SVSN Varma: కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అడపాదడపా పిఠాపురం మాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత వర్మ వ్యవహారం తెరపైకి వస్తూనే ఉంది.. పవన్ కల్యాణ్ కోసం తన సీటును త్యాగం చేసిన ఆయన కొన్ని సార్లు ఓపెన్ కావడం.. దీనికి ఆయనకు కౌంటర్లు పడిన సందర్భాలు లేకపోలేదు.. అయితే, తాజాగా మంత్రి నారయణ టెలీకాన్ఫరెన్స్‌లో చేసిన వ్యాఖ్యలు వైరల్‌గా మారిపోయి.
Read Also: Kapil Sharma: కపిల్ శర్మ కెనడా కేఫ్‌లో మరోసారి కాల్పులు..
ఈ పరిణామాలతో పాటు.. గతంలో చేసిన కామెంట్లపై స్పందించారు వర్మ.. ఎవడో కర్మ ,గడ్డి పరక అంటే తనకేంటని అన్నారు పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ… గతంలో జనసేన ప్లీనరీలో నాగబాబు చేసిన కామెంట్స్ పై రిప్లై ఇచ్చారు వర్మ.. కూటమి బలోపేతం గురించి తాను మౌనంగా ఉంటున్నాను అన్నారు.. అయితే, మంత్రి నారా లోకేష్ కి ప్రమోషన్ రావాలని కోరుకుంటున్నానని తెలిపారు.. తానేంటో టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు తెలుసు అని స్పష్టం చేశారు.. మరోవైపు, మంత్రి నారాయణ తన గురించి మాట్లాడిన వీడియో ఉంటే చూపించాలని సవాల్ చేశారు.. అయితే, సందర్భాన్ని బట్టి ఆడియో బయటికి వచ్చిందని తెలిపారు.. సీఎం చంద్రబాబు ఆగమంటే ఆగాను.. ఎన్నికల్లో పనిచేయమంటే చేశానని తెలిపారు పిఠాపురం మాజీ ఎమ్మెల్యే శ్రీవత్సవాయి సత్యనారాయణ వర్మ (ఎస్‌వీఎస్‌ఎన్ వర్మ)..
కాగా, కాకినాడ జిల్లా ఇంఛార్జి మంత్రి పొంగూరు నారాయణ టెలీ కాన్ఫరెన్స్ వైరల్ గా మారింది.. నెల్లూరు సిటీ తెలుగుదేశం పార్టీ నేతలతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించిన ఆయన.. పిఠాపురం వ్యవహారాన్ని ప్రస్తావనకు తీసుకుని వచ్చారు.. లైన్ దాటిటే వ్యవహారం వేరే విధంగా ఉంటుందని వర్మ గురించి ఆడియోలో చెప్పారు. పిఠాపురంలో వర్మ ని జీరో చేశామని, పవన్ కల్యాణ్‌కి, వర్మకి రోజు ఘర్షణ జరుగుతుందని.. అందుకే అలా చేయాల్సి వచ్చిందని చెప్పారు.. 4 నెలలు నుంచి వర్మ ఇచ్చే స్టేట్‌మెంట్లతో అతనిని జీరోని చేసామని, తనను జీరోని చేశారని వర్మనే చెప్తున్నాడని క్యాడర్ కు క్లారిటీ ఇచ్చారు.. ఎన్డీఏ గవర్నమెంట్ ఉన్నప్పుడు పిఠాపురంలో స్టేట్‌మెంట్ ఇవ్వడానికి లేదని.. పిఠాపురంలో వర్మ మాట్లాడడానికి లేదని సీఎం చంద్రబాబు నాయుడు తన ముందే అతనికి చెప్పారని తెలిపారు మంత్రి నారాయణ.. అంతేకాదు, జనసేన వాళ్లు పిలిస్తే వర్మ వెళ్లి మాట్లాడాలి.. లేకపోతే లేదంటూ మంత్రి పొంగూరు నారాయణ చేసిన కామెంట్లు ఇప్పుడు సంచలనంగా మారగా.. ఇప్పుడు ఆ ఆడియోపై వర్మ స్పందించడం హాట్ టాపిక్‌గా మారిపోయింది..