Kakinada: కాకినాడ జిల్లాలోని తాళ్లరేవు మండలం ధరియాల తిప్ప సమీపంలో ONGC గ్యాస్ పైప్ లీక్ అయింది. రాత్రి 1.30 గంటల సమయంలో గ్యాస్ లీక్ కారణంగా భారీగా మంటలు ఎగిసిపడటంతో స్థానికులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. ఈ ఘటనపై జిల్లా కలెక్టర్, ఇతర అధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు ఫోన్ చేసి వివరాలు తెలుసుకున్నారు. సుమారు గంటన్నర వ్యవధిలోనే మంటలను అగ్నిమాపక సిబ్బంది అదుపులోకి తెచ్చారని అధికారులు సీఎంకు తెలియజేశారు. అదృష్టవశాత్తు ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం, ఆస్తినష్టం జరగలేదని వెల్లడించారు.
Read Also: Suicide Attempt: ప్రియుడి మోసం.. మూడో అంతస్తు నుంచి దూకేసిన ప్రియురాలు.. చివరకు?
అయితే, ఈ ఘటనలు మరోసారి జరగకుండా పైప్‌లైన్‌ను పూర్తిగా చెక్ చేయాలని కలెక్టర్‌కు సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. అలాగే, సమీప గ్రామాల ప్రజలు ఆందోళన చెందకుండా తగిన భద్రతా చర్యలు తీసుకోవాలని సూచనలు చేశారు. ఇకపై ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా ప్రతి క్షణం తనకు సమాచారం అందించాలని కలెక్టర్‌కు సీఎం చంద్రబాబు ఆదేశించారు. ఈ ఘటన ప్రస్తుతం కాకినాడ జిల్లాలో హాట్ టాఫిక్ గా మారింది.