K.A.Paul: గ్రౌండ్ లో పెట్టాల్సిన సభ రోడ్డు మీద పెట్టారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
K.A.Paul: నెల్లూరు జిల్లాలోని కందుకూరులో నిన్న నిర్వహించిన ‘ఇదేం కర్మ రాష్ట్రానికి’ సభలో తొక్కిసలాట చోటు చేసుకోవడంతో ఎనిమిమంది ప్రాణాలు కోల్పోయారు. అయితే దీనిపై ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏపాల్ స్పందించారు. తమదైన శైలిలో విరుచుకుపడ్డారు. గ్రౌండ్ లో పెట్టుకోవాల్సిన సభ రోడ్డుకు మీదకు రావటం వల్ల ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారని ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏపాల్ మండిపడ్డారు. కందుకూరు తొక్కిసలాట ఘటనా స్థలాన్ని ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ పరిశీలించారు. నలభై ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు నడిరోడ్డుపై సభ ఎలా పెడతారు? అంటూ ప్రశ్నించారు. గ్రౌండ్ లో పెట్టుకోవాల్సిన సభను రోడ్డుకు మీదకు రావటం వల్లే ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రాణాలు కోల్పోయిన వారికి ఆర్థిక సాయం అందిస్తామని చెప్తే సరిపోతుందా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఘటనపై పూర్తి స్థాయి విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు పాల్. వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్ననని తెలిపారు. మృతుల పిల్లలకు ఛారిటీ ద్వారా విద్యను అందిస్తామని పాల్ తెలిపారు.
Read also: Kakani Govardhan Reddy : చంద్రబాబు అధికార దాహం వల్లే ప్రమాదం
Also Read
- CM Chandrababu: డబుల్ ఇంజన్ సర్కార్ జోష్లో వెళ్తుంది.. పంచాయతి ఎన్నికల్లో ఇదే ఉత్సాహం చూపించాలి..
- Tirupati Crane Accident: తిరుపతిలో ఘోర ప్రమాదం.. ముగ్గురు మృతి, ఇద్దరికి గాయాలు
- AP Liquor Case: లిక్కర్ స్కాం కేసులో కీలక పరిణామం.. సిట్ విచారణకు మాజీ ఐఏఎస్
- TRAI New Recharge Rules: TRAI కొత్త నిబంధనలు.. Jio, Airtel, Vi రీఛార్జ్ ప్లాన్లలో కీలక మార్పులు..
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కందుకూరులో తన ‘ఇదేం కర్మ రాష్ట్రానికి’ అనే కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన బహిరంగ సభలో అపశృతి నెలకొంది. పామూరు రోడ్‌లోని ఎన్టీఆర్ సర్కిల్ వద్ద ఆయన ప్రసంగిస్తున్న సమయంలో.. సభలో గందరగోళం, తొక్కిసలాట చోటు చేసుకున్నాయి. భారీగా జనం తరలిరావడం వల్లే ఈ ఘటన జరిగింది. ఈ ఘటనలో ఎనిమంది కాలువలో పడి మృతి చెందగా.. మరికొంతమందికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని వెంటనే కందుకూరి ఏరియా వైద్యశాలకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటన గురించి తెలిసిన వెంటనే చంద్రబాబు తన సభను మధ్యలోనే ఆపేసి, ఆసుపత్రికి వెళ్లారు. బాధితుల్ని పరామర్శించారు. ఇది అత్యంత బాధాకరమైన ఘటన అని, కొన్ని సందర్భాల్లో మనం నిమిత్తమాత్రులం అవుతామని, విధిరాత ఇలా ఉందని తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతి చెందిన కార్యకర్తల కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున ఆర్థికసాయం అందించనున్నట్టు చంద్రబాబు తెలిపారు. వారికి పార్టీ అండగా నిలుస్తుందని హామీ ఇచ్చారు. తన 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఇలాంటి దుర్ఘటన ఎప్పుడూ జరగలేదన్నారు.
Malavika Sharma: రవితేజ హీరోయిన్ రీఎంట్రీ ఇస్తుందా?
తాజావార్తలు
-
Ketan Agarwal Case: కేతన్ హత్య 5 వేల పేజీల ఛార్జిషీట్.. పిచ్చిగా ప్రేమించిన కేతన్, హత్య చేసిన సియా..
-
Explainer: మరిన్ని విపత్తులు తప్పవా?
-
Lava Smart Phone: 6000mAH బ్యాటరీ, 120Hz రిఫ్రెష్ రేట్.. లావా నుంచి బడ్జెట్ ధరలో స్మార్ట్ ఫోన్ లాంచ్..
-
JNTU Sultanpur : జేఎన్టీయూ కాలేజీలో ర్యాగింగ్ కలకలం.. ఇద్దరు సీనియర్లు సస్పెండ్
-
Student Protests: రేప్ నుంచి దెయ్యం వరకు.. పుకార్లతో రగిలిపోతున్న యూనివర్సిటీలు.!
ట్రెండింగ్
-
100HP టర్బో ఇంజిన్తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!