Kanna vs GVL: బీజేపీకి ఏపీ బీజేపీ మాజీ చీఫ్ కన్నా లక్ష్మీనారాయణ రాజీనామా చేశారు.. తన రాజీనామా లేఖను బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు పంపించారు.. ఇదే సమయంలో.. రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు, ఎంపీ జీవీఎల్ నరసింహారావుపై విమర్శలు గుప్పించారు.. ముఖ్యంగా.. పార్టీలో సముచిత స్థానం లేదు, గౌరవం లేదు.. సొంత సంస్థల పార్టీ నడుపుతున్నారంటూ ఫైర్ అయ్యారు.. అయితే, కన్నా వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు జీవీఎల్.. కన్నాకు బీజేపీ సముచిత గౌరవం ఇచ్చిందన్న ఆయన.. ఏపీ అధ్యక్షుడిగా.. జాతీయ కార్యవర్గ సభ్యుడిగా పదవులు ఇచ్చిందని గుర్తుచేశారు.. కానీ, రాజకీయ దురుద్దేశ్యంతోనే కన్నా ఆరోపణలు చేస్తున్నారు.. అందుకే రాజీనామా ప్రకటన చేశారని విమర్శించారు.. గతంలోనూ.. ఇప్పుడూ సోము వీర్రాజుపై కన్నా చేసిన వ్యాఖ్యలు సముచితం కాదని స్పష్టం చేసిన జీవీఎల్.. కేంద్ర పార్టీ అనుమతితోనే సోము వీర్రాజు నిర్ణయాలు తీసుకున్నారని తెలిపారు.. సోము వీర్రాజు ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకోలేదని తేల్చిచెప్పారు.. ఇదే సమయంలో.. నాపై కన్నా చేసిన వ్యాఖ్యలపై స్పందించనంటూ.. స్పష్టం చేశారు. ఇక, బయట పార్టీ నుంచి వచ్చిన వారికి అధ్యక్షునిగా బాధ్యతలు అప్పగించిన పరిస్థితి గతంలో ఎప్పుడూ లేదని.. అలాంటి కన్నా లక్ష్మీనారాయణను బీజేపీ ఏపీ అధ్యక్షుడిగా చేసిందనే విషయాన్ని మర్చిపోవద్దు అన్నారు జీవీఎల్ నరసింహారావు.
Read Also: Top Headlines @ 1 PM: టాప్ న్యూస్
కాగా, కన్నా లక్ష్మీనారాయణ బీజేపీకి గుడ్‌బై చెప్పేశారు.. తన నివాసంలో ఇవాళ ముఖ్యఅనుచరులతో సమావేశమైన కన్నా.. పార్టీలో గౌరవం లేదు, ప్రాధాన్యత ఇవ్వడం లేదు.. ఇలాంటి పరిస్థితుల్లో బీజేపీలో ఇమడలేక పోతున్నా.. అందుకే రాజీనామా చేయాలని నిర్ణయం తీసుకున్నానంటూ ప్రకటించారు. దీంతో, కన్నా నిర్ణయాన్ని ఆహ్వానించారు ఆయన అనుచరులు.. కన్నా వెంటే తమ ప్రయాణం అంటూ.. కన్నాకకు మద్దతుగా నినాదాలు చేశారు.. బీజేపీకి రాజీనామా చేసిన కన్నా లక్ష్మీనారాయణ.. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు తన రాజీనామా లేఖను ఫాక్స్ ద్వారా పంపించినట్టు వెల్లడించారు.. 2014లో మోడీ నాయకత్వంపై ఆకర్షితుడినై బీజేపీలోకి వచ్చా.. కానీ, సోమువీర్రాజు ఏపీ బీజేపీ అధ్‌యక్షడైన తర్వాత బీజేపీలో పరిస్థితులు మారాయి.. సోము వీర్రాజు పార్టీని సొంత సంస్థలాగా నడుపుతున్నారని ఆరోపణలు గుప్పించారు.. పార్టీలో చర్చించకుండా ఎంపీ జీవీఎల్ సొంతంగా వ్యవహరిస్తున్నారని విమర్శించిన కన్నా.. కేవలం సోము వీర్రాజు వల్లే బీజేపీకి రాజీనామా చేస్తున్నానంటూ మీడియా ముందు ప్రకటించారు.. అయితే, కన్నా లక్ష్మీనారాయణతో పాటు మరో 15 మంది నేతలు కూడా బీజేపీకి గుడ్‌బై చెప్పారు..