నేడు, రేపు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఏపీలో పర్యటించనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో.. జేపీ నడ్డా ఏపీలోని విజయవాడకు చేరుకున్నారు. తన రెండురోజుల పర్యటనలో భాగంగా గన్నవరం విమానశ్రయానికి చేరుకోగా బీజేపీ రాష్ట్ర నాయకులు ఆయనకు ఘనస్వాగతం పలికారు. విజయవాడ, రాజమహేంద్రవరంలోని పలు కార్యక్రమాల్లో ఆయన పాల్గొననున్నారు.
అయితే విజయవాడలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. దేశాన్ని సురక్షితంగా ఉంచడానికి కేంద్రం కృషి చేస్తోందని, రాజకీయాల్లో మార్పు కోసం మనందరం కృషి చేయాలని బీజేపీ కార్యకర్తలకు, నేతలకు పిలుపునిచ్చారు. ఇది అర్జునుడు తపస్సు చేసిన ప్రాంతమన్న నడ్డా.. ప్రతీ బూత్ కమిటీలో అన్ని వర్గాలకు ప్రాతినిధ్యం కల్పించాలన్నారు. ఏపీలో పదివేలకు పైగా శక్తి కేంద్రాలు ఉన్నాయని, అన్ని వర్గాలకు చెందిన పార్టీ బీజేపీ అని జనంలోకి వెళ్లాలని ఆయన కార్యకర్తలకు, నేతలకు సూచించారు.