Kanna Lakshminarayana to Join TDP: బీజేపీకి గుబ్‌బై చెప్పిన కన్నా లక్ష్మీనారాయణ.. ఇప్పుడు ఏ పార్టీలో చేరతారు? అనే చర్చ హాట్ టాపిక్‌గా మారిపోయింది.. గతంలో కన్నా నివాసానికి వచ్చి మరీ జనసేన నేత నాదెండ్ల మనోహర్ కలిసి వెళ్లారు.. బీజేపీ రాష్ట్ర అధినాయకత్వంపై హాట్‌కామెంట్లు చేసిన తరుణంలోనే ఈ ఇద్దరు నేతల భేటీ జరగడంతో.. కన్నా.. పవన్ కల్యాణ్ పార్టీ గూటికి చేరతారా? బీజేపీ బైబై చెప్పేస్తారా? అనే చర్చ సాగింది.. అయితే, ఆ భేటీకి రాజకీయ ప్రాధాన్యత లేదని ఇద్దరు నేతలు ప్రకటించారు. తాజా సమాచారం ప్రకారం.. కన్నా లక్ష్మీనారయణ చూపు జనసేన వైపు కాదు.. తెలుగుదేశం పార్టీ వైపు ఉందని ప్రచారం సాగుతోంది.. తన రాజీనామా లేఖను బీజేపీ జాతీయ అధ్యక్షుడికి పంపిన కన్నా.. టీడీపీలో చేరతారనే ప్రచారం జోరందుకుంది.. ఈ నెల 23 లేదా 24వ తేదీన కన్నా లక్ష్మీనారాయణ.. టీడీపీలో చేరే అవకాశం ఉందని ప్రచారం సాగుతోంది.. 10 రోజుల క్రితం కన్నాతో హైదరాబాద్‌లో టీడీపీ పెద్దలు సమావేశం అయ్యారట.. సముచిత గౌరవం ఇస్తామని కన్నాను పార్టీలోకి ఆహ్వానించారట టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.. అయితే, టీడీపీలో చేరికపై రెండు రోజుల్లో కన్నా నిర్ణయం ప్రకటించే అవకాశం ఉందని చెబుతున్నారు..
Read Also: Kanna vs GVL: కన్నా ఆరోపణలు.. జీవీఎల్ కౌంటర్
మరోవైపు, కన్నా పార్టీని వీడినా.. కాపుల్లో నష్టం జరగకుండా.. ముందస్తుగానే చర్యలు చేపట్టింది బీజేపీ.. అందులో భాగంగానే కాపునేత వంగవీటి రంగాను జీవీఎల్ తెరపైకి తెచ్చారని.. ఓ వైపు కాపు రిజర్వేషన్లు, మరోవైపు గన్నవరం ఎయిర్పోర్ట్, ఏదో ఒక జిల్లాకు రంగా పేరు పెట్టాలనే డిమాండ్ కూడా వినిపిస్తున్నారని విశ్లేషకులు చెబుతున్నమాట.. అయితే, కన్నా అనుచరుల మాత్రం.. ఇంకా ఏ పార్టీలోకి వెళ్లాలనే విషయంపై నిర్ణయం తీసుకోలేదు.. ఇతర పార్టీల నేతలు.. కన్నాతో టచ్‌లోకి వచ్చిన మాట వాస్తమే.. చాలా మంది కన్నాను ఆహ్వానిస్తారు.. ఎందుకంటే కన్నా సీనియర్ నేత.. ఆయన రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేయగలరు.. కానీ, అనుచరుల అభిప్రాయాన్ని తీసుకున్న తర్వాతే పార్టీ మార్పుపై తుది నిర్ణయం తీసుకుంటారని.. రెండు రోజుల్లో ఏ పార్టీలో చేరేది క్లారిటీ వస్తుందని చెబుతున్నారు. ఇక, టీడీపీ, జనసేన పొత్తు కోసం కూడా ప్రయత్నాలు సాగుతున్నాయి.. ఈ తరుణంలో.. కన్నా.. ఏ పార్టీలో చేరినా.. వారికి లబ్ధి చేకూరుతుందని అంచనాలు కూడా ఉన్నాయి. మరి, కన్నా తుది నిర్ణయం ఎలా ఉంటుందో వేచిచూడాలి.