ECI: దేశవ్యాప్తంగా ఎన్నికల వాతావరణం నెలకొంది. గెలుపు కోసం అన్ని రాజకీయ పార్టీలు సిద్ధమయ్యాయి. ఇప్పుడు బీజేపీ నేతలపై కాంగ్రెస్ చీఫ్ ఎలక్టోరల్ అధికారికి ఫిర్యాదు చేసింది.
నేడు సంగారెడ్డి లోని నూతన బీజేపీ కార్యలయాన్ని ఢిల్లీ నుండి వర్చువల్ ద్వారా బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ప్రారంభించనున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు ఢిల్లీ నుంచి వర్చువల్ గా సంగారెడ్డి, భూపాలపల్లి, వరంగల్, జనగామ, భూపాలపల్లి, మహబూబాబాద్ తో పాటు ఏపీలోని అనంతపురం, చిత్తూరు జిల్లా పార్టీ కార్యాలయాలను బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా ప్రారంభించనున్నారు.
కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ లండన్‌లో చేసిన వ్యాఖ్యలపై బీజేపీ చీఫ్ జేపీ నడ్డా తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ప్రజాస్వామ్యం ప్రమాదంలో లేదని, కాంగ్రెస్ పార్టీకే ప్రమాదం ఉందని అన్నారు. దేశంలో ప్రమాదంలో ఉన్నది కాంగ్రెస్ పార్టీకే తప్ప ప్రజాస్వామ్యానికి కాదన్నారు.
భారతీయ జనతా పార్టీ దక్షిణాదిపై ప్రత్యేకంగా దృష్టి సారిస్తుంది.. అందులో తెలంగాణపై మరింత ఫోకస్ పెట్టింది.. ఇప్పటికే పలు సందర్భాల్లో ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా, ఇతర కేంద్ర మత్రులు, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా.. ఇలా ఎవరికి వీలైనప్పుడల్లా వారు వస్తూనే ఉన్నారు.. మునుగోడు బై పోల్ సందర్భంగా ఏర్పాటు చేసిన సభకు కూడా జేపీ నడ్డా రావాల్సి ఉన్నా.. చివరి క్షణాల్లో తన పర్యటన రద్దుచేసుకున్న విషయం విదితమే..…
బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్నారు. ఆలయ అధికారులు ఆయనకు ఘనస్వాగతం పలికారు. అమ్మవారిని దర్శించుకున్న అనంతరం నడ్డాకు పండితులు వేదాశీర్వచనం చేశారు. ఆ తర్వాత ప్రసాదం, చిత్రపటాని ఆయనకు అందజేశారు. ఎప్పటినుంచో జగన్మాత కనకదుర్గమ్మ దర్శనానికి రావాలని అనుకున్నానని.. ఇప్పటికి అమ్మవారిని దర్శించుకోవడం సంతోషంగా ఉందని చెప్పారు. దుర్గమ్మ కరుణ కటాక్షాలు ప్రజలందరిపై ఉండాలని ఆకాంక్షించారు. దేశ ప్రజలు సుభిక్షంగా ఉండాలని అమ్మవారి ఆశీస్సులతో మంచి పాలన అందాలని కోరుకున్నారు. KA PAUL:…
నేడు, రేపు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఏపీలో పర్యటించనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో.. జేపీ నడ్డా ఏపీలోని విజయవాడకు చేరుకున్నారు. తన రెండురోజుల పర్యటనలో భాగంగా గన్నవరం విమానశ్రయానికి చేరుకోగా బీజేపీ రాష్ట్ర నాయకులు ఆయనకు ఘనస్వాగతం పలికారు. విజయవాడ, రాజమహేంద్రవరంలోని పలు కార్యక్రమాల్లో ఆయన పాల్గొననున్నారు. అయితే విజయవాడలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. దేశాన్ని సురక్షితంగా ఉంచడానికి కేంద్రం కృషి చేస్తోందని, రాజకీయాల్లో మార్పు కోసం…
నరేంద్రమోదీ ప్రధాన మంత్రిగా బాధ్యతలు చేపట్టి ఎనిమిదేళ్లు పూర్తి చేసుకున్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా బీజేపీ పలు కార్యక్రమాలను నిర్వహిస్తోంది. ఈ క్రమంలోనే పార్టీని బలోపేతం చేసేందుకు, సంస్థాగతంగా ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు ఆ పార్టీ నేతలు కసరత్తులు ప్రారంభించారు. అయితే.. ఈ సందర్భంగా ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నేడు, రేపు ఆంధ్రప్రదేశ్ లో పర్యటించనున్నారు. రాష్ట్రంలోని పోలింగ్ కేంద్రాలను బీజేపీ శక్తికేంద్రాలుగా మార్చింది. వాటికి ఇంఛార్జీలను నియమించింది. ఆయా శక్తి కేంద్రాల ఇంఛార్జీలతో విజయవాడలో…