Kakani Govardhan Reddy Launched Work Shop In Vijayawada: రైతే అసలైన శాస్త్రవేత్త అని.. రైతు మాత్రమే ప్రయోగాలు చేయడానికి అర్హుడని ఏపీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి చెప్పారు. వ్యవసాయం, హార్టికల్చర్, ప్రాసెసింగ్ చేసిన ఆహార పదార్ధాల ఎగుమతులలో ఏపీకి అవకాశాలు కల్పించడంపై విజయవాడలో వర్క్ షాప్ నిర్వహించారు. వ్తవసాయ ఉత్పత్తులను ఎగుమతి చేయడం ద్వారా రైతుకు లాభం చేకూర్చడానికి ప్రభుత్వం ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ వర్క్ షాప్‌ని ప్రారంభించిన అనంతరం మంత్రి కాకాణి మాట్లాడుతూ.. తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆదాయం రైతుకు ఎలా తీసుకురావాలనే లక్ష్యంతోనే ఈ వర్క్ షాప్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.
Birthday Party: పుట్టిన రోజే పొట్టన పెట్టుకున్నారు.. ఫుడ్ బిల్లు కట్టలేదని కత్తితో పొడిచేశారు..
వ్యవసాయం రైతుకు లాభసాటిగా మార్చాలని సీఎం జగన్ నిర్ణయాలు తీసుకుంటున్నారని అన్నారు. భగవంతుడికి ప్రసాదం పెట్టాలన్నా రైతు పండించినదే పెట్టాలన్నారు. రైతులకు మరింత వెసులుబాటు కలిగించేలా కార్యక్రమాలు చేయాలని సీఎం ఆదేశించారని.. మల్టీ పర్పస్ గోడౌన్‌లు వస్తున్నాయని చెప్పారు. సొసైటీలు, మార్కెట్ యార్డులు రాజకీయ పునరావాసాలుగా మారిపోకుండా డిజిటల్ విధానం తీసుకొచ్చామని తెలిపారు. వంద దేశాలకు పైగా మన వ్యవసాయ ఉత్పత్తులు ఎగుమతి చేసే అవకాశం ఉందన్నారు. ప్రధానమంత్రి ఫసల్ భీమా యోజన యూనివర్సల్‌గా మారడానికి కారణం మన ఆంధ్ర రాష్ట్రమేనని పేర్కొన్నారు.
Train Accident: 48 గంటలు నరకయాతన.. పొదల్లో సజీవంగా రైలు ప్రమాద బాధితుడు
ఇదే సమయంలో మంత్రి కాకాణి పొలిటికల్ కామెంట్లు కూడా చేశారు. ఆనం వెంకట రమణారెడ్డిపై ఎవరు దాడి చేశారనేది పోలీసులు తేలుస్తారని అన్నారు. అయితే.. ఈలోపే టీడీపీ వాళ్లే తనతో పాటు సజ్జల పేరు, ఇంకా ఎవరికి తోచిన వాళ్లు రకరకాల పేర్లు చెప్తున్నారని మండిపడ్డారు. టీడీపీ కామెంట్లను అస్సలు పట్టించుకోవాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పారు. కోర్టులో చోరీ అంశంలో సీబీఐ విచారణను స్వాగతిస్తున్నానని అన్నారు. కోర్టులో చోరీ విషయంలో ఏం జరిగిందో త్వరలో తేలుతుందన్నారు. అప్పుడే తాను కోర్టులో చోరీ అంశంపై కామెంట్ చేస్తానన్నారు.