో ప్రతిపక్షపార్టీ ఎమ్మెల్యేగా ఉండిపోవాల్సి వచ్చింది. ఆమంచి ఓడినప్పటికీ ఇంచార్జ్ హోదాలో ఎమ్మెల్యే అధికారాన్ని చెలాయిస్తూ నియోజకవర్గంలో పనులు చేసుకుంటూ పోయారు. దీంతో కరణం.. ఆమంచి మధ్య హోరాహోరీగా కార్యక్రమాలు నడిచాయి. చివరకు కుమారుడు వెంకటేష్ రాజకీయ భవిష్యత్ గురించి ఆలోచించారో ఏమో సీఎం జగన్‌కు జైకొట్టారు బలరాం.
ఇప్పుడైనా కేబినెట్‌లో చోటు దక్కుతుందా?
వైసీపీలో చేరినా తమ నేతకు సరైన గుర్తింపు లేదన్నది బలరాం వర్గీయుల టాక్. కరణం వెంకటేష్‌కు ఏదైనా కార్పొరేషన్ ఛైర్మన్ పదవి ఇస్తారని భావించినా సాధ్యం కాలేదు. కేవలం ఆమంచి స్పీడ్‌కు బ్రేకులు వేయడం మినహా.. వైసీపీలోకి వెళ్లడం వల్ల కలిగిన ప్రయోజనం ఏదీ లేదన్నది అనుచరుల ఆవేదన. ప్రస్తుతం కేబినెట్‌లో మార్పులు చేర్పులకు సమయం దగ్గరపడటంతో కరణం బలరాం చర్చల్లోకి వచ్చారు. కొత్తగా ఏర్పడే బాపట్ల జిల్లాలోకి చీరాల వెళ్తుండటంతో ఆయనకు కలిసొస్తుందని అనుచరులు లెక్కలు వేస్తున్నారు.
వైసీపీ బలోపేతం కోసం మంత్రిని చేస్తారని లెక్కలు
బాపట్ల పార్లమెంట్ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో టీడీపీ బలంగా ఉంది. అక్కడ వైసీపీని బలోపేతం చేయాలంటే సామాజికవర్గం పరంగా కూడా గట్టి నేత ఆపార్టీకి కావాలనేది బలరాం అనుచరుల లెక్క. కరణం బలరామ్‌ను కేబినెట్‌లోకి తీసుకుంటే వైసీపీ బలోపేతం కావడంతోపాటు ఆయన సామాజికవర్గానికి కూడా ప్రాధాన్యం కల్పించినట్టు అవుతుందని అంచనా వేస్తున్నారట.
బలరాం మంత్రి ఆశ నెరవేరుతుందా?
మాజీ ఎమ్మెల్యే ఆమంచి సీటు విషయంలో క్లారిటీ రావాల్సి ఉంది. పార్టీని బలోపేతం చేసేందుకు బలరాం, ఆయన కుమారుడు వెంకటేష్‌ను పర్చూరు, అద్దంకి పంపుతారనే ప్రచారం జరుగుతోంది. అప్పుడు ఆమంచికి లైన్ క్లియర్ అయినట్టే. వచ్చే ఎన్నికల్లో కరణం కుమారుడు వెంకటేశే బరిలో నిలిచే అవకాశాలు ఉండటంతో బలరాం మంత్రి పదవి ఆశలు నెరవేరుతాయా? ఆయన కోరిక తీరుతుందా? సీఎం జగన్ బలరామ్ గురించి ఏం ఆలోచిస్తున్నారో చూడాలి.
తాజావార్తలు
-
West Indies History: టీ20ల్లో వెస్టిండీస్ నయా చరిత్ర.. అత్యంత విజయవంతమైన ఛేజింగ్ లిస్ట్ ఇదే!
-
Yash-Hanuma Reddy: ఏంటి మావా ఇది.. టాలీవుడ్ కొత్త దర్శకుడితో రాకీ భాయ్ పాన్-ఇండియా మూవీ?
-
Rahul Gandhi and PM Modi: నేడు రాహుల్.. రేపు మోడీ.. చెన్నైలో వరుస కీలక కార్యక్రమాలు
-
AB de Villiers: 42 ఏళ్ల వయసులోనూ తగ్గని జోరు.. 37 బంతుల్లో ఏబీ డివిలియర్స్ విధ్వంసకర సెంచరీ..!
-
How to Get Rid of Lizards at Home: ఇంట్లో బల్లులు ఎక్కువగా ఉన్నాయా? ఈ సింపుల్ చిట్కాలతో తరిమేయండి!
ట్రెండింగ్
-
50MP కెమెరా, 32MP సెల్ఫీ షూటర్, 10,200mAh బ్యాటరీతో Vivo Y600s Pro లాంచ్.!
-
200MP పెరిస్కోప్ కెమెరా, 7 ఏళ్ల సాఫ్ట్వేర్ అప్డేట్స్ తో రాబోతున్న Motorola Signature 27..!
-
Panama Earthquake: 7.7 తీవ్రతతో భారీ భూకంపం.. ఊగిపోయిన భవంతులు.!
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!